ఐకాన్ స్టార్@ 22 ఛాన్స్ ఎవరికో!
ఈ సినిమా కోసం సన్ పిక్చర్స్ వందల కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బన్నీ సరసన ఛాన్స్ ఏ భామను వరిస్తుంది? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.;
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 22వ చిత్రం అట్లీ దర్శకత్వంలో భారీ కాన్వాస్ పై తెరకెక్కడానికి రంగం సిద్దమ వుతోన్న సంగతి తెలిసిందే. అట్లీ ప్లానింగ్ చూస్తుంటే? పాన్ వరల్డ్ మార్కెట్ నే టార్గెట్ చేసినట్లు కని పిస్తుంది. అమెరికా, దుబాయ్ లాంటి దేశాల్లో ఈ సినిమా ప్లానింగ్ చూస్తుంటే? అట్లీ చాలా పెద్ద ప్లాన్ తోనే సీన్ లోకి ఎంటర్ అయినట్లు కనిపిస్తుంది. ఈ సినిమాతో ఓ సరికొత్త ప్రయోగానికి కూడా పూనుకుం టున్నాడా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ సినిమా కోసం సన్ పిక్చర్స్ వందల కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బన్నీ సరసన ఛాన్స్ ఏ భామను వరిస్తుంది? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అట్లీ సినిమాలో హీరోయిన్ అంటే ఆషామాషీగా ఉండదు. చిన్న చితకా హీరోయిన్లు అట్లీ సినిమాలో కనిపించరు. బాగా ఫేమస్ అయిన బ్యూటీ లను..వాళ్ల మార్కెట్ ను అంచనా వేసి తీసుకుంటాడు. ఈ నేపథ్యంలో కొంత మంది భామల పేర్లు తెరపైకి వస్తున్నాయి.
నేషనల్ క్రష్ రష్మికా మందన్నా, సమంత, నయనతార, దీపికా పదుకొణే, ప్రియాంక చోప్రా ఇలా టాప్ భామలే కనిపిస్తున్నారు. ఈ ఐదుగురిలో ఎవరో ఒకరిని అట్లీ ఫైనల్ చేస్తాడని వినిపిస్తుంది. ఐదుగురితోనూ అట్లీ భేటీ అయినట్లు వార్త లొస్తున్నాయి. సమంత, దీపికా పదుకొణే, నయనతారతో ఇప్పటికే అట్లీ పని చేసాడు. రష్మికా మందన్నా, ప్రియాంక చోప్రాలు మాత్రం ఇంకా పనిచేయలేదు.
ఈ నేపథ్యంలో వాళ్లిద్దరిలో ఎవరో ఒకర్ని తీసుకునే ఛాన్స్ ఉందని గట్టిగా వినిపిస్తుంది. పీసీ అయితే పాన్ వరల్డ్ మార్కెట్ లో కలిసొస్తుంది. రష్మికకు పాన్ ఇండియాలో మంచి డిమాండ్ ఉంది. నేచురల్ పెర్పార్మ ర్ గానూ అమెకు పేరుంది. ఒకవేళ వీరిద్దరు ఆప్షన్ లో లేకపోతే సెకెండ్ ఛాన్స్ దీపిక, నయన్ వైపు చూసే అవకాశం ఉందంటున్నారు. సమంత మాత్రం లిస్ట్ లో లాస్ట్ లో కనిపిస్తుంది. ఆమె సినిమా రిలీజ్ అయి ఏడాదిన్నర దాటింది. ఇంతవరకూ సినిమాలు కూడా చేయలేదు. బన్నీతో కలిసి ఇప్పటికే సినిమాలు కూడా చేసిన సంగతి తెలిసిందే.