ఆ వివాదంపై ఇప్పుడు కమెడియన్ అలీ!
ముఖ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలకు వచ్చిన ఆయన.. కమెడియన్ అలీపై అసభ్యకరమైన కామెంట్ చేశారు. బూతు పదం మాట్లాడిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఆ విషయం చర్చనీయాంశమైంది.;
టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ తన వ్యాఖ్యలతో ఇటీవల వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ప్రముఖ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలకు వచ్చిన ఆయన.. కమెడియన్ అలీపై అసభ్యకరమైన కామెంట్ చేశారు. బూతు పదం మాట్లాడిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఆ విషయం చర్చనీయాంశమైంది.
అనేక మంది నెటిజన్లు స్పందించి.. సీనియర్ నటులు అలా మాట్లాడటం కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డారు. ఎంతో క్లోజ్ ఉన్నా.. బహిరంగంగా అలా కామెంట్ చేయడం సరికాదన్నారు. దీంతో ఆ వివాదంపై ఇప్పుడు కమెడియన్ అలీ రెస్పాండ్ అయ్యారు. తనపై రాజేంద్ర ప్రసాద్ ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేయలేదని అలీ అభిప్రాయపడ్డారు.
కేవలం రాజేంద్ర ప్రసాద్ మాటా తూలిందని అలీ చెప్పారు. ఈ మేరకు వీడియోను సోమవారం రిలీజ్ చేశారు. "అందరికీ నమస్కారం. నిన్న కృష్ణారెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా జరిగిన ఈవెంట్ లో అనుకోకుండా సరదాగా రాజేంద్రప్రసాద్ మాట తుల్లింది ఆయన మంచి ఆర్టిస్ట్. ప్రస్తుతం పుట్టెడు దుఃఖంలో ఉన్నారు" అని అలీ అన్నారు.
"తన కుమార్తెను కోల్పోయిన విషయం మనందరికీ తెలుసు.. అమ్మ లాంటి బిడ్డ.. ఇది ఆయన కావాలని చెప్పింది కాదు.. దీన్ని మరి ఎవరూ పెద్దది చేయొద్దు.. ఆయన పెద్దాయన" అంటూ అలీ కోరారు. ప్రస్తుతం అలీ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా, రీసెంట్ గా ఆ విషయంపై రాజేంద్ర ప్రసాద్ కూడా స్పందించారు.
తన లేటెస్ట్ మూవీ షష్టిపూర్తి మేకర్స్ సక్సెస్ మీట్ ను సోమవారం నిర్వహించగా.. ఆయన మాట్లాడారు. ఇటీవల తాను మాట్లాడిన మాటలు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని తెలిపారు. తాను ఎప్పుడూ అందరికీ సరదాగా ఉంటానని అన్నారు. దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే అది మీ కర్మపై ఆధారపడి ఉంటుందని వ్యాఖ్యానించారు.
"ఇటీవల నేను ఏదో అన్నానని అంటున్నారు.. నేను వారికి అన్న లాంటి వాడిని.. అందుకే సరదాగా ఉంటాను.. ఎప్పుడూ అనేక విషయాలు చెబుతుంటాను. నేను ఎప్పుడూ ఇలాగే ఉంటాను. ఇండస్ట్రీలోని అందరితో జోక్ గా ఉంటాను. కాబట్టి మీరు తప్పుగా అనుకుంటే నేనేం చేయలేను. అది మీ కర్మ" అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. అక్కడికి కాసేపటికే అలీ రెస్పాండ్ అయ్యారు.