మాస్ రాజా ఆ స్టార్ హీరో రికార్డుకు ద‌గ్గ‌ర్లో!

బాలీవుడ్ లో ప్లాప్ హీరో ఎవ‌రు? అంటే అంద‌రికీ గుర్తొచ్చేది కిలాడీ అక్ష‌య్ కుమార్. వ‌రుస వైఫ‌ల్యాల‌తో అక్ష‌య్ ఎంత‌గా ట్రోల్ అయ్యాడు? అన్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు.;

Update: 2025-11-05 00:30 GMT

బాలీవుడ్ లో ప్లాప్ హీరో ఎవ‌రు? అంటే అంద‌రికీ గుర్తొచ్చేది కిలాడీ అక్ష‌య్ కుమార్. వ‌రుస వైఫ‌ల్యాల‌తో అక్ష‌య్ ఎంత‌గా ట్రోల్ అయ్యాడు? అన్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. ప్లాప్ ల్లో త‌న‌కు ప్ర‌త్యేక‌మైన రికార్డు ఉంద‌ని ప్రూవ్ చేసిన స్టార్ ఇత‌డు. ప్లాప్ స్టార్ గా ముద్ర వేసుకున్నాడు. ఎన్నో విమ‌ర్శ‌లు ఎదుర్కున్నాడు. అయినా ఏనాడు వెన‌క్కి త‌గ్గ‌లేదు. విమ‌ర్శించే నోళ్ల‌ను ఏదో రోజు మూయించ‌క‌పోతానా? అన్న ధీమాతో ప్ర‌యాణాన్ని ముందుకు సాగిస్తున్నాడు.

కెరీర్ మొత్తంలో ప్లాప్ లే అధికం:

మ‌రి టాలీవుడ్ లో కూడా ఇలాంటి స్టార్ ఎవ‌రైనా ఉన్నారా? అంటే మాస్ రాజా రవితేజ పేరు వినిపిస్తుంది. స‌న్నివేశం చూస్తుంటే ప్లాప్ ల్లో కిలాడీ రికార్డులే మాస్ రాజా తిర‌గ‌రాసేలా ఉన్నాడు. ఓసారి ఆ ఇద్ద‌రి హీరోల ప్లాప్ ల్లోకి వెళ్తే? వ్యత్యాసం ఎలా ఉంద‌న్న‌ది తెలుస్తుంది. అక్ష‌య్ కుమార్ కెరీర్ మొత్తం చూస్తే హిట్స్ కంటే ప్లాప్స్ ఎక్కువ‌గా క‌నిపిస్తాయి. వాటిని ప‌క్క‌న బెట్టి 2023 నుంచి అక్ష‌య్ ప్లాప్ చిత్రాల లిస్ట్ ఇలా ఉంది. 2023-24 మ‌ధ్య‌లో వ‌రుస‌గా ఐదు ప్లాపుల ప‌డ్డాయి. ఆ త‌ర్వాత రిలీజ్ అయిన `స్కై పోర్స్` కూడా ప్లాప్ అయింది.

తాజా రిలీజ్ ల‌తో ఉప‌శ‌మ‌నం:

ఆ త‌ర్వాత రిలీజ్ అయిన `కేస‌రి చాప్ట‌ర్ 2`, `హౌస్ ఫుల్ 5`, `జాలీ ఎల్ ఎల్ బీ 3` కాస్త సానుకూల ఫ‌లితాలిచ్చాయి. అవి కూడా డిజాస్ట‌ర్ ఖాతాలో ప‌డితే కేల్ ఖ‌తం దుకాణ్ బంద్ అన్న‌ట్లే స‌న్నివేశం మారేది. స‌రిగ్గా మాస్ రాజా ప్లాప్ లైన‌ప్ కూడా ఇలాగే ఉంది. 2023-25 మ‌ధ్య ఏకంగా ఐదు ప్లాప్ లు ప‌డ్డాయి. `రావ‌ణాసుర‌`, `టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు`, `ఈగ‌ల్`, ` మిస్ట‌ర్ బ‌చ్చ‌న్`, `మాస్ జాత‌ర` అన్నీ ఒకదానొకొక‌టి పోటీ పడి మ‌రీ ప్లాప్ అయ్యాయి. మ‌రో రెండు ప్లాప్ లు ప‌డితే అక్ష‌య్ కుమార్ రికార్డు బ్రేక్ అయిన‌ట్లే. ర‌వితేజ చివ‌ర‌గా `ధ‌మాకా`తో మంచి హిట్ అందుకున్నాడు.

హీరో పై కంటే డైరెక్ట‌ర్ పై న‌మ్మ‌కం:

ఆ త‌ర్వాత చేసినవే ఈ ప్లాప్ చిత్రాల‌న్నీ. `ధ‌మాకా` ముందు ఫ‌లితాలు చూసినా అన్నీ ప్లాప్ లే. మ‌ధ్య‌లో `క్రాక్` తో ఉప‌శ‌మ‌నం ద‌క్కింది. లేదంటే ప్లాప్ లైన‌ప్ క్లియ‌ర్ గా ఉండేది. `మాస్ జాత‌ర` ఈ మ‌ధ్య‌నే రిలీజ్ అయిన చిత్రం. ఈ చిత్రంతోనైనా మాస్ యాంగిల్ ని ప‌క్క‌న బెట్టి కొత్త‌గా ట్రై చేసి ఉంటాడ‌ని ఆశించారు. కానీ అభిమానుల‌కు అది ఆశ‌గానే మిగిలిపోయింది. ప్ర‌స్తుతం కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో కొత్త‌గా ప్ర‌య‌త్నించే అవ‌కాశం ఉంది. ఎందుకంటే కిషోర్ కి డైరెక్ట‌ర్ గా ఓ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ఉంది. అత‌డు తీసిన సినిమాలేవి డిజాస్ట‌ర్లు కాలేదు. చాలా చిత్రాలు యావ‌రేజ్ గా ఆడిన‌వే.

Tags:    

Similar News