డిసెంబర్ లో విదేశాలకు బన్నీ.. ఎందుకంటే?
AA22XA6 చిత్ర యూనిట్ డిసెంబర్ లో యూఏఈ కి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. అక్కడ అల్లు అర్జున్, దీపికా మధ్య సినిమాలో వచ్చే కీలకమైన ట్విస్ట్ తో పాటూ ఎమోషనల్ సీన్స్ ను తెరకెక్కంచనున్నారట.;
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా డైరెక్టర్ అట్లీ కుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అనౌన్స్‌మెంట్ నుంచే ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి. బన్నీ- అట్లీ కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ ప్రాజెక్టుపై రోజురోజుకీ ఎక్స్‌పెక్టేషన్స్ భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ మూవీ గురించి ఏ వార్త వచ్చినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది.
మొదట్లో పాన్ ఇండియా మూవీగా అనుకున్న ఈ ప్రాజెక్టును ఇప్పుడు పాన్ వరల్డ్ మూవీగా మార్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకొణె హీరోయిన్ గా నటిస్తుండగా, అల్లు అర్జున్ డిఫరెంట్ గెటప్స్ లో భిన్నంగా కనిపించనున్నారని తెలుస్తోంది. AA22XA6 వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కుతుంది .
టాలీవుడ్ లో ఈ తరహా కాన్సెప్ట్ అరుదు
ఈ సినిమా కథాంశం టైమ్ ట్రావెల్, పునర్జన్మ లాంటి సైంటిఫిక్, ఫాంటసీ అంశాల చుట్టూ తిరగబోతుందని సమాచారం. ఇంకా చెప్పాలంటే తెలుగు సినిమాల్లో ఇలాంటి కాన్సెప్ట్ అరుదుగా రావడంతో ఆడియన్స్ లో ఈ మూవీపై భారీ ఆసక్తి నెలకొంది . ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, ఇప్పుడు ఈ చిత్ర షూటింగ్ పై ఓ అప్డేట్ తెలుస్తోంది.
డిసెంబర్లో యూఏఈకి చిత్ర యూనిట్
AA22XA6 చిత్ర యూనిట్ డిసెంబర్ లో యూఏఈ కి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. అక్కడ అల్లు అర్జున్, దీపికా మధ్య సినిమాలో వచ్చే కీలకమైన ట్విస్ట్ తో పాటూ ఎమోషనల్ సీన్స్ ను తెరకెక్కంచనున్నారట. కాగా ఈ మూవీ 50% పౌరాణిక యుగంలో సెట్ చేయబడగా, మరో 50% ప్రస్తుత కాలంలో సెట్ చేయబడినట్టు తెలుస్తోంది. సన్ పిక్చర్స్ బ్యానర్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా, ఈ ప్రాజెక్టు కోసం పలువురు హాలీవుడ్ టెక్నీషియన్లు వర్క్ చేస్తున్నారు.