ఆర్యన్ ఖాన్ ప్రీమియర్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన ఆలియా.. డ్రెస్ ప్రత్యేకతలివే!

అయితే వీరందరిలో అలియా భట్ - రణబీర్ కపూర్ జంట చాలా స్పెషల్ గా నిలిచారు. దానికి కారణం అలియా భట్ వేసుకున్న డ్రెస్సే.;

Update: 2025-09-18 08:07 GMT

బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ ఓవైపు భార్యగా..తల్లిగా.. తన బాధ్యతలు కొనసాగిస్తూనే.. మరోవైపు నటిగా ఇండస్ట్రీలో రాణిస్తోంది. అయితే అలాంటి ఈ హీరోయిన్ తాజాగా షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డైరెక్టర్ గా చేసిన తొలి వెబ్ సిరీస్ ప్రీమియర్ షో చూడడానికి వచ్చింది. అయితే ఈ ప్రీమియర్ షోలో అందరిలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది అలియా భట్. దానికి కారణం ఆమె ధరించిన గూచి బ్రాండ్ కి సంబంధించిన స్పెషల్ డిజైన్ తో ఉన్న డ్రెస్.. మరి ఇంతకీ ఆ డ్రెస్ కి ఉన్న స్పెషాలిటీ ఏంటి.. ? దాని ధర ఎంత ?అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..


బాలీవుడ్ కింగ్ ఖాన్ అయినటువంటి షారుఖ్ ఖాన్ తనయుడు మొదటిసారి 'ది బా***డ్స్ ఆఫ్ బాలీవుడ్' అనే వెబ్ సిరీస్ తెరకెక్కించారు. అయితే ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన ప్రీమియర్ షో చూడడం కోసం చాలామంది బాలీవుడ్ సెలబ్రిటీలు తరలివచ్చారు. అయితే వీరందరిలో అలియా భట్ - రణబీర్ కపూర్ జంట చాలా స్పెషల్ గా నిలిచారు. దానికి కారణం అలియా భట్ వేసుకున్న డ్రెస్సే. అలియా భట్ తెలుపు రంగు డ్రెస్ లో దర్శనమిచ్చింది.1996 నాటి గూచి కలెక్షన్ నుండి ఆర్కైవల్ టామ్ ఫోర్డ్ పీస్ ని ఈవెంట్ కోసం స్పెషల్ గా వేసుకుంది.. ఆర్కైవల్ వైట్ జెర్సీ డ్రెస్ లో G- బకిల్ బెల్ట్ పెట్టుకొని కనిపించింది.. అలాగే గూచి బాంబూ 1947 మినీ బ్యాగ్, టిఫనీ ఆభరణాలతో తన అందాన్ని రెట్టింపు చేసుకుంది. అలాగే తన అందమైన జుట్టుని సొగసైన బన్ తో ముడి పెట్టింది.


అలియా భట్ వేసుకున్న ఈ డ్రెస్ అందరిలో సెంటరాఫ్ అట్రాక్షన్ గా ఉండడంతో చాలామంది అలియా భట్ లుక్ పై ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా అలియా భట్ ఈ డ్రెస్ లో ఉన్న ఫోటోలను ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయడంతో చాలామంది సెలబ్రిటీలు కూడా లైక్ లు, పోస్టులు పెట్టారు. దీపిక పదుకొనే అద్భుతంగా ఉంది అంటూ కొనియాడింది. అలా అద్భుతమైన వైట్ కలర్ డ్రెస్ లో రణబీర్ తో కలిసి ఆలియా నడుచుకుంటూ వస్తూ ఉంటే చూడడానికి రెండు కళ్ళు చాలడం లేదని మరో నెటిజెన్ కామెంట్ పెట్టాడు.. అలా ఈ జంట ఫోటోగ్రాఫర్లకు ఫోజులిచ్చి ప్రీమియర్ షోలో అందరి దృష్టిని ఆకర్షించారు.. ఇకపోతే గూచి బ్రాండ్ ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ డ్రెస్ ఖరీదు సుమారుగా కొన్ని లక్షల్లో ఉంటుందని సమాచారం.


అలియా భట్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈ హీరోయిన్ నటించిన 'ఆల్ఫా' మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.ఈ మూవీ యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో 7వ భాగం డిసెంబర్ 25న విడుదలవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.. ఇందులో అలియా భట్ ఒక కొత్త డైనమిక్ అవతారంలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది.ఈ సినిమా మాత్రమే కాకుండా సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్లో 'లవ్&వార్' లో కూడా నటిస్తోంది. ఇందులో రణబీర్ కపూర్, విక్కీ కౌశల్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.


Tags:    

Similar News