• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సుహాస్ న్యూ మూవీ రిలీజ్...

సుహాస్ న్యూ మూవీ రిలీజ్ డేట్.. బ్యాండ్ మోగించడమే

| టాలీవుడ్ లో కలర్ ఫొటో, రైటర్ పద్మభూషణ్ వంటి సినిమాలతో టాలెంటెడ్ యాక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సుహాస్

By - Tupaki Desk
Update: 2023-12-26 07:10 GMT

టాలీవుడ్ లో కలర్ ఫొటో, రైటర్ పద్మభూషణ్ వంటి సినిమాలతో టాలెంటెడ్ యాక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సుహాస్. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నారు. షార్ట్ ఫిలిమ్స్, యూట్యూబ్ వీడియోలతో కెరీర్ ప్రారంభించిన సుహాస్ కలర్ ఫొటో సినిమాతో హీరోగా మారారు.


మొదటి సినిమాతోనే తన నటనతో ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టించిన సుహాస్.. ఆ తర్వాత ఫ్యామిలీ డ్రామా అనే మూవీలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. ఇటీవలే రైటర్ పద్మభూషణ్ తో మంచి సక్సెస్ అందుకున్న సుహాస్.. తాజాగా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

కామెడీ డ్రామా కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ మంగళవారం అనౌన్స్ చేశారు. ఈ సినిమాను ఫిబ్రవరి 2న గ్రాండ్ గా థియేటర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. కంప్లీట్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రానికి థియేటర్స్ లో ఆడియెన్స్ కు యూనిక్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుందని చిత్రబృందం చెబుతోంది. కొన్ని రోజుల క్రితం టీజర్ ను విడుదల చేసి అంచనాలు పెంచారు మేకర్స్.

టీజర్ ప్రకారం.. మల్లి(సుహాస్‌) ఒక సెలూన్ నడుపుతూనే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్‌లో డప్పు కొడుతుంటాడు. అలాంటి వాడికి ఒక కాలేజీ అమ్మాయి పరిచయం కావడం.. వారిద్దరూ ప్రేమలో పడటం వల్ల ఎదురయ్యే సమస్యలు కథలు ప్రధానంగా ఉన్నట్లు టీజర్‌లో తెలుస్తోంది. టీజర్‌ చివరిలో సుహాస్‌కు గుండు కొట్టిస్తూ ఉన్న షాట్ హైలైట్‌గా ఉన్నా అందుకు ప్రధాన కారణాలు ఏంటి? అనే ప్రశ్న అందరిలోనూ మెదులుతుంది.

దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సుహాస్ తో పాటు శివాని నాగరం, సీనియర్ నటుడు గోపరాజు రమణ, పుష్ప ఫ్రేమ్ జగదీష్ బండారి తదితరులు కీలక పాత్రలు పోషించారు. గీతా ఆర్ట్స్ 2, మహాయణ మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎటాచ్మెంట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.

శేఖర్ చంద్ర సంగీతం అందించిన ఈ చిత్రానికి వాజిద్ బేగ్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. ఈ సినిమాతో పాటు రామ్ పసుపులేటి దర్శకత్వంలో ఆనందరావు అడ్వెంచర్స్ అనే చిత్రంలోనూ నటిస్తున్నారు సుహాస్. రీసెంట్ గా విడుదలైన టైటిల్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

Tags:    
  • Suhas 
  • Ambajipetamarriageband 
  • Filmindustry 
  • Dheerajmogilineni 
  • Dushyanthkatikineni 
  • Ga2pictures 

Similar News

AK 47 : ఆ కఠినమైన పని చేయడం అంత సులువు కాదు గురూజీ..!

2026-11-04 17:44 GMT

రాజమౌళి వచ్చాక ఇంటర్వెల్ సీన్స్ మారిపోయాయా? ఇంతకీ ఆయన ఏం చేశాడు...

2026-11-04 17:30 GMT

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

Copyright @2026

Powered by Blink CMS