58లో 28 ఎలా? స్టార్ హీరో ఇచ్చిన ఈ టిప్ పాటించండి చాలు
అతడి వయసు 58. కానీ 28 వయసు కుర్రాడిలా ఫిట్ గా ఉంటాడు. మెలి తిరిగిన కండలు, ఫ్యాబ్ పొట్టతో అందరికీ స్ఫూర్తిగా నిలుస్తాడు. అతడి శరీరంలో 5 శాతం కొవ్వు కూడా కనిపించదు.;
అతడి వయసు 58. కానీ 28 వయసు కుర్రాడిలా ఫిట్ గా ఉంటాడు. మెలి తిరిగిన కండలు, ఫ్యాబ్ పొట్టతో అందరికీ స్ఫూర్తిగా నిలుస్తాడు. అతడి శరీరంలో 5 శాతం కొవ్వు కూడా కనిపించదు. అందుకే షష్ఠిపూర్తి వయసుకు చేరువ అవుతున్నా ఇప్పటికీ వరుస సినిమాల్లో ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నాడు. దురదృష్టవశాత్తూ అతడికి ఇటీవల సరైన విజయాలు దక్కడం లేదు. కానీ అతడు నిరుత్సాహపడకుండా అదే జోష్ తో ఒకదాని వెంట ఒకటిగా సినిమాల్లో నటిస్తున్నాడు.
అయితే అతడి బ్యాడ్ టైమ్ కంటే ఇప్పుడు అతడి ఫిట్ నెస్ గురించి యువతరం ఎక్కవగా ఆరాలు తీస్తోంది. దీనికి అతడు ఇచ్చిన సమాధానం వింటే ఆశ్చర్యపోకుండా ఉండలేం. అతడు గత 20 ఏళ్లుగా ఒక ఆహార నియమాన్ని పాటిస్తున్నాడు. ఈ రోజు అతడు 58లోను 28 వయసు కుర్రాడిలా కనిపించడానికి ఇదే అసలు కారణం. ఆ నియమం ఏమిటి? అంటే.. అతడు ఏరోజూ సాయంత్రం 6.30 తర్వాత ఇక ఎలాంటి ఆహారం ముట్టడు. కోలాలు తాగడు. 20ఏళ్లుగా అతడు మద్యం కూడా ముట్టలేదు.
58 ఏళ్ల వయసులో యవ్వనంగా ఫిట్‌గా కనిపించడానికి కారణమిదేనని సెలవిచ్చాడు. నేను జిలేబీ, బర్ఫీ, పూరి చోలే తింటాను కానీ నియమాలు పాటిస్తాను అని తెలిపాడు. తిండి కట్టేయాల్సిన పని లేదని కూడా అతడు పేర్కొన్నాడు. అక్కీ నియమం చాలా మందికి గుణపాఠం కావాలి. లేట్ నైట్ లో మందేసి చిందేసేవారికి లేదా ఆలస్యంగా తిని తెల్లవారు ఝామున నిదురించేవారికి కనువిప్పు కావాలి. రంగుల ప్రపంచంలో ఆల్కహాల్ హ్యాబిట్ గురించి చెప్పాల్సిన పని లేదు. కానీ అక్షయ్ రెండు దశాబ్ధాలుగా ఆల్కహాల్ ముట్టలేదని చెప్పాడు. దీనిని బట్టి ఆ ఒక్క హ్యాబిట్ ప్రజారోగ్యాన్ని ఏ స్థాయిలో దిగజారుస్తుందో అర్థం చేసుకోవచ్చు. స్టార్ హీరోలు ఫిట్ గా కనిపించాలంటే ఏం వదులుకోవాలో.. కఠిన నియమాలతో ఎలా జీవించాలో కూడా అక్షయ్ ఒకు ఉదాహరణగా నిలుస్తాడు. చివరిగా అక్షయ్ కుమార్ నటించిన జాలీ ఎల్.ఎల్.బి 3 చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందినా కానీ ఆశించిన స్థాయి వసూళ్లను సాధించలేదు. ఈ చిత్రం కేవలం రూ.138 కోట్లు వసూలు చేసింది.
ఎండోక్రైన్ సొసైటీ జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రినాలజీ & మెటబాలిజం హెల్త్‌లైన్ కథనం ప్రకారం.. రాత్రి భోజనం ఆలస్యంగా తినడం వల్ల శరీరంలో రోగాలు పెరుగుతాయని తేలింది. సాయంత్రం వేళల్లో ఒకే సమయానికి భోజనం తినే వారితో పోలిస్తే, ఆలస్యంగా భోజనం చేసేవారిలో రక్తంలో సుగర్ స్థాయిలు దాదాపు 20 శాతం ఎక్కువగా .. కొవ్వు దహనం 10 శాతం తక్కువగా ఉందని ఈ అధ్యయనం నిరూపించింది.