బన్నీ- వంగా మూవీ సంగతేంటి?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో మూవీ రూపొందనున్నట్లు కొన్ని నెలల క్రితం అనౌన్స్మెంట్ వచ్చిన విషయం తెలిసిందే;

Update: 2025-06-17 06:49 GMT
బన్నీ- వంగా మూవీ సంగతేంటి?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో మూవీ రూపొందనున్నట్లు కొన్ని నెలల క్రితం అనౌన్స్మెంట్ వచ్చిన విషయం తెలిసిందే. సందీప్ వంగా తెరకెక్కించిన యానిమల్ సినిమాకు ముందే ఆ ప్రకటన వెలువడింది. కానీ అనుకోని కారణాల వల్ల ఇప్పటికీ ఆలస్యమవుతోంది.

స్పిరిట్ మూవీ కన్నా ముందు సందీప్ వంగా.. అల్లు అర్జున్ సినిమా చేస్తారని అంతా అనుకున్నారు. కానీ మొన్నటి వరకు బన్నీ.. పుష్ప-2తో బిజీగా ఉన్నారు. దీంతో వంగా.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లీడ్ రోల్ లో నటించనున్న స్పిరిట్ పై ఫోకస్ పెట్టారు. మోస్ట్ వైలెన్స్ సినిమాగా రానున్న ఆ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను పూర్తి చేస్తున్నారు.

త్వరలో రెగ్యులర్ షూటింగ్ ను మొదలు పెట్టనున్నారు. అయితే ఆయన లైనప్ లో యానిమల్ మూవీ సీక్వెల్ కూడా ఉంది. అదే సమయంలో ఇప్పుడు అల్లు అర్జున్.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో వర్క్ చేస్తున్నారు. సూపర్ హీరో కాన్సెప్ట్ తో రానున్నట్లు ప్రచారం జరుగుతున్న ఆ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి.

ఇప్పుడు అల్లు అర్జున్.. తెలుగు, మలయాళం, హిందీ ఇండస్ట్రీలకు చెందిన ఇతర దర్శకులతో చర్చలు జరుపుతున్నారని సమాచారం. త్రివిక్రమ్ తో ఆయన చేయాల్సిన సినిమా రద్దైందని.. జూనియర్ ఎన్టీఆర్ కు ఆ ప్రాజెక్ట్ వెళ్లిందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే అల్లు అర్జున్- అట్లీ మూవీ పూర్తవ్వడానికి సమయం ఎక్కువే పట్టనుంది.

దీంతో అటు అల్లు అర్జున్.. ఇటు సందీప్ వంగా.. ఇద్దరూ తమ కమిట్మెంట్స్ తో బిజీగా ఉన్నారు. కాబట్టి వారిద్దరి ప్రాజెక్ట్ ఎప్పుడు ఉంటుందో క్లారిటీ లేదు. రీసెంట్ గా బన్నీ బదులు రామ్ చరణ్ నటిస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగినా.. అది నిజం కాదని తెలుస్తోంది. రూమర్స్ నేనని సమాచారం.

అలా సందీప్ వంగా, అల్లు అర్జున్ ప్రాజెక్ట్ ఉండటం నిజమేనని.. కానీ ఎప్పుడు అనేది ఇంకా ఫిక్స్ అవ్వనట్లు తెలుస్తోంది. ఏదేమైనా వారి కాంబో.. ఇండస్ట్రీలో క్రేజీ కాంబినేషన్స్ లో ఒకటని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. మరి వంగా, బన్నీ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో.. ఇద్దరిలో ఎవరైనా రెస్పాండ్ అయ్యి చిన్న అప్డేట్ అయినా ఇస్తారేమో వేచి చూడాలి.

Tags:    

Similar News