అరెరే.. అది ఫేక్ వీడియోనా? తెగ వైరల్ చేశారుగా!

అయితే ఆ సినిమాలోని డాకో డాకో మేక సాంగ్ కు అమెరికాస్ గాట్ టాలెంట్‌ లోని ఒక డ్యాన్స్ గ్రూప్ ప్రదర్శన ఇస్తున్నట్లు చూపించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.;

Update: 2025-08-05 20:30 GMT

సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏ వీడియో వైరల్ అవుతుందో తెలియదు. కొన్ని సార్లు ఎడిట్ చేసిన వీడియోస్, ఫేక్ వీడియోస్ కూడా ట్రెండింగ్ లోకి వస్తున్నాయి. అది తెలియక నెటిజన్లు తెగ షేర్ చేస్తుంటారు. రీసెంట్ గా అదే జరిగింది. దాన్ని ఏకంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా షేర్ చేసి వావ్ అంటూ కొనియాడారు. కానీ అసలు మ్యాటర్ తర్వాత తెలిసింది.

అల్లు అర్జున్ లీడ్ రోల్ లో నటించిన పుష్ప మూవీ ఎలాంటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. రెండు భాగాల్లో వచ్చిన ఆ మూవీ.. అందరినీ మెప్పించింది. సుకుమార్ దర్శకత్వంతోపాటు దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్.. సినిమాను ఓ రేంజ్ లోకి తీసుకెళ్ళింది.

అయితే ఆ సినిమాలోని డాకో డాకో మేక సాంగ్ కు అమెరికాస్ గాట్ టాలెంట్‌ లోని ఒక డ్యాన్స్ గ్రూప్ ప్రదర్శన ఇస్తున్నట్లు చూపించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. దీంతో అంతా పుష్ప మూవీ మరో ఘనత అందుకుందని భావించారు. భారతీయ సినిమాలోని తెలుగు పాట అత్యుత్తమ ప్రదర్శనకు ప్రశంసలు అందుకోవడం విశేషమనుకున్నారు.

వీడియోను బన్నీ ఫ్యాన్స్ ఫుల్ గా షేర్ చేసి పుష్ప గాడి రూల్ అంటూ సందడి చేశారు. పుష్ప టీమ్ ఏకంగా.. వీడియోను షేర్ చేస్తూ "ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప గ్లోబల్ ఫినోమినా.. బి యునిక్ క్రూ గ్రూప్ అమెరికాస్ గాట్ టాలెంట్ సీజన్ 20 వేదికపై పుష్ప పాటకు ప్రదర్శన ఇచ్చింది. సీజన్ లోనే ఉత్తమ ప్రదర్శనగా న్యాయనిర్ణేతలు ప్రశంసించారు" అని తెలిపింది.

ఆ తర్వాత అల్లు అర్జున్ కూడా వీడియోను రీట్వీట్ చేసి, వావ్ … మైండ్ బ్లోయింగ్ అని అన్నారు. దీంతో ఆ వీడియో ఇంకా వైరల్ గా మారింది. అయితే ఆ వీడియో ఇప్పుడు ఎడిటెడ్ అని తేలింది. పుష్ప ట్రాక్ కాదు, ఇమాజిన్ డ్రాగన్స్ ద్వారా బిలీవర్‌ కు బి యూనిక్ క్రూ గ్రూప్ డ్యాన్స్ వేసింది. కానీ ఎడిటెడ్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

దీంతో అంతా నిజం అనుకున్నారు. పుష్ప టీమ్ సహా అల్లు అర్జున్ కూడా నమ్మారు. కానీ చివరకు ఎడిట్ చేసిన వీడియోగా తెలిసింది. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అరెరే ఎడిటెడ్ వీడియోనా అంటూ నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ఎంత పని చేశార్రా అంటూ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. తెగ వైరల్ అయిందిగా అంటూ గుర్తు చేసుకుంటున్నారు.

Full View
Tags:    

Similar News