పుష్ప 2 గెలిచిన మొదటి అవార్డ్.. జై తెలంగాణ : అల్లు అర్జున్
ఇది చాలా స్పెషల్ అవార్డ్ అన్నారు అల్లు అర్జున్. పుష్ప 2 గెలిచిన మొదటి అవార్డు ఇది. ఈ అవార్డుని నా ఫ్యాన్స్ అందరికీ డెడికేట్ చేస్తున్నా అని అన్నారు అల్లు అర్జున్.;
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డులను అందిస్తుంది. నేడు హైదరాబాద్ హైటేక్స్ వేదికగా టి.జి.ఎఫ్.ఏ అవార్డ్ వేడుక జరుగుతుంది. 2014 నుంచి 2024 వరకు రిలీజైన సినిమాల్లో బెస్ట్ అనిపించిన వారికి ఈ అవార్డులను అందిస్తున్నారు. ఈ అవార్డ్ వేడుకలో 2024 లో రిలీజైన పుష్ప 2 సినిమాకు గాను అల్లు అర్జున్ కి బెస్ట్ యాక్టర్ అవార్డ్ అందించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అవార్డ్ అందుకున్నారు అల్లు అర్జున్.
అవార్డ్ అందుకున్న అల్లు అర్జున్ స్పీచ్ తో అదరగొట్టారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ గొప్ప ఇన్షియేషన్ కి ధన్యవాదాలు తెలిపారు అల్లు అర్జున్. మై రెస్పెక్ట్ టు సీఎం రేవంత్ రెడ్డి అన్న, డిప్యూటీ సీఎం భట్టి గారికి వేదిక మీద ఉన్న పెద్దలకు దిల్ రాజు గారికి థాంక్ యు సో మచ్ అన్నారు అల్లు అర్జున్.
ఇక అవార్డ్ గురించి చెబుతూ ఇది సుకుమార్ లేకపోతే సాధ్యమయ్యేది కాదు. డార్లింగ్ థాంక్ యు సో మచ్ అన్నారు అల్లు అర్జున్. ఈ అవార్డ్ యువర్ విజన్, లవ్.. అంతేకాదు ఈ సినిమాకు పనిచేసిన టెక్నిషియన్స్, యాక్టర్స్, ప్రొడ్యూసర్స్ అందరికీ థాంక్స్ చెప్పారు అల్లు అర్జున్. స్పెషల్ గా రాజమౌళికి థాంక్స్ చెప్పారు అల్లు అర్జున్. ఆరోజు పుష్ప 1 హిందీ రిలీజ్ చేయమని చెప్పబట్టే ఇది జరిగిందని అన్నారు.
ఇది చాలా స్పెషల్ అవార్డ్ అన్నారు అల్లు అర్జున్. పుష్ప 2 గెలిచిన మొదటి అవార్డు ఇది. ఈ అవార్డుని నా ఫ్యాన్స్ అందరికీ డెడికేట్ చేస్తున్నా అని అన్నారు అల్లు అర్జున్. ఇక స్పీచ్ లో భాగంగా సినిమాలోని డైలాగ్ ని చెప్పి అలరించారు. అంతేకాదు ఫ్యాన్స్ ని ఉద్దేశించి మీ అందరినీ మరింత ప్రౌడ్ గా ఫీలయ్యే సినిమాలు చేస్తానని అన్నారు అల్లు అర్జున్.
ఇక చివరగా వన్స్ అగైన్ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇలానే కొనసాగలని కోరుకుంటున్నా అని చివర్లో జై తెలంగాణ జై హింద్ అని స్పీచ్ ముగించాడు అల్లు అర్జున్.