బాలీవుడ్ స్టార్ తో దిల్ రాజు.. బ్లాక్ బస్టర్ ప్లాన్..!

విక్టరీ వెంకటేష్ ఈ ఇయర్ పొంగల్ కి సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్నారు.;

Update: 2025-12-03 12:30 GMT

విక్టరీ వెంకటేష్ ఈ ఇయర్ పొంగల్ కి సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా సక్సెస్ తో దిల్ రాజు బ్యానర్ లో నూతన ఉత్సాహం వచ్చింది. ఐతే కొన్నాళ్లుగా దిల్ రాజు బాలీవుడ్ స్టార్స్ తో సినిమా ప్లానింగ్ లో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. గత రెండు రోజులుగా దిల్ రాజు బ్యానర్ లో సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి సినిమా అంటూ ప్రచారం జరిగింది. ఐతే ఈ వార్తలను ఎస్.వి.సీ బ్యానర్ ఖండించింది. తమ బ్యానర్ నుంచి వచ్చే సినిమాలు ఏవైనా అఫీషియల్ గా అప్డేట్ ఇస్తామని అన్నారు.

SVC బ్యానర్ లో అక్షయ్ కుమార్..

ఐతే సల్మాన్ ఖాన్ తో దిల్ రాజు సినిమా ఉంటుందని వార్తలు వస్తే.. లేటెస్ట్ గా SVC బ్యానర్ లో అక్షయ్ కుమార్ సినిమా అనౌన్స్ చేశారు దిల్ రాజు. అక్షయ్ కుమార్ హీరోగా అనీస్ అజ్మీ డైరెక్షన్ లో సినిమాను ప్రకటించారు. ఐతే తెలుస్తున్న సమాచారం ప్రకారం ఇది వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం రీమేక్ అని చెబుతున్నారు. వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు.

ఇప్పుడు ఈ సినిమా రీమేక్ లోనే అక్షయ్ కుమార్ ని తీసుకున్నారని తెలుస్తుంది. అక్షయ్ కుమార్ తో దిల్ రాజు సినిమా అసలు డిస్కషన్స్ లో లేదు. కానీ సడెన్ గా ఈ కాంబినేషన్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి సర్ ప్రైజ్ చేశారు. ఇక దిల్ రాజు బ్యానర్ లో తెలుగులో విజయ్ దేవరకొండతో రౌడీ జనార్ధన్ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాతో పాటు త్వరలో ఎల్లమ్మ కూడా మొదలవుతుందని తెలుస్తుంది.

సోలోగా బాలీవుడ్ లో సినిమా..

లాస్ట్ ఇయర్ గేమ్ ఛేంజర్ తో డిజాస్టర్ ఫేస్ చేసిన దిల్ రాజు సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మంచి లాభాలు పొందారు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సినిమాలతో పాటు తమ బ్యానర్ నుంచి ఎలాంటి అప్డేట్ అయినా తామే స్వయంగా అనౌన్స్ చేస్తామని రూమర్స్ నమ్మకండి అని ప్రకటించింది SVC బ్యానర్. అంతకుముందు గీతా ఆర్ట్స్ తో కలిసి దిల్ రాజు హిందీలో ప్రొడక్షన్ టచ్ చేసింది. ఐతే ఈసారి మైత్రి మూవీ మేకర్స్ లానే సోలోగా బాలీవుడ్ లో సినిమా ప్రొడ్యూస్ చేయాలని దిల్ రాజు ఫిక్స్ అయ్యారు. అక్షయ్ కుమార్ తో తమ ఫస్ట్ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశారు. ఈ సినిమా గురించి మిగతా డీటైల్స్ త్వరలో తెలుస్తున్నాయి.

దిల్ రాజు తెలుగులో కూడా మరో రెండు భారీ పాన్ ఇండియా సినిమాల ప్లానింగ్ లో ఉన్నారని తెలుస్తుంది. అందులో ఒకటి ప్రభాస్ హీరోగా చేసే ఛాన్స్ ఉందట. రెండో ప్రాజెక్ట్ కూడా స్టార్ హీరో నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే ఆ సినిమా కూడా సెట్ చేసే పనిలో ఉన్నారు దిల్ రాజు.

Tags:    

Similar News