అక్కీ (X) బెబో: ఒక‌రు బాంద్రాను కొనేస్తే, ఇంకొక‌రు జుహూను కొనేసారు

ఈ సందర్భంగా అక్కీ మాట్లాడుతూ.. ``ముంబైలోని బాంద్రాలో ఉన్న ప్రతి బిల్డింగ్‌లో కరిష్మా కపూర్‌కు ఒక ఫ్లాట్ ఉంది. బిల్డింగ్ బయట నేమ్ బోర్డుల మీద `కె. కపూర్` అని రాసి ఉంటుంది.;

Update: 2026-01-28 04:15 GMT

బాలీవుడ్ స్టార్లు తెలివైన పెట్టుబ‌డుల‌తో త‌మ డ‌బ్బును రెట్టింపు చేసుకోవ‌డానికి చాలా త‌క్కువ స‌మ‌యాన్ని కోరుకుంటున్న సంగ‌తి తెలిసిందే. కేవ‌లం రెండు మూడేళ్ల‌కే త‌మ సొమ్ముల‌పై ప‌దింత‌లు లాభం తీసిన వారు ఉన్నారు. ముఖ్యంగా అమితాబ్ బ‌చ్చ‌న్, అభిషేక్ బ‌చ్చ‌న్ వంటి స్టార్లు రియ‌ల్ ఎస్టేట్‌లో భారీ పెట్టుబ‌డుల‌తో అత్యంత భారీ లాభాలార్జించారని క‌థ‌నాలొచ్చాయి.

అయితే ఈ వార్ కేవ‌లం బ‌చ్చ‌న్‌ల‌కే ప‌రిమితం కాదు. బాలీవుడ్ స్టార్స్ అక్షయ్ కుమార్ , కరిష్మా కపూర్ వంటి స్టార్లు రియ‌ల్ ఎస్టేట్ లో భారీ పెట్టుబ‌డుల‌తో అసాధార‌ణంగా ఆర్జిస్తున్నారు. ఓ కార్య‌క్ర‌మంలో వీరిద్ద‌రి మధ్య జరిగిన ఈ సరదా సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అక్కీ- బెబో దశాబ్దాలుగా మంచి స్నేహితులు కావడంతో ఒకరిపై ఒకరు తమాషా వ్యాఖ్యలతో విరుచుకుప‌డ్డారు.

ఇటీవల అక్షయ్ కుమార్ హోస్ట్ చేస్తున్న `వీల్ ఆఫ్ ఫార్చ్యూన్` గేమ్ షోకి కరిష్మా కపూర్ అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా అక్కీ మాట్లాడుతూ.. ``ముంబైలోని బాంద్రాలో ఉన్న ప్రతి బిల్డింగ్‌లో కరిష్మా కపూర్‌కు ఒక ఫ్లాట్ ఉంది. బిల్డింగ్ బయట నేమ్ బోర్డుల మీద `కె. కపూర్` అని రాసి ఉంటుంది. వారు తమ పూర్తి పేరు కూడా రాయరు. వాళ్ల అమ్మ బబితా కపూర్ పేరు `బి. కపూర్` అని ఉంటుంది. వీళ్లు శాంతాక్రజ్, ఖార్ వరకు కూడా పాకాలని చూస్తున్నారు`` అంటూ అక్షయ్ సరదాగా ఆటపట్టించారు.

కరిష్మా కపూర్ దీనికి కౌంటర్ వేసారు. అక్షయ్ మాటలకు నవ్వుతూ, కరిష్మా వెంటనే స్పందించారు `అబ్బే! అదేం లేదు. మీ అందరికీ తెలుసా? అసలు ఈయనకు మొత్తం జుహు ప్రాంతమే సొంతం. జుహు అంతా ఈయనదే!``అంటూ ఎదురుదాడికి దిగారు. గతంలో అక్షయ్ ఇలాగే కరీనా కపూర్‌ను కూడా ``నువ్వు బాంద్రాలో ఇన్ని ఫ్లాట్స్ కొని ఏం చేస్తావు? రెంట్లు వస్తున్నాయా?`` అని ఆటపట్టించిన సందర్భాలు ఉన్నాయి.

క‌రీనా క‌పూర్ త‌దుప‌రి సినిమాలు.. దాయిరా, జీలే జ‌రా, గోల్ మాల్ 5, టాక్సిక్ లాంటి క్రేజీ చిత్రాల‌లో న‌టిస్తున్నారు. జీలే జ‌రా ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది. అక్ష‌య్ కుమార్ వెల్ కం టు ది జంగిల్ (వెల్ కం 3) స‌హా ప‌లు భారీ చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా ఉన్నారు.

Tags:    

Similar News