హాలీవుడ్‌ స్టూడియోలో అల్లు వారి చిల్‌ మూమెంట్స్‌

యూనివర్శల్‌ స్టూడియోస్ హాలీవుడ్‌లో అల్లు అర్హ, అల్లు అయాన్‌లు తండ్రి అల్లు అర్జున్‌తో కలియ తిరుగుతూ అక్కడి లొకేషన్స్‌ను ఎంజాయ్‌ చేస్తూ ఉన్నారు.;

Update: 2025-07-17 10:03 GMT

పుష్ప 2 సినిమా విడుదల తర్వాత అల్లు అర్జున్‌ చాలా అరుదుగా మాత్రమే బయట కనిపిస్తున్నాడు. ఆ సినిమా విడుదలైన కొన్ని వారాల తర్వాత విదేశాలకు ఫ్యామిలీతో కలిసి హాలీడే ట్రిప్ వేసిన అల్లు అర్జున్‌ ఆ మధ్య అట్లీతో కలిసి సినిమా పనుల్లో బిజీ బిజీగా గడిపాడు. ప్రస్తుతం అల్లు అర్జున్‌ అమెరికాలో ఫ్యామిలీతో మరోసారి హాలీడేస్‌ను ఎంజాయ్‌ చేస్తున్నాడు. ఈసారి హాలీవుడ్‌ స్టూడియోగా పేరు గాంచిన యూనివర్శల్‌ స్టూడియోస్‌ హాలీవుడ్‌లో సందడి చేశాడు. ఆయన ఇద్దరు పిల్లలతో కలిసి స్టూడియోలో సరదాగా తిరుగుతూ, అక్కడ ప్రదేశాలను ఆస్వాదిస్తున్న ఫోటోలను స్నేహా రెడ్డి తన సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫామ్‌ పై షేర్‌ చేయడం జరిగింది.


యూనివర్శల్‌ స్టూడియోస్ హాలీవుడ్‌లో అల్లు అర్హ, అల్లు అయాన్‌లు తండ్రి అల్లు అర్జున్‌తో కలియ తిరుగుతూ అక్కడి లొకేషన్స్‌ను ఎంజాయ్‌ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. అల్లు అర్హ, అయాన్‌లు చాలా పెద్ద వారు అయ్యారు అనిపిస్తుందని కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే, కొందరు మాత్రం అల్లు అర్జున్‌లో మునుపటి ఉత్సాహం కనిపిస్తుందని, ఆయన మరింత యాక్టివ్‌గా ఈ ఫోటోల్లో కనిపిస్తున్నాడని, ఇదంతా కూడా అట్లీ సినిమా కోసం అయ్యి ఉంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అల్లు వారి హాలీవుడ్‌ యూనివర్శల్‌ స్టూడియో విజిటింగ్‌ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.


ఎలాంటి ఫిల్టర్‌లు లేకుండా, పెద్దగా ఎఫెక్ట్‌లు లేకుండా సింపుల్‌ ఫోటోలను షేర్‌ చేసిన అల్లు స్నేహా రెడ్డి అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అల్లు అర్జున్‌ ఈ ఫోటోల్లో చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. పుష్ప ఇంపాక్ట్‌ నుంచి బన్నీ పూర్తిగా బయట పడ్డట్లుగా ఈ ఫోటోలను చూస్తూ ఉంటే అనిపిస్తుందని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బన్నీ ని పుష్ప సినిమా కారణంగా దాదాపు రెండున్నర మూడు ఏళ్ల పాటు పొడవైన జుట్టు, గడ్డంతో చూశాం. ఇప్పుడు అతడు పూర్తిగా స్టైలిష్ లుక్‌లోకి మారాడు. ఈ ఫోటోల్లో ఆయన్ని చూస్తుంటే పాత బన్నీ గుర్తుకు వస్తున్నాడని కొందరు అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అల్లు అర్జున్‌ కొత్త లుక్‌ అని కూడా ఈ ఫోటోలను అభిమానులు షేర్ చేస్తున్నారు.


పుష్ప 2 సినిమా తర్వాత బన్నీ తన తదుపరి సినిమాను త్రివిక్రమ్‌తో చేయాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా క్యాన్సల్‌ అయింది. ఆ వెంటనే అట్లీతో సినిమా కన్ఫర్మ్‌ అయింది. వీరిద్దరి కాంబో మూవీ గురించి జాతీయ మీడియాలోనూ ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. ఈ మధ్య కాలంలో సౌత్‌ ఇండియాలో రానటువంటి భారీ బడ్జెట్‌, విభిన్నమైన కాన్సెప్ట్‌తో ఈ సినిమా రాబోతుంది అనే గట్టి ప్రచారం జరుగుతోంది. సన్ పిక్చర్స్‌ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే. వెయ్యి కోట్ల సినిమా తర్వాత అట్లీ చేస్తున్న సినిమా ఇదే కావడంతో అంచనాలు ఉన్నాయి. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్‌ చేస్తున్న సినిమా కూడా ఇదే కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. 2026 చివరి వరకు సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News