అలియా భట్ కి ఘోర అవమానం.. ఫ్యాన్స్ ఫైర్!

కాలం మారుతున్న కొద్దీ అటు అభిమానులలోనే కాదు ఇటు సెలబ్రిటీలలో కూడా అభిరుచులు మారిపోతున్నాయి.

Update: 2026-05-13 06:17 GMT

కాలం మారుతున్న కొద్దీ అటు అభిమానులలోనే కాదు ఇటు సెలబ్రిటీలలో కూడా అభిరుచులు మారిపోతున్నాయి. ప్రాంతీయంగానే పరిమితం కాకుండా ఎల్లలు దాటుతూ..తమ ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ ని మొదలుకొని బాలీవుడ్ వరకు ఎంతో మంది భామలు అంతర్జాతీయ వేదికలపై కనిపించి సందడి చేస్తున్నారు. ఇక్కడ భిన్న భిన్నమైన వస్త్రధారణతో, జువెలరీతో అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నారు. ఇంకొంతమంది గ్లామర్ తో కట్టిపడేసే ప్రయత్నం చేసినా.. అనుకోకుండా జరిగే తప్పిదాల వల్ల వారికి అవమానం జరుగుతోంది అనే కామెంట్లు కూడా సోషల్ మీడియా ద్వారా వ్యక్తమవుతున్నాయి.




 


అందులో భాగంగానే బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బార్బీ గర్ల్ గా గుర్తింపు తెచ్చుకున్న అలియా భట్ కి అంతర్జాతీయ వేదికపై అవమానం జరగడాన్ని చూసి అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. అంతటి గొప్ప నటిని పట్టించుకోకపోవడం ఏంటి అంటూ పెదవి విరుస్తున్నారు. అసలు విషయంలోకి వెళితే.. ఇటీవల ఫ్రాన్స్ లో 79వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ ఘనంగా జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాషన్ ప్రియులు ఈ రెడ్ కార్పెట్ పై నడిచి అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే వివిధ దేశాలకు చెందిన ప్రముఖులతోపాటు ఇండియాకి చెందిన పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఈ రెడ్ కార్పెట్ పై నడుస్తున్న విషయం తెలిసిందే.




 


అందులో భాగంగానే బాలీవుడ్ నుండి అక్కడికి వెళ్లిన అలియా భట్ తన అంద చందాలతో అక్కడివారిని కట్టిపడేసే ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే.. బ్రాండ్ ప్రమోషన్స్ లో భాగంగా లేత గులాబీ రంగు గౌనులో కనిపించి.. అందరిని ఆకట్టుకుంది. తమారా రాల్ఫ్ రూపొందించిన.. బస్టియర్ నెక్ లైన్ కలిగిన డ్రెస్ ధరించి మెస్మరైజ్ చేసింది. ముఖ్యంగా షోల్డర్ లెస్ గౌనులో.. శరీర ఆకృతికి సరితూగేలా ధరించిన ఈ డ్రెస్సు అందరిని ఆకట్టుకుంది. ముఖ్యంగా దీనికి కాంబినేషన్లో దుపట్టాను ఆమె చేతులపై పట్టుకొని ఆ రూపానికి భారతీయ కలను జోడించింది. ఇక నెక్ ను బోసిగా ఉంచకుండా తన గౌనుకి కాంబినేషన్లో లేత గులాబీ రంగు రాళ్లు పొదిగిన నెక్ పీస్ ధరించి మరింత హుందాగా కనిపించింది .




 


ఈ డ్రెస్ లో రెడ్ కార్పెట్ పై అలా వయ్యారంగా నడుస్తూ అందరి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేసింది. కానీ కెమెరామెన్లు మాత్రం అలియా భట్ ను పట్టించుకోకపోవడం గమనార్హం. అందుకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.




 


రెడ్ కార్పెట్ పై చాలా కాన్ఫిడెంట్ గా కనిపించి అందరి దృష్టిని ఆకట్టుకోవడానికి అలియా భట్ ఎంత శ్రమించినా సరే అక్కడి ఫోటోగ్రాఫర్లు ఇంకొక విదేశీ యువతిపై ఫోకస్ పెట్టడం చూసి సినీ ప్రముఖులు కూడా ఆశ్చర్యపోతున్నారు. బార్బీ గర్ల్ లాంటి అమ్మాయి రెడ్ కార్పెట్ పై హుందాగా నడుస్తుంటే ఆమెను పట్టించుకోకపోవడం ఏంటి అంటూ పెదవి విరుస్తున్నారు. ఏది ఏమైనా అలియా భట్ కి అవమానం జరిగింది అంటూ నెటిజన్లు కూడా సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.



Tags:    

Similar News