ప్రభాస్ - రామ్ చరణ్ లను వెనక్కి నెట్టి అలాంటి రికార్డ్ సృష్టించిన బన్నీ!

ఇటీవలకాలంలో హీరోలు భాషతో సంబంధం లేకుండా పాన్ ఇండియా వైడ్ సినిమాలు చేస్తూ వివిధ భాషలలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంటున్నారు.

Update: 2026-06-16 06:47 GMT

ఇటీవలకాలంలో హీరోలు భాషతో సంబంధం లేకుండా పాన్ ఇండియా వైడ్ సినిమాలు చేస్తూ వివిధ భాషలలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంటున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ హీరోలు బాలీవుడ్లో అటు బాలీవుడ్ హీరోలు టాలీవుడ్ లో ఇలా ఎవరికి వారు సత్తా చాటుతూ ఆడియన్స్ ను అలరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఒక టాలీవుడ్ హీరోకి వేరే ఇండస్ట్రీలో అక్కడ హీరోలతో సమానంగా క్రేజ్ ఉందని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు రామ్ చరణ్ , ప్రభాస్ లాంటి స్టార్ హీరోలను సైతం ఆయన వెనక్కి నెట్టి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఆయన ఎవరో కాదు అల్లు అర్జున్.

రీ రిలీజ్ లో పెద్ద చిత్రాలను వెనక్కి నెట్టిన బన్నీ..

పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా అవతరించి, అందరి దృష్టిని ఆకట్టుకున్న అల్లు అర్జున్ ఆ సినిమా తర్వాత పుష్ప 2 సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఇక ఇప్పుడు కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో కళానిధి మారన్ సన్ పిక్చర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న రాక సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇకపోతే ఈయన నుంచి పుష్ప 2 సినిమా తర్వాత మరో సినిమా తెరపైకి రాలేదు. ఉన్నది కాస్త రాకా.. అది కూడా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలోనే ఆయన సినిమాలు ఒక్కటి కూడా లేకపోవడంతో హ్యాపీ సినిమాను మాలీవుడ్ లో రీ రిలీజ్ చేశారు. అది కూడా 4కే వెర్షన్ లో రిలీజ్ చేశారు. అయితే ఈ రీ రిలీజ్ వెర్షన్ అక్కడ సంచలనం సృష్టించింది.

ఆ రికార్డు సృష్టించిన ఏకైక హీరోగా గుర్తింపు..

ముఖ్యంగా ప్రభాస్ - ది రాజా సాబ్, రామ్ చరణ్ పెద్ది చిత్రాలను కూడా వెనక్కి నెట్టి రీ రిలీజ్ చిత్రమైన హ్యాపీ సినిమా అక్కడ రికార్డు క్రియేట్ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.ముఖ్యంగా మాలివుడ్ లో బన్నీకి అంత గుర్తింపు ఉండడాన్ని మరోసారి ఈ సినిమా గుర్తు చేసింది. అసలు విషయంలోకెళితే పెద్ది, ది రాజాసాబ్ వంటి కొత్త తెలుగు చిత్రాలు కూడా కేరళలో రూ.1కోటి మార్క్ ను కూడా అందుకోలేకపోయాయి. కానీ మలయాళంలో రీ రిలీజ్ అయిన హ్యాపీ చిత్రం మాత్రం కేరళలో కేవలం మూడు రోజుల్లోనే అద్భుతంగా రూ.95.5 లక్షల గ్రాస్ తో నాల్గవ రోజు అడ్వాన్సులతో కలిపి ఇప్పటికే ఒక కోటి మైలురాయిని అందుకుంది. అంటే మొదటి రోజు రూ.35 లక్షలు, రెండవ రోజు రూ.28 లక్షలు, మూడవ రోజు రూ.32.5 లక్షలు పైగా మలయాళ వర్షన్ తో ఈ మైలురాయిని సాధించడం బన్నీకే సాధ్యమైంది.. పైగా కేరళలో ఏ మలయాళీ నటుడు సాధించని అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ ను మలయాళీయేతర నటుడు సొంతం చేసుకొని రికార్డు సృష్టించారు.

Tags:    

Similar News