ఆ డైరెక్టర్ పేరు వెనుక స్టోరీ హాట్ టాపిక్… సాలిడ్ ఆన్సర్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, రితికా నాయక్ జంటగా దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కించిన వినూత్న హారర్ కామెడీ చిత్రం ‘కొరియన్ కనకరాజు’.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, రితికా నాయక్ జంటగా దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కించిన వినూత్న హారర్ కామెడీ చిత్రం ‘కొరియన్ కనకరాజు’. ఆగస్ట్ 7న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సక్సెస్ ఊపులో ఉన్న మేర్లపాక గాంధీ ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్, కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలను తుపాకీ న్యూస్ కి ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ముఖ్యంగా తన పేరు 'చే గువేరా' నుంచి 'గాంధీ'గా ఎలా మారిందనే విషయాన్ని సరదాగా వెల్లడించడంతో ఆ స్టోరీ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
చే గువేరా నుంచి గాంధీగా మార్పు:
తుపాకీ న్యూస్ కి ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో యాంకర్ తన పేరు వెనుక ఉన్న రహస్యం గురించి అడగగా, గాంధీ ఆసక్తికరంగా సమాధానం చెప్పారు. తన తండ్రి ప్రముఖ నవలా రచయిత మేర్లపాక మురళికి కమ్యూనిజం భావజాలం, ఆ ఫిలాసఫీ అంటే ఎంతో ఇష్టమని చెప్పారు. ఇక ఆ ప్రభావంతోనే చిన్నప్పుడు తనకు 'చే గువేరా' అని పేరు పెట్టారట. అయితే ఊరిలో ఉన్నవాళ్లకు ఆ పేరు నోరు తిరక్క జగ్గువేరా, జగ్గు అని రకరకాలుగా పిలిచేవారని, అందరికీ సమాధానం చెప్పలేక విసుగు వచ్చి ఒకరోజు నాన్నే తన పేరును 'గాంధీ'గా మార్చారని నవ్వుతూ వెల్లడించారు.
డైరెక్టర్ అవ్వడానికి కారణం నాన్నే: రచయితగా, దర్శకుడిగా తాను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి మూలకారణం తన తండ్రేనని గాంధీ చెప్పుకొచ్చారు. చిన్నతనం నుంచే పుస్తకాలు చదివించడం, సాహిత్యంపై ఆసక్తి పెంచడం ద్వారా తనకు సినిమాపై పిచ్చి మొదలైందన్నారు. ఇక ఎల్వీ ప్రసాద్ ఫిల్మ్ స్కూల్‌లో చేర్పించడమే కాకుండా, ఇప్పుడు కూడా తాను స్క్రిప్ట్ పూర్తి చేయగానే మొదట తండ్రికే ఇస్తానని చెప్పారు. ఇద్దరం కలిసి చర్చించుకుని, అవసరమైన మార్పులు చేసుకుంటామని తెలిపారు.
సినిమా ఆలస్యమవ్వడానికి అసలు కారణాలు:
'లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్' తర్వాత మళ్లీ 'కొరియన్ కనకరాజు' సినిమాకి మధ్య నాలుగేళ్ల గ్యాప్ రావడంపై గాంధీ స్పందించారు. ఇక కథ రాయడానికి, సెట్ అవ్వడానికి ఏడాది పట్టిందని చెప్పారు. ఆ తర్వాత హీరో వరుణ్ తేజ్ బిజీగా ఉండటం, కమెడియన్ సత్య డేట్లు దొరక్కపోవడం, అలాగే కొరియా నుంచి నటులను ఇక్కడికి రప్పించడం, వీసా సమస్యలు రావడం వల్ల అనుకోకుండా లేట్ అయిందని వివరించారు.
గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చిన గాంధీ:
'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్', 'ఎక్స్‌ప్రెస్ రాజా' వంటి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్‌బస్టర్ హిట్ల తర్వాత మేర్లపాక గాంధీ మార్క్ కామెడీని ప్రేక్షకులు బాగా మిస్ అయ్యారు. ఇక ఇప్పుడు 'కొరియన్ కనకరాజు'తో ఆయన మళ్లీ తన పాత ఫామ్‌లోకి వచ్చి, థియేటర్లలో నవ్వుల వర్షం కురిపిస్తున్నారు. వైవిధ్యమైన కాన్సెప్ట్, తమన్ ఆర్‌ఆర్, సత్య కామెడీ టైమింగ్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి.
పేరు మారినా తనలో ఉన్న నైపుణ్యం, సినిమాపై ఉన్న ప్రేమ మారలేదని మేర్లపాక గాంధీ ప్ర నిరూపించారు. తండ్రి ఇచ్చిన ప్రోత్సాహంతో పరిశ్రమలోకి వచ్చి, తనకంటూ ప్రత్యేకమైన కామెడీ మార్క్‌ను క్రియేట్ చేసుకున్నారు. ఇక 'కొరియన్ కనకరాజు' సక్సెస్‌ను ఆస్వాదిస్తున్న ఆయన, భవిష్యత్తులో కూడా ఇలాంటి అద్భుతమైన వినోదాత్మక చిత్రాలను అందించి ప్రేక్షకులను అలరించాలని ఆశిద్దాం.