• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అంత‌కంత‌కు వేడి...

అంత‌కంత‌కు వేడి పెంచుతున్న 'థ‌గ్ లైఫ్‌'

| క‌మ‌ల్ హాస‌న్- మ‌ణిర‌త్నం అరుదైన క‌ల‌యిక‌లో రూపొందుతున్న 'థ‌గ్ లైఫ్' మోస్ట్ అవైటెడ్ సినిమాల జాబితాలో ఉంది

By - Tupaki Desk
Update: 2024-05-10 04:58 GMT

క‌మ‌ల్ హాస‌న్- మ‌ణిర‌త్నం అరుదైన క‌ల‌యిక‌లో రూపొందుతున్న 'థ‌గ్ లైఫ్' మోస్ట్ అవైటెడ్ సినిమాల జాబితాలో ఉంది. ఈ సినిమా కోసం మ‌ణిర‌త్నం చేయని ప్ర‌య‌త్నం లేదు. టైటిల్ ఎంపిక నుంచి స్టార్ల ఎంపిక వ‌ర‌కూ ప్ర‌తి దాంట్లో ప‌ర్ఫెక్ష‌న్ కోసం మ‌ణి స‌ర్ ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే తొలి నుంచి ఈ చిత్రానికి కొన్ని క‌లిసి రావ‌డం లేదు. ఈ మూవీలో తొలుత అనుకున్న స్టార్లు కొంద‌రు ఆక‌స్మికంగా మూవీ నుంచి వైదొల‌గ‌డంతో ఆ పాత్ర‌ల్లోకి వేరొక‌రిని ఎంపిక చేసుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది.

తాజా స‌మాచారం మేర‌కు..ప్రముఖ హిందీ నటుడు అలీ ఫజల్ పాన్-ఇండియా యాక్షన్ డ్రామా థగ్ లైఫ్‌లో కీలక పాత్ర పోషిస్తున్నట్లు క‌థ‌నాలొస్తున్నాయి. మిర్జాపూర్, ఫ్యూరియస్ 7 లాంటి సిరీస్ ల‌తో అత‌డు నిరూపించాడు. ఇప్పుడు థ‌గ్ లైఫ్ లో త‌న పార్ట్ చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేయ‌నున్నాడ‌ని తెలిసింది.

జాతీయ వార్తా పోర్టల్‌తో తాజా ఇంటర్వ్యూలో అలీ ఫజల్ మాట్లాడుతూ- భారతీయ సినీప‌రిశ్ర‌మ‌లోని ఇద్దరు లెజెండ్స్ తో కలిసి పనిచేయడంపై తన ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. ``థగ్ లైఫ్ కోసం మణి సర్ విజన్‌లో భాగమైనందుకు నేను థ్రిల్డ్‌గా ఉన్నాను. ఈ కాన్వాస్‌కు నేను ఏదో ఒక ప్రాముఖ్యతను తీసుకువస్తానని మాత్రమే ఆశిస్తున్నాను. కమల్ సర్‌తో కలిసి పని చేయడం.. మూవీ గురించి ఆయ‌న‌తో నోట్స్ పంచుకోవడం కూడా గౌరవంగా ఉంది. నాకు ఈ పాత్రను అప్పగించినందుకు మణి సర్‌కి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మంచి పాత్ర‌ను తెరపైకి తీసుకురావడానికి నేను ఆత్రుతగా ఉన్నాను`` అని అలీ ఫజల్ అన్నారు.

36 సంవత్సరాల క్రితం విడుదలైన మ‌ణిర‌త్నం- క‌మ‌ల్ హాస‌న్ ల‌ ఐకానిక్ గ్యాంగ్‌స్టర్ డ్రామా `నాయగన్` తర్వాత మ‌ళ్లీ ఇప్ప‌టికి థ‌గ్ లైఫ్ తో అదే జోడీ రిపీట‌వుతోంది. థగ్ లైఫ్‌లో త్రిష, శింబు, సన్యా మల్హోత్రా త‌దిత‌రులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు. థగ్ లైఫ్ ఈ ఏడాది డిసెంబర్‌లో థియేట‌ర్ల‌లో విడుదల కానుంది.

Tags:    
  • Alifazal 
  • Kamalhaasan 
  • Maniratnam 
  • Thuglife 
  • Filmindustry 
  • Jayamravi 
  • Alifazalthuglife 
  • Thuglifemovie 

Similar News

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Copyright @2026

Powered by Blink CMS