• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బాక్సాఫీస్‌ను కూడా ఇలాగే...

బాక్సాఫీస్‌ను కూడా ఇలాగే పేల్చేయాలి

| పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప ది రూల్’ సినిమా పనులతో బిజీగా ఉన్నప్పటికీ.. ఖాళీ సమయాల్లో మాత్రం ఫ్యామిలీతోనే ఎక్కువగా గడుపుతూ ఉంటాడు.

By - Tupaki Desk
Update: 2024-11-01 07:30 GMT

తెలుగు సినిమా స్థాయి గతంలో కంటే ఇప్పుడు గణనీయంగా పెరిగిపోయింది. దీంతో టాలీవుడ్‌కు చెందిన హీరోలు అందరూ పాన్ ఇండియా స్టార్లుగా మారడం కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇందులో భాగంగానే వరుస పెట్టి ఒకరి తర్వాత ఒకరు భారీ ప్రాజెక్టులను చేస్తున్నారు. అందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు. ‘పుష్ప’ మూవీతో అతడు నేషనల్ అవార్డును అందుకోవడంతో పాటు నేషనల్ రేంజ్‌కు ఎదిగాడు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన ‘పుష్ప ది రైజ్’ మొదటి భాగం సెన్సేషనల్ హిట్ అవడంతో ఇప్పుడు దీనికి కొనసాగింపుగా ‘పుష్ప ది రూల్’ మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. పుష్ప రాజ్ సాధారణ స్మగ్లర్ నుంచి బడా వ్యాపారిగా మారి ఎలా రూల్ చేశాడన్న అంశంపై ఇది తెరకెక్కుతోంది. దీంతో ఈ చిత్రంపై హైప్ అంతకంతకూ పెరుగుతూనే ఉంటోంది.

సక్సెస్‌ఫుల్ కాంబోలో రాబోతున్న ‘పుష్ప ది రూల్’ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను చిత్ర యూనిట్ ఎంతో ఉత్సాహంతో జరుపుతోంది. ఇలా ఈ చిత్రాన్ని డిసెంబర్ 5వ తేదీన విడుదల చేయబోతున్నారు. దీనికి సమయం దగ్గర పడడంతో ఈ సినిమా హడావిడి భారీ స్థాయిలో పెరుగుతూనే ఉంటోంది. అందుకు అనుగుణంగానే ఈ మూవీకి ప్రీ రిలీజ్ బిజినెస్ ఊహించని విధంగా జరుగుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించి రికార్డు స్థాయిలో డీల్స్ కూడా ముగిసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప ది రూల్’ సినిమా పనులతో బిజీగా ఉన్నప్పటికీ.. ఖాళీ సమయాల్లో మాత్రం ఫ్యామిలీతోనే ఎక్కువగా గడుపుతూ ఉంటాడు. ఈ క్రమంలోనే తాజాగా ఐకాన్ స్టార్ తన ఇంట్లో దీపావళి పండుగ సందర్భంగా సంబరాలు జరుపుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి తాజాగా బయటకు వచ్చింది. ఇందులో అల్లు అర్జున్ తనదైన రీతిలో టపాసులు కాలుస్తూ కనిపించాడు. అసలు ఏమాత్రం భయం లేకుండా అతడు టపాసులను కాల్చి విసిరేస్తున్నాడు.

సినిమాల్లో హీరోలు చేసినట్లుగా రియల్ లైఫ్‌లోనూ అల్లు అర్జున్ దీపావళి రోజున తన ఇంట్లో టపాకాయలు కాలుస్తూ కనిపించిన వీడియో క్షణాల్లోనే విపరీతంగా వైరల్ అయిపోయింది. దీన్ని సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తున్న బన్నీ అభిమానులు ‘బాక్సాఫీస్‌ను కూడా ఇలాగే కలెక్షన్లతో పేల్చేయాలి’, ‘అన్నా నువ్వు ఒంటి చేత్తే రికార్డులు అన్నీ బ్రేక్ చేసేయాలి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి అల్లు అర్జున్ దీపావళి సెలెబ్రేషన్స్‌తోనూ పుష్ప రాజ్ వైబ్రేషన్స్‌ను చూపించి సెన్సేషన్‌గా మారిపోయాడు.

DEC 5th
Box-office ni ilane egaresthadu!!!💥🔥🥵@alluarjun #Pushpa2 #HappyDiwali pic.twitter.com/xvpaFwcqm7

— Trends Allu Arjun ™ (@TrendsAlluArjun) November 1, 2024
Tags:    
  • Alluarjun 
  • Rashmika 
  • Sukumar 
  • Pushpatherule 
  • Pushpa2 
  • Fahadfaasil 
  • Diwalicelebrations 
  • Mythrimoviemakers 
  • Alluarjunfans 
  • Panindia 

Similar News

హైద‌రాబాద్‌లో సోఫాలు అమ్మి.. ముంబైలో 16 కోట్ల ఇల్లు కొన్న హీరో!

2026-11-13 00:30 GMT

'వార‌ణాసి' త‌ర్వాత 'మ‌హాభార‌తం'పైనే రాజ‌మౌళి ఫోక‌స్?

2026-11-12 23:30 GMT

సీరియ‌ల్ కిస్స‌ర్‌తో జెనీలియా.. ఇదేనా మీ డౌట్?

2026-11-12 22:30 GMT

10 వేల అప్పుతో నేడు న‌టి వందల కోట్ల సామ్రాజ్యం!

2026-11-12 19:30 GMT

ENE 2లో ఈ వైబ్ కూడా ఉందా..

2026-11-12 18:32 GMT

క్యాన్సర్‌ను జయించిన బిగ్‌బాస్ బ్యూటీ.. సర్జరీ తర్వాత ఎమోషనల్ పోస్ట్!

2026-11-12 18:31 GMT

భార‌త్ లో పెళ్లి ఐడియా ఇచ్చింది హ‌బ్బీనా!

2026-11-12 18:30 GMT

'ఇట్లు అర్జున' హీరో బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాకింగే

2026-11-12 18:00 GMT

రియాలిటీ 'రుత్తు' సాంగ్.. హోటల్ కుర్రాడి ప్రేమకథ ఎలా ఉందంటే..

2026-11-12 17:59 GMT

ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో మ‌ణిసార్ మ‌ళ్లీ రొమాంటిక్ ల‌వ్ స్టోరీ!

2026-11-12 17:59 GMT

ట్రెండింగ్: అల్లు స్నేహారెడ్డి ఈ కొత్త రోల్ షాకిస్తోందే!

2026-11-12 17:45 GMT

అనిల్ రావిపూడికి ఉన్న టైమ్ మిగతా దర్శకులకు ఉండటం లేదా...

2026-11-12 17:30 GMT

Copyright @2026

Powered by Blink CMS