2026: న్యూ ఇయర్ కి డబుల్ ట్రీట్ ఇవ్వనున్న ఆలియా!

2026.. కొత్త ఏడాది కొత్త సినిమా కథలతో ప్రేక్షకులను మెప్పించడానికి ఎంతో మంది సెలబ్రిటీలు సిద్ధమవుతున్నారు.;

Update: 2025-12-31 03:15 GMT

2026.. కొత్త ఏడాది కొత్త సినిమా కథలతో ప్రేక్షకులను మెప్పించడానికి ఎంతో మంది సెలబ్రిటీలు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా రెబల్ స్టార్ ప్రభాస్ ను మొదలుకొని నవీన్ పోలిశెట్టి వరకు.. ఇలా ఎంతోమంది యంగ్ హీరోలు తోపాటు మెగాస్టార్ చిరంజీవి, రవితేజ, వెంకటేష్ లాంటి సీనియర్ హీరోలు కూడా తమ సినిమాలతో ప్రేక్షకులను అలరించబోతున్నారు. ఇకపోతే హీరోలే కాదు హీరోయిన్లు కూడా తమ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఒక హీరోయిన్ ఏకంగా డబుల్ ట్రీట్ ఈ న్యూ ఇయర్ కి ఇవ్వడానికి సిద్ధమయ్యింది. ఆమె ఎవరో కాదు అందాలతార ఆలియా భట్.

మహేష్ భట్ వారసురాలిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆలియా భట్ తన అందంతోనే కాదు నటనతో కూడా అందరిని అబ్బురపరిచింది. ముఖ్యంగా హీరో రేంజ్ లో యాక్షన్ పర్ఫామెన్స్ తో అదరగొట్టేస్తూ నేషనల్ అవార్డులతో పాటు ఫిలింఫేర్ అవార్డుల కోసం అనేక ప్రశంసలు కూడా అందుకుంది ఆలియా భట్. హిందీలోనే సినిమాలు చేస్తూ అక్కడే పరిమితం కాకుండా తెలుగులో ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలలో కూడా నటించి, తెలుగు ప్రేక్షకులను మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉండగా కొత్త ఏడాది ఏకంగా రెండు చిత్రాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అయ్యింది.

ఇకపోతే గత ఏడాది జిగ్రా సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఆలియా భట్ ఈ ఏడాదిలో కూడా తెరపైకి రావాల్సి ఉన్నా షూటింగ్ ఆలస్యంతో పాటు ఇతర కారణాల వల్ల థియేటర్లలో ఆమె సందడి కనిపించలేదు. అలా ఈ ఏడాది ప్రేక్షకులను పలకరించని తారలలో ఒకరిగా నిలిచింది ఆలియా భట్. ముఖ్యంగా ఈమె నటించిన లవ్ అండ్ వార్, ఆల్ఫా చిత్రాలు ఈ ఏడాది విడుదల కావాల్సి ఉండగా అనుకోని కారణాలవల్ల ఈ రెండు చిత్రాలు కూడా వాయిదా పడ్డాయి. దాంతో ఈ ఏడాది ఆమె తన సినిమాలను రిలీజ్ చేయలేకపోయింది. కానీ వచ్చే ఏడాది ఒకేసారి రెండు సినిమాలతో డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

ఏది ఏమైనా ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకులను అలరించలేకపోయినా.. వచ్చే ఏడాది ఏకంగా రెండు చిత్రాలతో మెప్పించడానికి సిద్ధం అవుతుంది. మరి ఆ చిత్రాలతో ఆలియా భట్ ఎలాంటి సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుంటుందో చూడాలి.

సంజయ్ లీల భన్సాలీ దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్, అలియా భట్ , విక్కీ కౌశల్ కాంబినేషన్లో రాబోతున్న చిత్రం లవ్ అండ్ వార్. ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్ గా రిలీజ్ కాబోతోంది . ఇక ఈ చిత్రంతోపాటు ప్రముఖ డైరెక్టర్ శివ రావైల్ దర్శకత్వంలో ఆలియా భట్, శార్వరి, బాబీ డియోల్, హృరోషన్ , అనిల్ కపూర్ తదితరులు కీలకపాత్రలో నటిస్తున్న చిత్రం ఆల్ఫా. ఈ సినిమా కూడా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags:    

Similar News