ఒకప్పటి TV కథ కోసం బన్నీ చర్చలు.. వ్వాటే ట్రాక్!
పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమలో అత్యుత్తమ దశలో ఉన్నాడు.;
పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమలో అత్యుత్తమ దశలో ఉన్నాడు. ‘పుష్ప 2: ది రూల్’ సక్సెస్ తర్వాత, లైనప్ చిత్రాలపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం తమిళ దర్శకుడు అట్లీతో కలిసి ఓ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా (AA22) తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం హాలీవుడ్ స్థాయి విజువల్ వండర్‌గా రూపొందుతోందని సమాచారం. ఇక, గతంలో త్రివిక్రమ్‌తో ఓ మైతలాజికల్ కాన్సెప్ట్‌పై సినిమా చేసే ఆలోచనలు ఉన్నట్లు హింట్ ఇచ్చారు.
ఇక సోషల్ మీడియాలో #AA22 హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ లోకి రాగా, కొత్త ప్రాజెక్ట్స్ గురించి చర్చలు జోరందుకున్నాయి. అల్లు అర్జున్ ఆకాశమంత ఇమేజ్‌ను నిలబెట్టుకోవాలని ఆలోచిస్తున్నాడు. దానికి తగ్గ డైరక్టర్లు, కథలను ఎంచుకునేందుకు ఆయన ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. అట్లీతో బన్నీ ప్రస్తుతం ముంబైలో షూటింగ్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత, త్రివిక్రమ్‌తో మైథలాజికల్ కాన్సెప్ట్ కథ కోసం రెడీ అయ్యే అవకాశం ఉంది. అయితే త్రివిక్రమ్ వెంకటేష్‌తో బిజీగా ఉన్నందున, ఆ ప్రాజెక్ట్ కొంత ఆలస్యం కావచ్చు.
ఇప్పుడు మరో కొత్త టాక్ వైరల్ అవుతోంది. ఒకప్పటి టెలివిజన్ DD నేషనల్ సీరీస్ ‘శక్తిమాన్’ కథ బన్నీ వద్దకు వచ్చినట్లు తెలుస్తోంది. అన్ని కుదిరితే ఆ పాత్రలో కనిపించే అవకాశం ఉందట. ఈ సూపర్‌హీరో కాన్సెప్ట్‌ను గీతా ఆర్ట్స్‌తో కలిసి తెరకెక్కించే ఆలోచనలు ఉన్నట్లు తెలుస్తోంది.
రియాలిటీకి దూరంగా పవర్‌ఫుల్ కథలతో అల్లు అర్జున్ తన భవిష్యత్ కెరీర్‌ను సెట్ చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ‘శక్తిమాన్’ పిల్లలకు, పెద్దలకు పరిచయమైన సూపర్‌హీరో పాత్ర. గతంలో రణ్‌బీర్ సింగ్‌తో ఈ కాన్సెప్ట్‌పై ప్రయత్నాలు జరిగినా, అవి సక్సెస్ కాలేదు. ఇప్పుడు ఈ ఐడియాను తీసుకుని, ఆసక్తికరమైన కథతో అల్లు అర్జున్‌తో సినిమా తీయాలని గీతా ఆర్ట్స్ భావిస్తోంది.
ఈ చిత్రానికి మళయాళ దర్శకుడు బేసిల్ జోసెఫ్ దర్శకత్వం వహిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి, కానీ ఇంకా బన్నీ గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వలేదట. బేసిల్ జోసెఫ్ ఇటీవల అల్లు అర్జున్‌ను కలిసి కథ చెప్పాడని, ఆయనకు ఆ కథ బాగా నచ్చినట్లు సమాచారం. అయినా, ఇప్పటివరకు ఫైనల్ డిసిషన్ తీసుకోలేదని, ఒక్క సిట్టింగ్ మాత్రమే జరిగినట్లు తెలుస్తోంది.
మరోవైపు, బేసిల్ జోసెఫ్ అల్లు అర్జున్‌కు మరో మంచి కథ కూడా సెట్ చేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ శక్తిమాన్ సెట్ కాకపోతే ఇది పట్టాలెక్కే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా సైన్స్ ఫిక్షన్, మైథాలాజీ, సూపర్‌హీరో జోనర్‌ల్లో బన్నీ చేస్తున్న ప్రయత్నాలు డిఫరెంట్ గానే ఉన్నాయి. ఈ ప్రయోగాలు సెట్టయితే భారతీయ సినిమా పరిశ్రమకు కొత్త దిశను చూపిస్తాయని భావిస్తున్నారు.