తెలిసి తప్పు చేస్తున్న బన్నీ.. ఫ్యాన్స్ ఫైర్!

సాయి అభ్యంకర్ చిన్న చిన్న హీరోల సినిమాలకి మ్యూజిక్ ఇవ్వడానికి పనికి వస్తారు.;

Update: 2025-08-31 11:30 GMT

అల్లు అర్జున్ ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో AA22xA6 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ముంబైలో ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ఈ కాంబోలో రాబోయే సినిమాపై ఇండస్ట్రీలో భారీ హైప్ ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే తాజాగా అల్లు అర్జున్ - అట్లీ కాంబోలో రాబోతున్న సినిమా గురించి ఒక షాకింగ్ వార్త వినిపిస్తోంది. ఇది చూసిన చాలామంది అభిమానులు అల్లు అర్జున్ పై ఫైర్ అవుతున్నారు. తెలిసి తప్పు చేస్తుంటే మండిపడుతున్నారు పైగా ఆ మ్యూజిక్ డైరెక్టర్ వద్దే వద్దు అంటూ అల్లు అర్జున్ ని వేడుకుంటున్నారు. మరి ఇంతకీ అట్లీ - బన్నీ కాంబోలో రాబోతున్న సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఎవరు చేయబోతున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

అల్లు అర్జున్ - అట్లీ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా సాయి అభ్యంకర్ పేరు ఖరారు అయినట్టు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే సాయి అభ్యంకర్ పేరుని అఫీషియల్ చేయకపోయినప్పటికీ కొన్ని నివేదికలు మాత్రం ఈయన పేరు వైరల్ చేస్తున్నాయి. ఇక ఈ విషయం బయట పడడంతోనే చాలామంది అల్లు అర్జున్ అభిమానులు సాయి అభ్యంకర్ వద్దే వద్దు అంటూ పోస్టులు పెడుతున్నారు. ఎందుకంటే సాయి అభ్యంకర్ అంత ఫేమస్ అయిన మ్యూజిక్ డైరెక్టర్ కాదు..ఒకవేళ అంతగా తమిళ వారిని మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకోవాలనిపిస్తే ఆ అవకాశం అనిరుధ్ కి ఇవ్వండి..అంతేగాని ఇలా పేరు ఊరు లేని మ్యూజిక్ డైరెక్టర్లను పెట్టుకొని పెద్ద సినిమా పరువు తీస్తే ఎలా అని మాట్లాడుకుంటున్నారు.

సాయి అభ్యంకర్ చిన్న చిన్న హీరోల సినిమాలకి మ్యూజిక్ ఇవ్వడానికి పనికి వస్తారు. కానీ అల్లు అర్జున్ అట్లీ కాంబోలో రాబోతున్న ఈ అతిపెద్ద సినిమాకి ఆయన మ్యూజిక్ సరిపోదని.. పైగా అల్లు అర్జున్ సినిమాపై అభిమానులకి ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టు ప్రతి ఒక్కటి ఉండాలి. ఇందులో మ్యూజిక్ బాగుండకపోతే సినిమాకి పెద్ద దెబ్బ పడుతుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.అయితే సాయి అభ్యంకర్ ఇప్పటికే పలు సినిమాలు చేసినప్పటికీ అంత పేరైతే రాలేదు.

ప్రస్తుతం ప్రదీప్ రంగనాథన్ హీరోగా చేస్తున్న డ్యూడ్ అనే తమిళ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా చేస్తున్నారు. ఈ సినిమా నుండి రీసెంట్గా ఊరం బ్లడ్ అనే పాట రిలీజ్ అయింది. అయితే ఈ పాట శ్రోతలను అంతగా ఆకట్టుకోలేదు.అంతేకాదు ఈ పాట ట్రాక్ లో రెగ్యులర్ ట్యూన్ లేకుండా సౌండ్ ట్రాక్ మాత్రమే ఉందని అంటున్నారు. అయితే ఇలాంటి మ్యూజిక్ చిన్న సినిమాలకు చిన్న హీరోలకు చేస్తే పనికి వస్తుంది కానీ అల్లు అర్జున్ లాంటి పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న హీరో సినిమాకు చేస్తే పనికి రాదని,సాయి అభ్యంకర్ ఇచ్చే మ్యూజిక్.. అల్లు అర్జున్ మాస్ అభిమానులకు కనెక్ట్ కాకపోవచ్చని కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఎవరు ఎన్ని చెప్పినా కూడా అట్లీ, అల్లు అర్జున్ ఇద్దరూ సాయి అభ్యంకర్ ని తమ సినిమాకి తీసుకోవాలనే ఆసక్తితోనే ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇదే చివరి నిర్ణయం కాకపోవడంతో చాలామంది అభిమానులు సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ ని రిక్వెస్ట్ చేస్తున్నారు.మీ సినిమాకి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ని తీసుకోండి అంటూ పోస్టులు పెడుతున్నారు. మరి చూడాలి అల్లు అర్జున్ అట్లీ కాంబోలో రాబోయే సినిమాకి సాయి అభ్యంకర్ నే మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిక్స్ చేస్తారా లేక మరెవరినైనా ఎంచుకుంటారా అనేది ముందు ముందు తెలుస్తుంది.

Tags:    

Similar News