10వ అంతస్తు నుంచి దూకమన్నా దూకుతాడు..!
సినిమా ఇండస్ట్రీలో స్టార్‌డం అంత ఈజీగా రాదు, బ్యాక్ గ్రౌండ్ ఉంటే ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వడం ఈజీ అవుతుంది.;
సినిమా ఇండస్ట్రీలో స్టార్‌డం అంత ఈజీగా రాదు, బ్యాక్ గ్రౌండ్ ఉంటే ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వడం ఈజీ అవుతుంది. కానీ ఇండస్ట్రీలో స్టార్‌గా నిలవడం, ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించడం అంత సులభం కాదు. వారసత్వంతో అలాంటివి సాధ్యం కాదని చాలా మంది హీరోల వారసుల ద్వారా నిరూపితం అయ్యింది. దాదాపు మూడు దశాబ్దాలుగా బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక చోటును సంపాదించుకుని, ఒకానొక సమయంలో బాలీవుడ్‌లో మోస్ట్ కాస్ట్లీ హీరోగా, అత్యధిక వంద కోట్ల సినిమాలు ఉన్న హీరోగా పేరు సొంతం చేసుకున్న హీరో అక్షయ్ కుమార్. ఈయన గురించి తాజాగా ప్రముఖ కొరియోగ్రాఫర్ చిన్ని ప్రకాష్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆయన అక్షయ్ కుమార్ యొక్క మొండితనం, అతడికి ఉన్న పట్టుదల గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అక్షయ్ కుమార్ గొప్పతనం..
తన సినిమాను చూసేందుకు వచ్చిన ప్రేక్షకులకు వినోదాన్ని పంచడం కోసం అక్షయ్ కుమార్ ఏం చేసేందుకు అయినా రెడీ అంటాడు. ఆయన చిన్న షాట్ కోసం గంటల తరబడి కష్టపడ్డ సందర్భాలు చాలానే ఉన్నాయి. ఒక పాటలో చుట్టూ అమ్మాయిలు కోడి గుడ్లతో కొట్టించుకున్నాడు. ఏకంగా వంద కోడి గుడ్లను ఆయన కొట్టించుకున్నాడు. ఆ సమయంలో నొప్పిగా ఉన్నప్పటికీ ఏమాత్రం ఇబ్బందిని ఫేస్‌లో చూపించకుండా షాట్‌ను పూర్తి చేశాడు. ఖిలాడి సినిమా కోసం ఆయన వంద కోడి గుడ్లను కొట్టించుకున్నట్లుగా కొరియోగ్రాఫర్ గుర్తు చేసుకున్నాడు. పాట షూటింగ్ పూర్తి అయ్యే వరకు అలాగే ఉన్నాడు. సెట్ లో ఉన్న వారు అంతా కూడా వాసన భరించలేక పోయారు. ఇక ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయినా కూడా ఆయన వాటన్నింటిని తట్టుకుని నిలిచాడు కనుకే బాలీవుడ్ ఖిలాడి అయ్యాడు.
బాలీవుడ్ స్టార్ హీరో...
వంద కోడి గుడ్లు కొట్టించుకున్న అక్షయ్ కుమార్ ఆ వాసన పోగొట్టుకోవడం కోసం చాలా కష్టపడ్డాడు. ఆ కోపంను ఏ ఒక్కరిపై చూపించకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లాడు. అక్షయ్ కుమార్ పాట కోసం, సన్నివేశాల కోసం, యాక్షన్ సన్నివేశాల కోసం పడే కష్టం మామూలుగా ఉండదు. ఆయన ప్రతి ఒక్క సినిమాలో తన బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇప్పటికీ ఆయన అదే తీరుతో వర్క్ చేస్తున్నాడని చిన్ని ప్రకాష్ అన్నాడు. అక్షయ్ కుమార్ నటించిన దాదాపు 50 పాటలకు నేను కొరియోగ్రఫీ అందించాను. ఆయనతో వర్క్ చేస్తున్న సమయంలో గొప్ప అనుభూతి కలుగుతుంది. ఆయనలా ఇండస్ట్రీలో మరెవ్వరూ కష్టపడరు. ఒక పాట కోసం ఆయన పడ్డ కష్టం, పట్టుదల నేను మరే బాలీవుడ్ హీరోలోనూ చూడలేదు అన్నాడు. అందుకే ఆయన స్టార్ హీరో అయ్యాడని అన్నాడు.
కొరియోగ్రాఫర్ చిన్ని ప్రకాష్ ఇంట్రస్టింగ్ కామెంట్స్..
ఇండస్ట్రీకి వచ్చి ఇన్నాళ్లు అయినా కూడా, తానో పెద్ద స్టార్ అయినా కూడా దర్శకుడు, కొరియోగ్రాఫర్ చెప్పినట్లుగానే అక్షయ్ కుమార్ వింటాడు అని ఆయన అన్నాడు. ఆయనతో నేను ఇటీవల హౌస్‌ఫుల్ సినిమా సందర్భంగా వర్క్ చేశాను. అప్పట్లో ఎలా ఉండేవాడో ఇప్పటికీ అలాగే ఉన్నాడు. ఆయన డెడికేషన్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఒక పాట కోసం లేదా సీన్ కోసం పొరపాటున 10వ అంతస్తు నుంచి దూకాలి అంటే వెంటనే దూకేస్తాడు. సినిమా కోసం అంతగా కష్టపడే మనిషిని మనం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. ఆయన ఇండస్ట్రీలో అందరికీ ఆదర్శం అన్నట్లుగా చిన్ని ప్రకాష్ అన్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న అక్షయ్ కుమార్ ఏడాదికి రెండు మూడు సినిమాల చొప్పున ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు కంటిన్యూగా కష్టపడుతూనే ఉంటాడు. ఇండస్ట్రీలో ఆయనంత స్పీడ్‌గా సినిమాలు చేసే వారు మరెవ్వరూ లేరని టాక్ ఉంది.