అల్లు అర్జున్ ఈసారి ఇంటర్నేషనల్ లెక్క..!

పుష్పతో పాన్ ఇండియా హిట్ అందుకున్న అల్లు అర్జున్ నెక్స్ట్ అట్లీతో ఒక పవర్ ప్యాక్డ్ మూవీతో రాబోతున్నారు.;

Update: 2025-08-27 20:30 GMT

పుష్పతో పాన్ ఇండియా హిట్ అందుకున్న అల్లు అర్జున్ నెక్స్ట్ అట్లీతో ఒక పవర్ ప్యాక్డ్ మూవీతో రాబోతున్నారు. ఈ సినిమా విషయంలో మేకర్స్ ప్లానింగ్ అంతా నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ముఖ్యంగా సినిమాను గ్లోబల్ లెవెల్ లో మార్కెట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. అంటే అట్లీ, అల్లు అర్జున్ ఇద్దరి కొలాబరేషన్ లో వస్తున్న ఈ మూవీ హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంటుందట. ఐతే ఈ సినిమా తో బన్నీ ఇంటర్నేషనల్ లెవెల్ లో మార్కెటింగ్ చేయాలని చూస్తున్నారట.

పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ టార్గెట్..

అక్కడ మార్కెటింగ్ ఏజెన్సీలతో మీటింగ్స్ జరుగుతున్నాయట. ఆల్రెడీ మోషన్ క్యాప్షన్ సినిమా అంటూ అనౌన్స్ మెంట్ తోనే అల్లు అర్జున్, అట్లీ ఇద్దరు కూడా సర్ ప్రైజ్ చేశారు. ఈ సినిమా పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ టార్గెట్ తో వస్తుందట. సినిమా మీద ఇప్పటికే అంచనాలు ఉండగా అల్లు అర్జున్, అట్లీ లేటెస్ట్ గా ఒక హాలీవుడ్ మార్కెటింగ్ ఏజెన్సీతో మీటింగ్ చేయడం ఫ్యాన్స్ ని మరింత సర్ ప్రైజ్ చేస్తుంది.

సో పుష్ప 2 లో పుష్ప రాజ్ అంటే నేషనల్ అనుకుంటివా ఇంటర్నేషనల్ అని సరదాగా ఒక డైలాగ్ తో చెప్పాడో లేదో నెక్స్ట్ సినిమానే అల్లు అర్జున్ ఇంటర్నేషనల్ ఆడియన్స్ ని టార్గెట్ చేశాడు. అంతేకాదు ఆల్రెడీ ఒక సినిమా ఎలా తీయాలో చెప్పడమే కాదు అకడమీ దాకా సినిమాను ఎలా మార్కెట్ చేయాలో చూపించాడు రాజమౌళి. ఆయన్ను చూసి అల్లు అర్జున్, అట్లీ కూడా అదే బాటలో వెళ్తున్నారు.

పుష్ప 2 మాస్ మేనియా..

చూస్తుంటే ఈసారి అల్లు అర్జున్ గురి చాలా పెద్దది అనిపించేలా ఉంది. పుష్ప 2 సినిమాతోనే తన మాస్ మేనియా ఏంటో చూపించిన అల్లు అర్జున్ ఇక నెక్స్ట్ అట్లీ సినిమాతో ఈసారి పాన్ వరల్డ్ లెవెల్ లో రికార్డులు టార్గెట్ పెట్టుకున్నాడు. ఈ సినిమాలో దీపిక పదుకొనె, రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్ నటిస్తున్నారని తెలుస్తుంది.

అల్లు అర్జున్ కూడా పెరిగిన తన మార్కెట్ ని మరింత పెంచుకోవాలని చూస్తున్నాడు. అట్లీ కూడా జవాన్ తో బాలీవుడ్ లో హిట్ కొట్టాడు కాబట్టి ఈసారి అల్లు అర్జున్ తో అంతకుమించి హిట్ ని కొట్టాలని చూస్తున్నాడు. అల్లు అర్జున్ అట్లీ సినిమా తర్వాత ఎవరితో సినిమా చేస్తాడన్నది క్లారిటీ లేదు. త్రివిక్రం తో సినిమా అనుకున్నారు కానీ అది ఎన్టీఆర్ కు వెళ్లింది.

Tags:    

Similar News