బన్నీ- అట్లీ మూవీ.. ఏ ఒక్కరికీ ఆ ఛాన్స్ లేదు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌ లో ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.;

Update: 2025-08-26 05:32 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌ లో ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో అడ్వాన్స్ డ్ టెక్నాలజీతో సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ రూపొందిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ డ్రామాగా రానున్న ఆ మూవీ బడ్జెట్ రూ.800 కోట్లు అని సమాచారం. ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుగుతోంది.

భారీ సెట్ లో మేకర్స్ కీలక సీన్స్ ను షూట్ చేస్తున్నారని సమాచారం. అయితే బన్నీ- అట్లీ ప్రాజెక్ట్ కు సంబంధించి ఎప్పుడెప్పుడు కొత్త అప్డేట్స్ వస్తాయోనని అంతా వెయిట్ చేస్తుంటారు. సినిమాకు వర్క్ చేస్తున్న వారు.. ఎవరు కనిపించినా విలేకరులు అడుగుతుంటారు. కానీ అప్డేట్ ఇచ్చేందుకు ఇప్పుడు ఓ ఒక్కరికి కూడా ఛాన్స్ లేదని తెలుస్తోంది.

రీసెంట్ గా బన్నీ, అట్లీ మూవీ పనులు పర్యవేక్షిస్తున్న నిర్మాత బన్నీ వాస్‌ కు ఓ ఈవెంట్ లో అల్లు అర్జున్‌ కొత్త మూవీ గురించి ఏమైనా చెబుతారా అని అడగ్గా.. నో అన్నారు. ఈ దశలో ఎటువంటి సమాచారం పంచుకోబోమని ఆయన స్పష్టం చేశారు. సన్‌ పిక్చర్స్‌ బ్యానర్ తో అందరికీ నాన్‌ డిస్‌ క్లోజర్‌ అగ్రిమెంట్‌ ఉందని కూడా వెల్లడించారు.

దీంతో ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది నిజమేనని తెలుస్తోంది. సన్ పిక్చర్స్ సంస్థ మొత్తం తారాగణం, సిబ్బందితో కఠినమైన నాన్ డిస్‌ క్లోజర్ అగ్రిమెంట్ చేసుకుందట. బ్యానర్ తప్ప మరెవరూ కూడా అధికారిక అప్డేట్స్ ఇవ్వకూడదని తేల్చి చెప్పిందట. ఇది బన్నీ అభిమానులను కాస్త నిరాశ పరిచే విషయమే.

అయితే మేకర్స్ మాత్రం ఎప్పటికప్పుడు సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ను ఇస్తే మాత్రం అభిమానులు ఫుల్ ఖుషీ అవుతారు. ఆ విషయంలో మేకర్స్ ఏం చేస్తారో చూడాలి. అదే సమయంలో సినిమాలో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని సమాచారం. మరికొందరేమో ఐకాన్ స్టార్ రోల్ మూడు కోణాల్లో సాగుతుందని చెబుతున్నారు.

ఇంటర్నేషన్ స్టాండర్డ్స్ తో రూపొందుతున్న ఆ సినిమాలో ముగ్గురు కథానాయికలు సందడి చేయనున్నారు. బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణె ఒక హీరోయిన్ గా నటిస్తున్నట్లు ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న కూడా నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మూవీలో మోషన్‌ క్యాప్చర్‌ టెక్నాలజీ వినియోగంతోపాటు విజువల్‌ ఎఫెక్ట్స్‌కి పెద్దపీట వేస్తున్నారని సినీ వర్గాల్లో వినికిడి.

Tags:    

Similar News