• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  దేవర రిజల్ట్... అదే...

దేవర రిజల్ట్... అదే కాన్ఫిడెన్స్ లో బన్నీ

| అదే సమయంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. దేవర రిజల్ట్ తర్వాత ఫుల్ ఫ్రీగా.. రిలాక్స్డ్ మోడ్ లో ఇప్పుడు ఉన్నారని కొందరు నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

By - Tupaki Desk
Update: 2024-10-03 13:30 GMT

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన దేవర పార్ట్-1 రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 27వ తేదీన విడుదల అయిన ఆ మూవీ.. మంచి రెస్పాన్స్ అందుకుని దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ లో కూడా అదరగొడుతోంది. ఓవర్సీస్ లోనూ భారీ వసూళ్లను సాధిస్తోంది. ఇప్పటి వరకు రూ.390 కోట్లకు పైగా వసూలు చేసిన దేవర.. సక్సెస్ ఫుల్ గా థియేట్రికల్ రన్ కొనసాగిస్తోంది.

దీంతో దేవర టీమ్ ఫుల్ హ్యాపీ మోడ్ లో ఉంది. త్వరలో సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేయనున్నారు మేకర్స్. అదే సమయంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. దేవర రిజల్ట్ తర్వాత ఫుల్ ఫ్రీగా.. రిలాక్స్డ్ మోడ్ లో ఇప్పుడు ఉన్నారని కొందరు నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. అయితే దేవరకు.. అల్లు అర్జున్ కు లింక్ ఏంటి అని ఆలోచిస్తున్నారా?.. నెటిజన్ల కామెంట్స్ ప్రకారం.. అసలు విషయమేమిటంటే?

ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. వైసీపీ నంద్యాల అభ్యర్థి, తన ఫ్రెండ్ శిల్పా రవి ఇంటికి బన్నీ వెళ్లి మరీ విష్ చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ఒక ట్వీట్ చేసి.. వైసీపీ అభ్యర్థి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లడంతో మెగా ఫ్యాన్స్.. జీర్ణించుకోలేకపోయారు. పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. ఆ సమయంలో మెగా బ్రదర్ నాగ బాబు.. పరోక్షంగా ట్వీట్ చేయడంతో బన్నీ ఫ్యాన్స్ కూడా కౌంటర్స్ ఇచ్చారు. అలా మెగా, అల్లు ఫ్యాన్స్.. మధ్య పెద్ద యుద్ధమే జరిగింది

ఆ సమయంలో జనసేన పార్టీకి చెందిన కొందరు నేతలు.. అల్లు అర్జున్ అప్ కమింగ్ మూవీ పుష్ప -2 రిలీజ్ ను అడ్డుకుంటామని హెచ్చరించారు. కొందరు మెగా అభిమానులు కూడా సోషల్ మీడియాలో అలాంటి పోస్టులే పెట్టారని వార్తలు వచ్చాయి. అయితే ఎవరు ఎన్ని చెప్పినా.. ఎన్ని వార్నింగ్స్ ఇచ్చినా.. కంటెంట్ బాగుంటే సినిమాను ఎవరూ ఆపలేరు. రీసెంట్ గా దేవర విషయంలోనూ అదే జరిగింది.

దేవర రిలీజ్ అయ్యాక.. కొరటాల శివ లాస్ట్ మూవీ ఆచార్య కన్నా వర్స్ట్ గా మూవీ ఉందని కొందరు దుష్ప్రచారం చేశారు. కానీ సినిమా మాత్రం.. అందరినీ అలరిస్తూ వరల్డ్ వైడ్ గా దూసుకుపోతోంది. అయితే అల్లు అర్జున్.. తన పుష్ప సీక్వెల్ కంటెంట్ పై నమ్మకంతో ఉన్నారని ఇదివరకే క్లారిటీ వచ్చేసింది. అందుకే ఆయన రిలాక్స్ మూడ్ లో ఇప్పుడు ఉండి ఉంటారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఫ్యాన్ వార్‌ లు.. సినిమాపై ఎఫెక్ట్ చూపించవని చెబుతున్నారు.

Tags:    
  • Alluarjun 
  • Pushpa 
  • Devara 
  • Jrntr 
  • Sukumar 
  • Koratalasiva 
  • Tollywood 
  • Filmindustry 
  • Devarasuccessmeet 
  • Mythrimoviemakers 

Similar News

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

Copyright @2026

Powered by Blink CMS