పుష్ప మేకర్స్ పై తిరగపడుతున్న అల్లు ఫ్యాన్స్..?
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్నన తాజాగా పుష్ప2. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.;
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్నన తాజాగా పుష్ప2. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పుష్ప మూవీతోనే అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ గా మారిపోయారు. పుష్ప మూవీ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో రెండో పార్ట్ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈ మూవీ విడుదల చేస్తారా అని ఎదురు చూస్తుంటే, మూవీ కాస్త ఆలస్యమౌతూ వస్తోంది.
అందరు హీరోల సినిమాలు విడుదల తేదీలు ఎనౌన్స్ చేస్తున్నారు, ఏదో ఒక అప్ డేట్ అయినా వస్తోంది. కానీ, పుష్ప నుంచి కనీసం ఒక్క అప్ డేట్ కూడా లేదు. అప్పుడెప్పుడో అల్లు అర్జున్ ది ఫోటో విడుదల చేశారు. ఆ తర్వాత వేర్ ఈజ్ పుష్ప అంటూ ఓ గ్లింప్స్ వదిలారు. అంతే, మళ్లీ ఒక్క అప్ డేట్ కూడా లేదు. దీంతో ఫ్యాన్స్ బాగా హర్ట్ అయిపోయారు.
ఈ మూవీ మేకర్స్ పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ఈ మూవీ మేకర్స్ ని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. #wake up team pushpa ని ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఏదో ఒక అప్ డేట్ వచ్చే వరకు వదిలపెట్టం అంటూ, కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా మైత్రీ మూవీ మేకర్స్ ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
ఇక్కడితో ఆగకుండా, ఏకంగా మైత్రీ మూవీ ఆఫీసు, గీతా ఆర్ట్స్ ముందు ధర్నా కూడా చేయాలని ఫిక్స్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు హెచ్చరికలు జారీ చేశారట. ఇందులో నిజం ఎంత ఉందో తెలీదు కానీ, నెట్టింట మాత్రం హడావిడి మాములుగా లేదు. మరి, ఇప్పటికే పుష్ప2 నుంచి ఏదైనా అప్ డేట్ వస్తుందేమో చూడాలి.
కాగా, ఈ ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వ్యవహరిస్తుండగా, రష్మిక మందన్న కథానాయిక. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు పుష్ప: ది రూల్ 2024 వేసవిలో విడుదల కానుంది.