అకీరా డెబ్యూ.. ఇదే బెస్ట్?

ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ డెబ్యూ ఎవరిదంటే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ దేనని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు;

Update: 2025-10-06 17:30 GMT

ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ డెబ్యూ ఎవరిదంటే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ దేనని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. అకీరా డెబ్యూ కోసం అటు మెగా అభిమానులు.. ఇటు సినీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తొలి సినిమా.. పవన్ వారసుడు ఎప్పుడు చేస్తారోనని వెయిట్ చేస్తున్నారు.

అయితే అకీరా నందన్ డెబ్యూపై ఇప్పటి వరకు వచ్చిన వార్తలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ రీసెంట్ మూవీ ఓజీతోనే అకీరా సినిమాల్లోకి వస్తాడని అంతా అనుకున్నారు. ఫ్యాన్స్ చాలా బలంగా కోరుకున్నారు. కానీ అదేం జరగలేదు. ఎలాంటి పాత్ర కూడా అకీరా చేయలేదు. ప్రయత్నాలు మాత్రం జరిగాయట.

రీసెంట్ గా ఓజీ మూవీలో పవన్ టీనేజ్ రోల్ చేసిన ఆకాష్ శ్రీనివాస్ ఆ విషయాన్ని చెప్పాడు. తాను చేసిన రోల్ ను అకీరాతో చేయించాలని అనుకున్నారని, హైట్ కారణంగా వెనక్కి తగ్గారని తెలిపాడు. ఎత్తు కారణంగానే తన తండ్రి చిన్నప్పటి పాత్ర పోషించే ఛాన్స్ అకీరాకు దూరమైందని తెలిసి అంతా నిరాశపడ్డారు.

కానీ ఇప్పుడు అకీరా డెబ్యూ.. పవన్ మూవీతోనే ఉంటుందని మాత్రం ఫిక్స్ అయ్యారు. అందుకు కారణం ఓజీ డైరెక్టర్ సుజీత్ కామెంట్స్. నిజానికి.. ఓజీ మూవీ చివర్లలో ఓజీ-2 కమింగ్ సూన్ అంటూ ప్రకటించారు. ఆ తర్వాత పోస్ట్ ప్రమోషన్స్ లో సినిమాకు సీక్వెల్, ప్రీక్వెల్ ఉంటుందని అనౌన్స్ చేశారు. దీంతో అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే పోస్ట్ ప్రమోషన్స్ లో అకీరా ఓజీ-2లో నటిస్తాడా అని సుజీత్ ను అడగ్గా.. అది పవన్ ఇష్టమని అన్నారు. ఆ తర్వాత ఇటీవల.. మరో ఇంటర్వ్యూలో సేమ్ క్వశ్చన్ అడగ్గా.. అది ఇప్పుడే చెబితే థ్రిల్ పోతుందనే తెలిపారు. దీంతో అకీరా.. ఓజీ-2లో నటిస్తున్నాడని చెప్పకనే చెప్పారు. చిన్నపాటి క్లారిటీ ఇచ్చారు.

అదే సమయంలో ఇప్పుడు ఓజీ-2తో అకీరా హీరోగా డెబ్యూ ఇస్తారని, పవన్ గెస్ట్ రోల్ లో సందడి చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. ఇందులో నిజమెంతో తెలియదు కానీ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఫ్యాన్స్ మాత్రం అకీరా డెబ్యూకు ఓజీ-2నే బెస్ట్ మూవీ అని చెబుతున్నారు. అకీరా తొలి ప్రాజెక్టు అదే అయితే ఎంతో హ్యాపీ అని అంటున్నారు. మరేం జరుగుతుందో.. అకీరా ఓజీ-2లో హీరోగా నటిస్తాడో.. క్యామియో రోల్ చేస్తాడో వేచి చూడాలి.

Tags:    

Similar News