AA22XA6 సర్‌ప్రైజ్‌ ఇదే..!

#AA22XA6 సినిమాలో హీరోయిన్‌గా దీపికా అనౌన్స్‌మెంట్‌ వీడియోలో పలు ఆసక్తికర విషయాలను చూపించారు.;

Update: 2025-06-07 07:15 GMT
AA22XA6 సర్‌ప్రైజ్‌ ఇదే..!

అల్లు అర్జున్‌ పుష్ప సినిమా తర్వాత చేస్తున్న సినిమా అనగానే అంచనాలు పాన్ ఇండియా రేంజ్‌లో భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా అల్లు అర్జున్‌తో ప్రస్తుతం అట్లీ సినిమాకు ఏర్పాట్లు చేస్తున్నాడు. జవాన్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకున్న అట్లీ వెయ్యి కోట్ల సినిమాను బాలీవుడ్‌కి అందించాడు. ఆ సినిమా తర్వాత ఆయన నుంచి రాబోతున్న సినిమా అనగానే బాలీవుడ్‌తో పాటు అన్ని భాషల్లోనూ అంచనాలు ఉన్నాయి. ఇలాంటి ఇద్దరి కాంబోలో మూవీ అంటే ఏ స్థాయిలో ఉంటుందో ఊహకు సైతం అందడం లేదు. వీరిద్దరి కాంబోనే ది బెస్ట్‌ అనుకుంటే, వీరితో పాటు బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌, ఇండియాస్ నెం.1 హీరోయిన్‌ దీపికా పదుకునే ఈ సినిమాలో నటించబోతుంది.

#AA22XA6 సినిమా నుంచి సర్‌ప్రైజింగ్‌ విషయాన్ని ప్రకటించబోతున్నట్లుగా మేకర్స్‌ నిన్న సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన వెంటనే ఏంటా అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. అల్లు అర్జున్‌ లుక్‌ ఏమైనా రివీల్‌ చేస్తారా అనే చర్చ కూడా అభిమానుల్లో నడిచింది. గత కొన్ని రోజులుగా ఈ సినిమా హీరోయిన్స్ గురించి ప్రముఖంగా చర్చ జరుగుతూ వచ్చింది. ముగ్గురు హీరోయిన్స్‌ అని, అల్లు అర్జున్‌ మూడు పాత్రల్లో కనిపించబోతున్నాడు అంటూ ప్రముఖంగా ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో దీపికా పదుకునే హీరోయిన్‌గా ఎంపిక అయిందనే వార్తలు కూడా వచ్చాయి. కానీ బన్నీ సినిమాలో దీపికా పదుకునే అంటే చాలా మంది విశ్వసించలేదు.

ప్రభాస్ 'స్పిరిట్‌' సినిమాలో నటించాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల తప్పుకున్న దీపికా పదుకునే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్‌తో కలిసి నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో అభిమానులతో పాటు అంతా కూడా ఆసక్తిగా ఈ సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నారు. ఒకప్పుడు బాలీవుడ్‌ సినిమాలకు తప్ప సౌత్‌ సినిమాల వైపు కనీసం కన్నెత్తి చూడని ఇలాంటి ముద్దుగుమ్మలు ఇప్పుడు సౌత్‌ సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపించడం టాలీవుడ్‌ స్టామినాను, సత్తాను చూపుతుంది అంటూ అభిమానులు మాట్లాడుకుంటున్నారు. #AA22XA6 సినిమాలో దీపికా పాత్ర గురించి తాజా వీడియలో అట్లీ హింట్‌ ఇచ్చాడు.

#AA22XA6 సినిమాలో హీరోయిన్‌గా దీపికా అనౌన్స్‌మెంట్‌ వీడియోలో పలు ఆసక్తికర విషయాలను చూపించారు. ఇది ఒక పీరియాడిక్‌ సినిమాగా అనిపిస్తుంది. అంతే కాకుండా సినిమాలో హీరోయిన్‌ పాత్ర చాలా పవర్‌ ఫుల్‌గా ఉండబోతుంది. ఆమె యాక్షన్‌ సన్నివేశాల్లోనూ కనిపించబోతుంది. అంతే కాకుండా ఈ సినిమా కోసం మోషన్ క్యాప్షన్ టెక్నాలజీని వినియోగించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో సినిమాలకు వినియోగిస్తున్న టెక్నాలజీతో పోల్చితే ఈ సినిమాకు వాడుతున్న టెక్నాలజీ అంతకు మించి అన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. దీపికా ను పరిచయం చేసిన వీడియలో పలు రకాలుగా దర్శకుడు అట్లీ సర్‌ప్రైజ్ చేశారు అనడంలో సందేహం లేదు.

Full View
Tags:    

Similar News