అల్లు శిరీష్-నయనిక నిశ్చితార్థ వీడియో
అల్లు కుటుంబం ఆనందోత్సాహలతో సెలబ్రేషన్ మోడ్‌లో ఉంది. దీనికి కారణం అల్లు శిరీష్ ఓ ఇంటివాడు అవుతుండటమే.;
అల్లు కుటుంబం ఆనందోత్సాహలతో సెలబ్రేషన్ మోడ్‌లో ఉంది. దీనికి కారణం అల్లు శిరీష్ ఓ ఇంటివాడు అవుతుండటమే. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చిన్న కుమారుడు, స్టార్ హీరో అల్లు అర్జున్ సోదరుడు అయిన శిరీష్ పెళ్లి గురించిన వార్తలు గత కొంతకాలంగా మీడియా హెడ్ లైన్స్ లో కొస్తున్నాయి. ఎట్టకేలకు తన స్నేహితురాలు నయనిక రెడ్డిని పెళ్లాడేందుకు సిద్ధమవుతున్నాడు. తాజాగా శిరీష్ తన నిశ్చితార్థానికి సంబంధించిన వీడియోను ఇన్ స్టాలో పోస్ట్ చేసారు. ఇప్పటికే నిశ్చితార్థం నుంచి కొన్ని వరుస ఫోటోలను శిరీష్ షేర్ చేయగా అవి వైరల్ గా మారుతున్నాయి.
తాజా వీడియోలో శిరీష్ గురించి నయనిక తాను తెలుసుకున్న ఒక విషయాన్ని రివీల్ చేసారు. అతడు ఒక చిన్న బేబి లాంటోడు.. చాలా కేరింగ్ గా ప్రేమగా చూసుకుంటాడు.. దానిని నేను చాలా ఇష్టపడతాను.. ప్రేమిస్తాను అని చెబుతున్నారు. దీనిని బట్టి కాబోయే భర్త శిరీష్ ని నయనిక ఎంతగా ఆరాధిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. కొత్త ప్రేమ జంట నడుమ గొప్ప అనుబంధాన్ని ఈ వీడియో ఆవిష్కరించింది.
శిరీష్ స్వయంగా ఈ వీడియోని షేర్ చేసి దానికి ఆసక్తికర వ్యాఖ్యను జోడించారు. ``నా నిశ్చితార్థం నుండి కొన్ని ప్రత్యేకమైన మూవ్ మెంట్స్ ని షేర్ చేస్తున్నాను. దీనిని `ఈట్ డ్రింక్ పార్టీ` చాలా అందంగా తీర్చిదిద్దింది. ఈ రోజును ప్రత్యేకంగా కెమెరాలో బంధించినందుకు అంతరిక బృందానికి ధన్యవాదాలు. ఈ వీడియో కోసం `సఖియే` పాటను స్కోర్ చేసినందుకు నా స్నేహితుడు జుడా శాండీకి అభినందనలు`` అని రాసారు శిరీష్. ప్రస్తుతం ఈ అందమైన జంట వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఇంతకుముందు అల్లు - మెగా కుటుంబాల సమక్షంలో జరిగిన నిశ్చితార్థం అనతరం ఈట్ డ్రింక్ పార్టీ నుంచి ఫోటోలు వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతున్నాయి.
నిశ్చితార్థ కార్యక్రమంలో అల్లు శిరీష్ తెలుపు రంగు డిజైనర్ దుస్తులను ధరించగా, నయనిక ఎరుపు రంగు లెహంగాలో అందంగా మెరిసిపోయారు. నిశ్చితార్థంలో మెగాస్టార్ చిరంజీవి- సురేఖ దంపతులు, రామ్ చరణ్ - ఉపాసన దంపతులు, వరుణ్ తేజ్- లావణ్య దంపతులు, సాయి ధరమ్ తేజ్ తదితరులు హాజరయ్యారు.
అల్లు శిరీష్ శిరీష్ పెళ్లి తర్వాత నటుడిగా కొనసాగుతారా లేదా? అన్నదానికి ఇంకా సమాధానం లేదు. అతడు చివరిసారిగా 2024లో విడుదలైన యాక్షన్-కామెడీ ఫాంటసీ చిత్రం `బడ్డీ`లో కనిపించారు.