హీరోయిన్ తో బన్నీ యాక్షన్ ట్రీట్!

బన్నీ లుక్‌ను ఇంకా అధికారికంగా విడుదల చేయకపోయినా.. ఈ ప్రాజెక్ట్ పట్ల స్టైలిష్ స్టార్ సీరియస్‌గా ఉన్నట్టు ఇప్పటికే కనిపిస్తోంది.;

Update: 2025-06-18 11:30 GMT
హీరోయిన్ తో బన్నీ యాక్షన్ ట్రీట్!

పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ ఎంచుకున్న ప్రాజెక్ట్ సింపుల్ గేమ్ కాదన్న విషయం అప్పుడే స్పష్టమైంది. కోలీవుడ్ మాస్ మాస్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ #AA22 ఇప్పటికే బీహైండ్ ద సీన్స్ అప్డేట్స్‌తో బజ్ పెంచింది. దీపికా పదుకొణెను ఫీమేల్ సూపర్ విలన్ పాత్రలో ఎంపిక చేయడం, ఈ సినిమాను భారతీయ సినిమాకు ఓ కొత్త ట్రెండ్ లాగా తీర్చిదిద్దుతున్నట్టు తెలుస్తోంది. ఇక టీం మాటల్లో చెప్పిన హింట్లు ఆడియన్స్ లో భారీ అంచనాలను ఏర్పరచేశాయి.

రీసెంట్ గా ఓ ఫోటో షూట్ ద్వారా బన్నీ - అట్లీ కాంబినేషన్‌కు సంబంధించిన గ్లింప్స్ హైలైట్ అయ్యాయి. బన్నీ లుక్‌ను ఇంకా అధికారికంగా విడుదల చేయకపోయినా.. ఈ ప్రాజెక్ట్ పట్ల స్టైలిష్ స్టార్ సీరియస్‌గా ఉన్నట్టు ఇప్పటికే కనిపిస్తోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ సూపర్ హీరో డ్రామా తరహాలో డిజైన్ చేస్తున్నారు. భారీ విజువల్స్, వీఎఫ్‌ఎక్స్ సపోర్ట్‌తో ఈ కథను చాలా నూతనంగా మలచుతున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం #AA22 యాక్షన్ షెడ్యూల్ ముంబైలో శరవేగంగా సాగుతోంది. అల్లు అర్జున్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో పాల్గొంటున్న ఈ షెడ్యూల్‌లో మాస్ యాక్షన్ సీక్వెన్స్‌లు, యూరోప్ స్టంట్ టీమ్ తో కూడిన ఫైట్లను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్ నెలాఖరు వరకూ గ్యాప్ లేకుండా సాగనుంది. భారీ స్కేల్‌లో షూట్ జరుగుతున్న ఈ ఎపిసోడ్‌తో సినిమాకు కొత్త లెవెల్ హైప్ వచ్చేదిగా ఉందని యూనిట్ భావిస్తోంది.

ఇందులో మృణాల్ పాత్ర కూడా చాలా ప్రత్యేకమని చెప్పుకుంటున్నారు. పవర్ఫుల్ స్క్రీన్ ప్లే తో మృణాల్ పాత్రకు ఎమోషన్‌తో పాటు యాక్షన్ కూడిన షేడ్స్ ఉన్నట్టు చెబుతున్నారు. ఇదే సమయంలో బాలీవుడ్ నుంచి మరికొన్ని ఫేమస్ ఫేసెస్ ఈ ప్రాజెక్ట్‌కు జాయిన్ అయ్యే అవకాశముందని టాక్ వినిపిస్తోంది. దీపిక, జాన్వీ, మృణాల్ ఇలా వరుసగా స్టార్ హీరోయిన్లు ఉండే అవకాశం ఉండటంతో.. ఇది ఓ మల్టీ డైరెక్షన్ కథగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి.

ఇది అల్లు అర్జున్ కెరీర్‌లో అత్యంత ఖరీదైన సినిమాగా రూపొందుతుండగా.. సన్ పిక్చర్స్ కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ సినిమా 2026లో రిలీజ్ చేయాలనే టార్గెట్‌తో షూటింగ్ ఫేస్ నడుస్తోంది. ఈ మాసివ్ యాక్షన్ ఎంటర్టైనర్ గురించి అధికారిక టైటిల్ ఇంకా రాలేదు. త్వరలోనే టీజర్ తో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందన్న వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. మరి బన్నీ ఈసారి ఎలాంటి వండర్ క్రియేట్ చేస్తాడో చూడాలి.

Tags:    

Similar News