స్టార్ హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. ఆలియా తీరుపై ప్ర‌శంస‌లు!

సెలబ్రిటీలపై జోకులు, సెటైర్లు వేయడం కొత్త విషయం కాదు. కానీ ఆ సెల‌బ్రిటీలు వాటిని ఎలా స్వీకరిస్తారన్నదే వారి వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది.

Update: 2026-06-22 10:08 GMT

సెలబ్రిటీలపై జోకులు, సెటైర్లు వేయడం కొత్త విషయం కాదు. కానీ ఆ సెల‌బ్రిటీలు వాటిని ఎలా స్వీకరిస్తారన్నదే వారి వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భ‌ట్ ఒక ప్రముఖ కామెడీ షోలో పాల్గొన‌గా, ఇదే విషయం మరోసారి చర్చనీయాంశంగా మారింది. షో మొత్తం వినోదాత్మక వాతావరణంలో సాగినా, ఆలియాపై వచ్చిన పలు సరదా వ్యాఖ్యలు ప్రత్యేకంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. సాధారణంగా స్టార్ హీరోయిన్లపై ఎవరైనా సరదాగా కామెంట్లు చేస్తే వాటిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలవుతుంది. అయితే ఈ సందర్భంలో మాత్రం ఆలియా పూర్తిగా భిన్నంగా కనిపించింది. తనపై వచ్చిన ప్రతి జోక్‌ను చిరునవ్వుతో స్వీకరించడం, ఎక్కడా అసౌకర్యం వ్యక్తం చేయకుండా షోలో భాగమవడం ప్రేక్షకులను ఆకట్టుకుంది. అదే ఇప్పుడు సోషల్ మీడియాలో ఆమెకు పాజిటివ్ ఇమేజ్‌ను తీసుకొచ్చిందని చెప్పవచ్చు.

ఈ ఎపిసోడ్‌లో హోస్ట్ స‌మ‌య్ రైనా తో పాటు పాల్గొన్న కొందరు కంటెస్టెంట్లు కూడా ఆలియాపై వరుసగా పంచ్‌లు వేశారు. అయితే వాటికి ఆమె ఇచ్చిన రియాక్షన్లే అసలు హైలైట్‌గా నిలిచాయి. జోకులకు నవ్వుతూ స్పందించడం, వాటిని ప‌ర్స‌న‌ల్‌గా తీసుకోకపోవడం ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంటోంది. ఇక స్టూడియోలోని ఆడియ‌న్స్ రెస్పాన్స్ స్పందన కూడా ఈ ఎపిసోడ్ సక్సెస్‌కు కీలకంగా మారింది. ప్రతి సరదా కామెంట్ కు హర్షధ్వానాలు వినిపించగా, కొన్ని సందర్భాల్లో ఆలియా రియాక్షన్లకే ఎక్కువ చప్పట్లు వచ్చాయని సోషల్ మీడియాలో కామెంట్లు కనిపిస్తున్నాయి. షోలో కనిపించిన లైవ్ ఎనర్జీ, ప్రేక్షకుల భాగస్వామ్యం ఎపిసోడ్‌ను మరింత ఎంగేజింగ్‌గా మార్చాయి.

మరోవైపు, ఆలియా పాల్గొనడం వల్ల షోకు అదనపు ఆకర్షణ లభించిందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఇప్పటికే యూత్ లో మంచి ఇండియాస్ గాట్ లేటెంట్ కామెడీ ఫార్మాట్‌కు బాలీవుడ్ స్టార్ హాజరవడం వల్ల కొత్త ప్రేక్షకులు కూడా షో వైపు ఆకర్షితులయ్యారని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఆలియా నుంచి రాబోయే తాజా సినిమా ఆల్ఫా ప్రమోషన్స్‌కు కూడా ఇది మంచి వేదికగా మారినట్లు కనిపిస్తోంది.

మొత్తానికి ఇండియాస్ గాట్ లేటెంట్ సీజన్ 2 గ్రాండ్‌గా ఈ ఎపిసోడ్‌తో మొద‌ల‌వ‌గా, మెయిన్ డిస్క‌ష‌న్ జోకుల గురించే జరిగినప్పటికీ, చివరికి ఎక్కువ ప్రశంసలు అందుకున్నది మాత్రం ఆలియానే అని సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌లు మొద‌ల‌య్యాయి. స్టార్‌డమ్ ఎంత పెద్దదైనా, సరదాను సరదాగా తీసుకోవడం కూడా అంతే ముఖ్యమని ఆమె మరోసారి నిరూపించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న క్లిప్స్‌ను చూస్తే, ఈ ఎపిసోడ్ స‌క్సెస్‌లో కామెడీతో పాటు ఆలియా స్పోర్టివ్‌నెస్ కూడా కీలక పాత్ర పోషించిందని చెప్పొచ్చు.

Tags:    

Similar News