అల్లు అర్జున్ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్.. రిస్క్ చేస్తున్నారా?

విషయంలోకి వెళ్తే.. తాజాగా ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా వచ్చిన డ్యూడ్ చిత్రానికి మ్యూజిక్ అందించిన సాయి అభ్యాంకర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నట్లు అల్లు అర్జున్ ప్రకటించారు.;

Update: 2025-11-04 12:05 GMT

గంగోత్రి సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మొదటి సినిమాతోనే తన నటనను ప్రూవ్ చేసుకున్న అల్లు అర్జున్.. ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ నటనలో మార్పులు చేసుకుంటూ.. నేడు ఐకాన్ స్టార్ గా పేరు సొంతం చేసుకున్నారు. అంతేకాదు తెలుగు సినీ ఇండస్ట్రీలో నేషనల్ అవార్డు అందుకున్న మొట్టమొదటి హీరోగా కూడా రికార్డు సృష్టించారు అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాలో తన అద్భుతమైన నటనతో దేశవ్యాప్తంగా పాపులారిటీ సొంతం చేసుకున్న అల్లు అర్జున్.. ఆ తర్వాత పుష్ప 2 చిత్రం చేసి అత్యధిక కలెక్షన్లు రాబట్టారు. ముఖ్యంగా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్ల సాధించిన రెండవ చిత్రంగా ఈ సినిమా నిలిచింది. దాదాపు 1400 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది.

దీంతో అల్లు అర్జున్ తదుపరి చిత్రంపై అందరి చూపు పడగా.. ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో AA22xA6 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా ప్రకటించారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. అంతేకాదు అవతార్ వంటి చిత్రాలకు పనిచేసిన అంతర్జాతీయ వీఎఫ్ఎక్స్ కంపెనీలు ఈ సినిమా కోసం పనిచేస్తున్నాయి. ఇకపోతే ఇలాంటి భారీ బడ్జెట్ చిత్రంలో సంగీత దర్శకుడిగా ఎవరు చేయబోతున్నారు అని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపించగా.. తాజాగా అల్లు అర్జున్ ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ను ఫిక్స్ చేస్తూ అనౌన్స్ చేసిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

విషయంలోకి వెళ్తే.. తాజాగా ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా వచ్చిన డ్యూడ్ చిత్రానికి మ్యూజిక్ అందించిన సాయి అభ్యాంకర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నట్లు అల్లు అర్జున్ ప్రకటించారు. ఇకపోతే ఈరోజు సాయి అభ్యాంకర్ పుట్టినరోజు కావడంతో అల్లు అర్జున్ సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.." నా సోదరుడు SAK కి పుట్టినరోజు శుభాకాంక్షలు. రాబోయే సంవత్సరంలో మీ అందరికీ విజయం, కీర్తి రావాలని కోరుకుంటున్నాను" అంటూ ట్విట్ చేశారు.

దీంతో ఈ చిత్రానికి సాయి అభ్యాంకర్ సంగీత దర్శకుడిగా అధికారికంగా ఎంపికయ్యారని తెలుస్తోంది. ఇకపోతే అల్లు అర్జున్ అభిమానులలో ఈ విషయం అంచనాలు పెంచినా సదరు నెటిజన్లు మాత్రం రిస్క్ చేస్తున్నారేమో అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక సినిమాకి సంగీతం అందించి సక్సెస్ కావడంతోనే.. ఏకంగా అన్ని వందల కోట్ల భారీ బడ్జెట్ మూవీకి ఈ యువ సంగీత దర్శకుడిని ఎంపిక చేయడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. వాస్తవానికి ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తారని వార్తలు వచ్చినా ఇప్పుడు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ను ఎంపిక చేయడంతో అందరూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి అల్లు అర్జున్ నిర్ణయం ఏ మేరకు ఈ చిత్రానికి ప్లస్ అవుతుందో చూడాలి.



Tags:    

Similar News