వాటిపై ఆధారపడ్డ AA22xA6 రిలీజ్ డేట్
ఇప్పటికే ఈ మూవీలో అల్లు అర్జున్ విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని తెలియడంతో బన్నీ ఈ మూవీలో ఎలాంటి లుక్స్ లో కనిపిస్తారో అని చూడ్డానికి ఆడియన్స్ ఆతృతగా ఉన్నారు.;
పుష్ప2 సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ తో తన తర్వాతి సినిమాను చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ బన్నీ మాత్రం అందరికీ షాకిస్తూ అట్లీ కుమార్ దర్శకత్వంలో సినిమాను అనౌన్స్ చేశారు. అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో సినిమా అనడంతో ఈ ప్రాజెక్టుపై భారీ హైప్ ఏర్పడింది. AA22xA6 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ రూపొందుతుంది.
పాన్ వరల్డ్ మూవీగా రానున్న AA22xA6
ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకీ పెరుగుతుండగా, సౌత్ లో మంచి పేరున్న బడా నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ ప్రాజెక్టును భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. మొదట పాన్ ఇండియా సినిమాగా అనుకున్న ఈ మూవీని మేకర్స్ ఇప్పుడు పాన్ వరల్డ్ మూవీగా మార్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే సినిమా గురించి వినిపిస్తోన్న ఒక్కో అప్డేట్ సినిమాపై ఉన్న అంచనాలను విపరీతంగా పెంచేస్తుంది.
విభిన్న లుక్స్ లో కనిపించనున్న బన్నీ
ఇప్పటికే ఈ మూవీలో అల్లు అర్జున్ విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని తెలియడంతో బన్నీ ఈ మూవీలో ఎలాంటి లుక్స్ లో కనిపిస్తారో అని చూడ్డానికి ఆడియన్స్ ఆతృతగా ఉన్నారు. టైమ్ ట్రావెల్, పునర్జన్మ లాంటి సైంటిఫిక్, ఫాంటసీ అంశాలను మేళవించి అట్లీ ఈ సినిమాను రూపొందిస్తున్నారని టాక్. ఇదిలా ఉంటే ఈ మూవీ గురించి అల్లు అర్జున్‌కు అత్యంత సన్నిహితుడు, నిర్మాత బన్నీ వాసు ఓ సందర్భంగా మాట్లాడారు.
శరవేగంగా జరుగుతున్న షూటింగ్
#AA22 షూటింగ్ పలు యాంగిల్స్ లో శరవేగంగా జరుగుతోందని చెప్పారు. భారీ ప్రాజెక్టుగా రానున్న అల్లు అర్జున్- అట్లీ ప్రాజెక్ట్ కు సీజీ చాలా కీలకమని, సీజీ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పూర్తయ్యే దానిపైనే సినిమా రిలీజ్ డేట్ ఆధారపడి ఉందని చెప్తున్నారు. సినిమా సీజీకే చాలా టైమ్ పట్టనుందని, ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కు మరికొంత సమయం పడుతుందని, అవన్నీ పూర్తయ్యాక 2026 లేదా 2027లో సినిమా రిలీజయ్యే ఛాన్సుందని బన్నీ వాసు వెల్లడించారు.