అట్లీకి 125 కోట్లు... అంత సీన్ ఉందా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాస్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.;

Update: 2025-04-10 09:41 GMT

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాస్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాను సన్ పిక్చర్స్ సంస్థ దాదాపు రూ.800 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఇది పాన్ వరల్డ్ స్కేల్‌లో రూపొందే ప్రాజెక్ట్ కావడం వల్ల ప్రీ-ప్రొడక్షన్ నుంచే హైప్ ఏర్పడింది. కానీ ఈ సినిమాలో అట్లీకి రెమ్యునరేషన్‌గా రూ.125 కోట్లు చెల్లిస్తున్నారనేది ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద చర్చగా మారింది. ఓ డైరెక్టర్‌కు ఈ రేంజ్ పారితోషికం ఇవ్వడం కాస్త ఆశ్చర్యంగా ఉందనేది చాలామంది అభిప్రాయం.

అట్లీ గత చిత్రం 'జవాన్'తో ప్రపంచవ్యాప్తంగా రూ.1,148.32 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించాడు. షారుఖ్ ఖాన్ నటించిన ఆ సినిమా అతనికి నేషనల్ రేంజ్ లో గుర్తింపు తీసుకొచ్చింది. కానీ దానికి ముందే వచ్చిన ‘బిగిల్’ సినిమా మాత్రం రూ.304 కోట్లు మాత్రమే వసూలు చేసింది. అంటే అట్లీ కెరీర్ లో 'జవాన్' ఒక్కటే గేమ్ ఛేంజర్. ఇక అల్లు అర్జున్ విషయానికి వస్తే, 'పుష్ప 2' సినిమాతో తన మార్కెట్‌ను పాన్ ఇండియా స్థాయిలో స్థిరం చేసుకున్నాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.1800 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ టాక్.

అలాంటి టైంలో అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ కావడం, అంతేకాదు హీరోకు రూ.175 కోట్లు, డైరెక్టర్‌కు రూ.125 కోట్లు ఇవ్వడం ఓ రేంజ్‌లో హైప్‌ని క్రియేట్ చేసింది. కానీ ప్రశ్నేంటంటే, అట్లీకి అంత క్రెడిబిలిటీ ఉందా? ఇప్పటివరకు అతనితో చేసిన సినిమాలు అన్నీ హీరో పవర్ మీదే నడిచాయి. ‘మెర్సల్’, ‘బిగిల్’, ‘థెరి’, ‘జవాన్’ అన్నీ స్టార్స్ ఉన్న సినిమా కావడం వల్ల డైరెక్టర్ టాలెంట్ కన్నా స్టార్ విలువ ఎక్కువగా కనిపించింది. పైగా అట్లీ చిత్రాలు రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములా మీదే నడుస్తుంటాయి. కొత్తదనం లేకపోయినా విజువల్ ట్రీట్మెంట్ బాగుంటుంది.

ఇక బడ్జెట్ విషయానికి వస్తే, ఈ సినిమా కోసం ఇప్పటికే రూ.800 కోట్లు ఖర్చు చేయనున్నట్టు సమాచారం. వీఎఫ్ఎక్స్ కే రూ.250 కోట్లు కేటాయించడం చూస్తే, సినిమా అట్టహాసంగా ఉండనుందని అర్థమవుతుంది. కానీ సినిమా విడుదలయ్యే వరకూ ఖర్చులు ఇంతకన్నా ఎక్కువయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. సైన్స్ ఫిక్షన్, మాస్ ఎలిమెంట్స్ మిక్స్ చేస్తుండటం వల్ల గ్రాఫిక్స్‌, టెక్నికల్ అస్పెక్ట్స్ పై పెద్ద ఖర్చు ఉండబోతుంది.

అల్లు అర్జున్ మాత్రం అట్లీపై నమ్మకంతోనే ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘పుష్ప 2’ తర్వాత తన క్రేజ్‌ను గ్లోబల్‌గా పెంచాలనుకున్న బన్నీ, సన్ పిక్చర్స్, అట్లీ లాంటి భారీ బ్యానర్లు, డైరెక్టర్లు ఉన్న ప్రాజెక్ట్‌నే ఎంచుకున్నాడు. జవాన్ తర్వాత అట్లీకి హిందీలో ఉన్న క్రేజ్‌ను కాపిటలైజ్ చేయాలన్నది ఈ డెసిషన్ వెనుక ఉన్న లాజిక్ కావచ్చు. ఇక ఈ సినిమా 2026లో విడుదల కానుంది. అప్పటివరకు ఒక్కో అప్డేట్‌తో ప్రేక్షకుల్లో హైప్ పెంచేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

మొత్తానికి బన్నీ అట్లీ సినిమా ఒక్కొక్క అంశమే ఇప్పుడు డిబేట్ కు కారణమవుతోంది. అట్లీకి వందకోట్ల పైన పారితోషికం అవసరమా? బన్నీకి అంత రెమ్యునరేషన్ ఇప్పుడే ఎందుకు? ఇలా ఎన్నో ప్రశ్నలు ఇండస్ట్రీలో చర్చకు వస్తున్నాయి. కానీ సినిమా కంటెంట్, ప్రెజెంటేషన్ సరైనదైతే ఈ మొత్తం ఖర్చు వ్యర్థం కాదని చెప్పుకోవచ్చు. ఆ ప్రశ్నలకు సమాధానం మాత్రం 2026 లో థియేటర్లలోనే తెలుస్తుంది.

Tags:    

Similar News