బన్నీ-అట్లీ హైదరాబాద్ రారా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా అట్లీ దర్శకత్వంలో భారీ కాన్వాస్ పై ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.;
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా అట్లీ దర్శకత్వంలో భారీ కాన్వాస్ పై ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. గ్లోబల్ స్థాయిలో ఈచిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఒక్క హిట్ తో బన్నీ? ఇంటర్నేషనల్ స్టార్ అవ్వాల్సిందే అన్నంత కసిగా అట్లీ పని చేస్తున్నాడు. అమెరికాలోని ప్రఖ్యాత ఫిలిం స్టూడియోలు..ల్యాబ్ లు ఈ సినిమా కోసం బ్యాకెండ్ లో వర్క్ చేస్తున్నాయి. సినిమా ప్రారంభానికి ముందే అట్లీ బోలెడంత ప్రీవర్క్ చేసాడు. అంతా పక్కాగా అనుకున్న తర్వాతే పట్టాలెక్కించాడు. ఇక ఈ సినిమా షూటింగ్ కొన్ని నెలల క్రితం ముంబైలో ప్రారంభమైన సంగతి తెలిసిందే.
సొంత పరిశ్రమలను పక్కనబెట్టి:
అప్పటి నుంచి షూటింగ్ ముంబైలోనే జరుగుతుంది. ఇంత వరకూ అట్లీ-బన్నీ హైదరాబాద్, చెన్నై సిటీలు చూసింది లేదు. తెలుగు హీరో..తమిళ డైరెక్టర్ కలిసి పని చేస్తున్నారంటే? తొలి ప్రాధాన్యత ఆయా సొంత పరిశ్రమలకు ఇస్తారనుకోవడం సహజం. కానీ వీరిద్దరు మాత్రం చెన్నై, హైదరాబాద్ ని పక్కన బెట్టి ముంబైలోనే మకాం వేసి పని చేస్తున్నారు. ముంబై లో ప్రత్యేకమైన టీమ్ లను నియమించుకుని పని చేస్తున్నారు. ఇప్పటి వరకూ ఎన్ని షెడ్యూల్స్ పూర్తయ్యాయి? అన్నది ఇంకా బయటకు రాలేదు. మరి షూటింగ్ అంతా ముంబైకే పరిమితం చేస్తారా? కొన్ని షెడ్యూల్స్ అయినా? చెన్నై, హైదరాబాద్ లో ప్లాన్ చేస్తున్నారా? అన్నది తెలియాలి.
ముంబై టీమ్స్ తోనే:
పూర్తి చేయాల్సిన షూటింగ్ పార్ట్ ఇంకా చాలా ఉంది. ఈ సినిమాకు ఎక్కువగా సెట్లు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముంబైలోనే సెట్లు వేసి షూటింగ్ చేస్తున్నారు. ఔట్ డోర్ సన్నివేశాలుంటే? ముంబై ఔట్ కట్స్ లో షూట్ చేస్తున్నారు. ఇలా టీమ్ ముంబైకి పరిమితం అవ్వడంతో షూటింగ్ అప్ డేట్స్ కూడా లీక్ అవ్వడం లేదు. సినిమాకు పని చేస్తోన్న వారంతా ఎక్కువగా ముంబై, చెన్నైకి చెందిన వారు కావడంతో? ఏ వివరాలు లీక్ అవ్వడం లేదు. ఎలాంటి లీకులు జరగకూడదని అట్లీ ముంబైలో షూట్ చేస్తున్నాడా? అన్న డౌట్ కూడా చాలా మందిలో రెయిజ్ అవుతుంది.
రిలీజ్ పై క్లారిటీ ఎప్పుడు?
అయితే ముంబైలో ఉన్నన్ని గొప్ప స్టూడియోలు హైదరాబాద్, చెన్నైలో లేవు. టెక్నికల్ స్క్రిప్ట్ కావడంతో? ముంబైకి పరిమతమయ్యారు? అన్నది మరికొంత మంది అభిప్రాయం. బన్నీ మాత్రం హైదరాబాద్ వచ్చి వెళ్తున్నాడు తప్ప ఎలాంటి అప్ డేట్ ఇవ్వడం లేదు. అలాగే సినిమా రిలీజ్ విషయంలోనూ ఇంకా క్లారిటీ లేదు. 2026 ముగింపు లేదా? 2027లో రిలీజ్ అవుతుందనే ప్రచారం తప్ప ఎలాంటి ఆధారాలు లేవు.