కోలీవుడ్ స్టార్స్ బిగ్ స్ట్రగుల్స్ బన్నీకి వరంగా మారాయా?
కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్స్‌గా బాక్సాఫీస్ వద్ద అత్యంత ప్రభావాన్ని చూపించిన స్టార్స్ రజనీకాంత్, దళపతి విజయ్, తల అజిత్, వెర్సటైల్ హీరో సూర్య.;
కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్స్‌గా బాక్సాఫీస్ వద్ద అత్యంత ప్రభావాన్ని చూపించిన స్టార్స్ రజనీకాంత్, దళపతి విజయ్, తల అజిత్, వెర్సటైల్ హీరో సూర్య. వీళ్లలో రజనీకాంత్, విజయ్, అజిత్, సూర్య వంటి స్టార్లు బాక్సాఫీస్ వద్ద వంద నుంచి రూ.500 కోట్ల వరకు పుల్ చేయగలరు. అయితే రజనీకాంత్ ఇతర హీరోలతో కలిసి తన ఏజ్‌కు తగ్గ పాత్రలు, కథల్ని ఎంచుకుంటుండటంతో బాక్సాఫీస్ వద్ద యూత్‌ఫుల్ క్రేజీ కమర్షియల్ సినిమాలతో ప్రభావాన్ని చూపించే బాధ్యత విజయ్, అజిత్, సూర్యలపై పడింది. ఇదే సమయంలో కోలీవుడ్ ఇండస్ట్రీకి దళపతి షాక్ ఇచ్చాడు.
రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో సినిమాలకు గుడ్ బై చెబుతుండటంతో కోలీవుడ్ భారీ లోటుని ఎదుర్కోబోతోంది. భారీ బడ్జెట్ సినిమాలకు గత కొంత కాలంగా విజయ్ కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాడు. దర్శకులు కూడా విజయ్ కోసం సరికొత్త కథలని వండి వారిస్తూ బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో సందడి చేశారు. అయితే ఇప్పడు విజయ్ 'జన నాయకుడు'తో సినిమాలకు గుడ్ బై చెబుతుండటంతో స్టార్ డైరెక్టర్లు, స్రొడ్యూసర్లు ఇతర భాషల స్టార్ల వైపు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సీనియర్ స్టార్‌గా రజనీ తన మార్కుని చూపిస్తున్నా విజయ్ తరహాలో మాత్రం ప్రభావితం చేసే స్టార్ కోలీవుడ్‌లో కనిపించడం లేదు.
ఆ లోటుని అజిత్ భర్తీ చేస్తాడా అంటే అది జరిగేలా కనిపించడం లేదు. విజయ్ తరహాలో తమిళ, తెలుగు భాషల్లో అజిత్ బాక్సాఫీస్‌ని, ప్రేక్షకుల్ని ప్రభావితం చేయలేడన్నది అందరికి తెలిసిందే. విజయ్‌కి తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి క్రేజ్ ఉంది. అజిత్‌కు తమిళ ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ తెలుగులో యాభై శాతం కూడా లేకపోవడం గమనార్హం. అంతే కాకుండా అజిత్ స్టార్‌డమ్, భారీ సినిమాల వెంట పరుగెత్తడం లేదు. తన ప్యాషన్‌కు తగ్గట్టుగా కార్ రేసింగ్‌లకు ప్రాధాన్యతననిస్తున్నాడు. ఇదే ఇప్పుడు కోలీవుడ్‌కు ప్రధాన సమస్యగా మారబోతోంది. అజిత్ కంటే సూర్యకు తమిళతో పాటు తెలుగు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది.
అయితే గత కొంత కాలంగా భారీ సినిమాలతో ఆకట్టుకోవాలని సూర్య చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించడం లేదు. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న సూర్య ప్రస్తుతం పక్కా తమిళ నేటివిటీతో కరుప్పు పేరుతో ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఇది సక్సెస్ అయితే గానీ సూర్య భవితవ్యం ఏంటో తెలియదు. సూర్య తరువాత వార్తల్లో నిలుస్తున్న హీరో ధనుష్. మంచి హీరోగా, నటుడిగా పేరున్నా పాన్ ఇండియా సినిమాలతో రూ.300 కోట్ల వసూళ్లని పుల్ చేయగల సత్తా తనకు లేదు. ఇంకా టైమ్ పడుతుంది.
ఈ నేపథ్యంలోనే కోలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ల చూపు టాలీవుడ్ స్టార్స్‌పై పడుతోంది. ఈ విషయంలో ముందు వరుసలో నిలుస్తున్న హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. దీనికి నిదర్శనమే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ, స్టార్ ప్రొడక్షన్ కంపనీ సన్ పిక్చర్స్ కోలీవుడ్ స్టార్లని పక్కన పెట్టి బన్నీతో భారీ పాన్ ఇండియా మూవీకి శ్రీకారం చుట్టడం. `పుష్ప`, పుష్ప 2 సినిమాల తరువాత తమిళ మార్కెట్‌లోనూ బలమైన వసూళ్లని రాబట్టడంతో ఇప్పుడు కోలీవుడ్ దర్శకుల చూపు బన్నీపై పడుతోంది.
అట్లీ, లోకేష్ కనగరాజ్, నెల్సన్ దిలీప్‌కుమార్ వరుసగా అల్లు అర్జున్‌తో కలిసి భారీ పాన్ ఇండియా సినిమాలకు శ్రీకారం చుట్టడానికి రెడీ అవుతున్నారు. టాలీవుడ్ స్టార్ హీరో ఇప్పుడు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్లకు ఫస్ట్ ప్రియారిటీగా మారడం చర్చనీయాంశంగా మారుతోంది. బన్నీ ఎంట్రీతో కోలీవుడ్ ఇండస్ట్రీలో విప్లవాత్మక మార్పులు రావడం ఖాయమని, కోలీవుడ్ స్టార్స్ బిగ్ స్ట్రగుల్స్ బన్నీకి వరంగా మారిందదనే సంకేతాలు వినిపిస్తున్నాయి