బాస్ లేడీ వ‌ర్సెస్ లేడీ స్పై.. హూ ఈజ్ దిస్?

ఆర్.ఆర్.ఆర్ లో రామ‌రాజు స‌ర‌స‌న సీత‌గా అద్భుత న‌ట‌న‌తో మెప్పించింది ఆలియా భ‌ట్. ఎస్.ఎస్.రాజ‌మౌళి తెర‌కెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రంలో ఆలియా పాత్ర చిన్న‌దే అయినా ఎంతో ప్ర‌త్యేక‌మైన‌ది.;

Update: 2026-01-10 04:36 GMT

ఆర్.ఆర్.ఆర్ లో రామ‌రాజు స‌ర‌స‌న సీత‌గా అద్భుత న‌ట‌న‌తో మెప్పించింది ఆలియా భ‌ట్. ఎస్.ఎస్.రాజ‌మౌళి తెర‌కెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రంలో ఆలియా పాత్ర చిన్న‌దే అయినా ఎంతో ప్ర‌త్యేక‌మైన‌ది. ఆలియా నేడు భార‌త‌దేశంలోని బిగ్గెస్ట్ స్టార్స్ లో ఒక‌రిగా ఏల్తున్నారు. ఇటీవ‌ల లేడీ స్పై యూనివ‌ర్శ్ `ఆల్ఫా`లో న‌టిస్తున్న‌ ఆలియా పేరు గూగుల్ లో ట్రెండింగ్‌లో ఉంది. ఈ చిత్రాన్ని ప్ర‌తిష్ఠాత్మ‌క య‌ష్ రాజ్ ఫిలింస్ అత్యంత భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తోంది.




 


ఓవైపు హ‌బ్బీ ర‌ణబీర్ క‌పూర్ మోస్ట్ అవైటెడ్ రామాయ‌ణం చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉంటే, ఆలియా త‌న ఆల్ఫా చిత్రీక‌ర‌ణ కోసం అహోరాత్రులు శ్ర‌మిస్తోంది. ఇటీవ‌ల క్రిస్మ‌స్ వీకెండ్ తో పాటు, ఇయ‌ర్ ఎండ్ సెల‌బ్రేష‌న్స్ కోసం భ‌ర్త‌, పిల్ల‌ల‌తో క‌లిసి ఆలియా ఎగ్జోటిక్ లొకేష‌న్ కి వెళ్లారు. ఇంత‌లోనే ఆలియాకు సంబంధించిన‌ కొన్ని క్లాసీ ఫోటోషూట్లు ఇంటర్నెట్లో వైర‌ల్ గా మారుతున్నాయి.




 


ఇటీవల ఓ ప్రైవేట్ ఈవెంట్‌లో తన స్టైలిష్ క్లాసిక్ లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు ఆలియా. ఫ్యాషన్ విశ్లేషకులు ఆమె ధరించిన యూనిక్ స్టైల్‌ను తెగ పొగిడేస్తున్నారు. త‌న‌కోస‌మే డిజైన్ చేసిన ఒక పర్ఫెక్ట్ బ్లేజ‌ర్ లో ఆలియా లేడీ బాస్ ని త‌ల‌పించింది. దీనికి క్లాసిక్ బ్లూ ష‌ర్ట్ అంతే పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది. `కార్పొరేట్ పవర్ లుక్` కు మోడ్రన్ టచ్ ఇచ్చిన ఈ కొత్త రూపం నిజంగా యువ‌త‌రంలో క్యూరియాసిటీని పెంచింది.




 


ఈ లుక్ కి త‌గ్గ‌ట్టే భారీ నగలు లేదా మేకప్‌తో ప‌ని లేకుండా చాలా సింపుల్‌గా క‌నిపించింది ఆలియా. ఈవెంట్‌లో నో-మేకప్ లుక్, సింపుల్ హెయిర్ స్టైల్‌తో మెరిపించింది. ప్రస్తుతం ఫ్యాషన్ ప్రపంచంలో అట్ట‌హాసం లేకుండానే యూత్ ని ఆక‌ట్టుకోవ‌డం ఎలానో ఆలియాను చూసి నేటిత‌రం నేర్చుకోవ‌చ్చు.




 


కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే, ఆల్ఫా ఆలియా కెరీర్ లో అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రంగా విడుద‌ల కానుంది. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ చిత్రం ఆల్ఫాలో షర్వారీ వాఘ్‌తో కలిసి భారీ యాక్షన్ రోల్ లో ఆలియా కనిపించ‌నుంది. అలాగే సంజ‌య్ లీలా భ‌న్సాలీ రూపొందిస్తున్న `లవ్ అండ్ వార్`లో రణబీర్ కపూర్ , విక్కీ కౌశల్‌తో కలిసి నటిస్తోంది.

ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఒక అవార్డు ఫంక్షన్‌లో అలియా కనిపించినప్పుడు రామ్ చరణ్ - సుకుమార్ కాంబినేషన్‌లో తెర‌కెక్క‌నున్న‌ సినిమాలో నటించే అవకాశం ఉందని గుస‌గుసలు వినిపించాయి. కానీ దీనికి అధికారికంగా ఎలాంటి ప్ర‌క‌ట‌నా విడుద‌ల కాలేదు. ఆలియా ఎంట‌ర్ ప్రెన్యూర్ గాను దూసుకెళుతోంది. తన దుస్తుల‌ బ్రాండ్ ఎడ్‌- ఏ మామా మార్కెట్లో భారీ లాభాల‌ను ఆర్జిస్తోంది. న‌టిగా, బాధ్య‌తాయుత‌మైన ఇల్లాలిగా, బాస్ లేడీగా ఆలియా రియ‌ల్ లైఫ్‌లో త్రిపాత్ర‌ల‌తో అందరి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.




Tags:    

Similar News