ఐకాన్ స్టార్ లైనప్ లో 'రావణం'

స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్‌గా ఎదిగిన అల్లు అర్జున్, తన ప్రాజెక్టుల ఎంపికలోనూ సరికొత్త స్టెప్‌ వేస్తున్నాడు.;

Update: 2025-07-02 11:30 GMT

స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్‌గా ఎదిగిన అల్లు అర్జున్, తన ప్రాజెక్టుల ఎంపికలోనూ సరికొత్త స్టెప్‌ వేస్తున్నాడు. పుష్ప సిరీస్‌తో దేశవ్యాప్తంగా మాస్‌ ఇమేజ్‌ను క్రియేట్ చేసిన ఆయన, ఇప్పుడు తన తదుపరి సినిమాల విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు. కమర్షియల్‌గా పెద్ద రేంజ్‌లో ఆలోచిస్తూ, దానికి తగ్గట్టే దర్శకులను ఫిక్స్ చేస్తున్నాడు బన్నీ. ఆ క్రమంలోనే అట్లీ, సందీప్ రెడ్డి వంగా లాంటి మాస్ డైరెక్టర్లతో సినిమాలకు కమిట్ కావడం గమనార్హం.

ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ భారీ యాక్షన్ మూవీ చేస్తున్నారు బన్నీ. ఇది అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకునేలా మాస్, ఎమోషనల్ టచ్‌తో రూపొందనుందని టాక్. ఇక అందులోకి 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' లాంటి సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సందీప్ వంగాతో మరో భారీ మూవీకి బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ రెండు సినిమాలు భారీ బడ్జెట్‌లో, భారీ అంచనాల మధ్య రూపొందనున్నాయి.

ఇప్పుడు ఈ లైన్‌అప్‌ లోకి మరో పెద్ద ప్రాజెక్ట్ వచ్చి చేరింది. అదే 'రావణం'. తాజాగా నిర్మాత దిల్ రాజు ఒక ఇంటర్వ్యూలో “మా బ్యానర్లో అల్లు అర్జున్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రావణం అనే సినిమా ఉంటుంది” అంటూ క్లారిటీ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ చాలా కాలంగా వాయిదాపడుతూ వస్తున్నా.. ఇప్పుడు మాత్రం అధికారికంగా దిల్ రాజు నుంచి ఈ ప్రకటన రావడంతో కొత్త ఊపొచ్చింది.

‘రావణం’ అనే టైటిల్‌లోనే అంతటి బలమైన నెగెటివ్ షేడ్ ఉన్నా.. బన్నీ మాస్ పాత్రకు న్యాయం చేసేలా ఈ స్క్రిప్ట్ ఉండబోతుందని సినీ వర్గాల టాక్. అయితే ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్‌తో ‘డ్రాగన్’ సినిమా చేస్తున్నాడు. ఇది భారీ స్థాయిలో రూపొందుతోంది. ఇక ‘సలార్ 2’ ప్రభాస్‌తో సిద్ధమవుతోంది. ఈ రెండు సినిమాలు పూర్తయ్యే వరకూ ‘రావణం’ సెట్స్ పైకి వెళ్లే అవకాశం లేదు. దాంతో ఈ ప్రాజెక్ట్‌ ఇంకా టైమ్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడే దిల్ రాజు అధికారికంగా ధృవీకరించడంతో.. బన్నీ, నీల్ కాంబినేషన్‌పై ఆసక్తి మళ్లీ పెరిగింది.

ఇక బన్నీ కెరీర్ చూసుకుంటే.. పుష్ప 2 తర్వాత వందకోట్ల బడ్జెట్ చిత్రాలే మాత్రమే చేస్తున్నాడు. కథకు పెద్ద ప్రాముఖ్యత ఇస్తూ, కమర్షియల్‌ మార్కెట్‌ మీద దృష్టి పెడుతున్నాడు. ప్రస్తుతం ఉన్న ఈ మూడు ప్రాజెక్ట్‌లతో బన్నీ కెరీర్‌లోని తదుపరి దశను డిఫైన్ చేయనున్నాడు. ముఖ్యంగా ‘రావణం’ లాంటి చిత్రంతో మాస్ షేడ్‌లో కొత్త తరహా బన్నీని చూడబోతున్నాం అనే ఆసక్తి అభిమానుల్లో ఉంది.

Tags:    

Similar News