అబుదాబిలో ఐకాన్ స్టార్ యాక్షన్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ భారీ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.;
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ భారీ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన 50 రోజుల షూటింగ్ పూర్తైంది. AA22xA6 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా పై అందరికీ భారీ అంచనాలుండగా, ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన తాజా అప్డేట్ వినిపిస్తోంది.
అక్టోబర్ నుంచి AA22xA6 నెక్ట్స్ షెడ్యూల్
50 రోజుల షూటింగ్ ను పూర్తి చేసుకున్న అల్లు అర్జున్, రీసెంట్ గా ఈ సినిమా వీఎఫ్ఎక్స్ వర్క్స్ కోసం అమెరికాకు బయలుదేరినట్టు తెలుస్తోంది. #AA22 సినిమా నెక్ట్స్ షెడ్యూల్ అక్టోబర్ నుంచి మొదలుకానుందని, ఈ షెడ్యూల్ అబుదాబిలో జరగనున్నట్టు సమాచారం. విశాలమైన లివా ఒయాసిస్ లో భారీ యాక్షన్ సీన్స్ ను తెరకెక్కించనుండగా ఈ షెడ్యూల్ లో దీపికా పదుకొణె కూడా పాల్గొననున్నట్టు తెలుస్తోంది.
15 మంది రైటర్లతో కలిసి..
ఈ మూవీ కోసం అట్లీ భారతదేశంలోని 15 మంది ప్రముఖ రైటర్లతో కలిసి వర్క్ చేస్తున్నారని సన్నిహిత వర్గాల సమాచారం. రష్మిక మందన్నా, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తుండగా, నెక్ట్స్ షెడ్యూల్ మొదలయ్యే లోపు సినిమాను ప్రమోట్ చేయడానికి మేకర్స్ మంచి మార్కెటింగ్ ఏజెన్సీలను వెతుకుతున్నట్టు తెలుస్తోంది.
రూ.600 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ సినిమా కోసం పలువురు హాలీవుడ్ టెక్నీషియన్లు కూడా వర్క్ చేస్తుండగా ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కీలక పాత్ర పోషించనున్నాయి. సన్ నెట్‌వర్క్స్ బ్యానర్ లో కళానిధి మారన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా కోసం బన్నీ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా మూవీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు.