అఖిల్ మళ్లీ అదే మిస్టేక్..!
ఇంతకీ ఆ సినిమా ఏంటి అంటే అదే అక్కినేని చినబాబు చేస్తున్న లెనిన్ మూవీ. సితార ఎంటర్టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా 80 శాతం షూటింగ్ అయిపోయిందని అన్నారు.;
ఒక సినిమా సెట్స్ మీద ఎక్కువ రోజులు ఉన్నా.. సెట్స్ మీద ఉన్నప్పుడే సినిమా గురించి నెగిటివిటీ స్ప్రెడ్ అయినా.. ఇంకా సినిమా షూటింగ్ పూర్తైన తర్వాత మళ్లీ రీ షూట్స్ చేస్తున్నా సాధారణంగా అలాంటి సినిమాపై ఆడియన్స్ ఇంట్రెస్ట్ పోతుంది. ఎంత మంచి కాంబినేషన్ అయినా కూడా ఆ సినిమాపై ఉన్న బజ్ అంతా కూడా ఈ వార్తల వల్ల పోతుంది. అందుకే మేకర్స్ సినిమాల లీక్స్ విషయంలో భయపడుతుంటారు. ప్రస్తుతం అలాంటి ఒక క్రేజీ సినిమా గురించి ఇలాంటి రకరకాల వార్తలు ఫ్యాన్స్ ని టెన్షన్ లో పడేస్తున్నాయి.
లెనిన్ టీజర్ సర్ ప్రైజ్..
ఇంతకీ ఆ సినిమా ఏంటి అంటే అదే అక్కినేని చినబాబు చేస్తున్న లెనిన్ మూవీ. సితార ఎంటర్టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా 80 శాతం షూటింగ్ అయిపోయిందని అన్నారు. లెనిన్ ఎప్పుడు మొదలు పెట్టారో తెలియదు కానీ టీజర్ వదిలి సర్ ప్రైజ్ చేశారు. అఖిల్ లెనిన్ టీజర్ ఇంప్రెస్ చేసిందే అనుకునేలోగా సినిమా నుంచి రకరకాల వార్తలు వచ్చాయి.
ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే హీరోయిన్ గా శ్రీలీల బయటకు వెళ్లి భాగ్య శ్రీ బోర్స్ ఎంటర్ అయ్యింది. ఈ మార్పు ఎందుకు అన్నది స్పష్టమైన కారణాలు తెలియవు. శ్రీలీల అటు బాలీవుడ్ లో బిజీ అవ్వడం వల్ల ఈ సినిమా వదులుకోవాల్సి వచ్చిందని అంటున్నారు. కానీ అదే మెయిన్ రీజన్ అని మాత్రం తెలియదు. మరోపక్క ఆల్రెడీ శ్రీలీలతో తీసిన సీన్స్ అన్నీ కూడా భాగ్య శ్రీతో రీషూట్ చేస్తున్నారట.
అఖిల్ కెరీర్ లో కమర్షియల్ సూపర్ హిట్..
సినిమా 80 శాతం అయ్యాక రీషూట్ అంటే బడ్జెట్ పెరిగిపోతుంది. ఈ లీక్స్ సినిమాపై ఏర్పడిన కాస్త కూస్తో ఇంపాక్ట్ ని పోగొట్టేలా చేస్తుంది. అఖిల్ లెనిన్ సినిమా అసలైతే డిసెంబర్ రిలీజ్ అనుకున్నారు. తీరా చూస్తే ఈ రీషూట్స్ వల్ల సినిమా నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి, మార్చికి రిలీజ్ వాయిదా పడేలా ఉంది. ఆల్రెడీ అఖిల్ కెరీర్ లో ఒక్క కమర్షియల్ సూపర్ హిట్ లేదని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.
లెనిన్ సినిమా టీజర్ తో సర్ ప్రైజ్ చేసిన అఖిల్ ఈ మూవీతో హిట్ ట్రాక్ ఎక్కుతాడని అనుకోగా ఆ సినిమాకు సంబందించిన రీ షూట్స్ మళ్లీ కన్ ఫ్యూజన్ లో పడేస్తున్నాయి. మరి వారసుడు సినిమాల విషయంలో ఇలా ఎందుకు జరుగుతుందో నాగార్జున కాస్త సీరియస్ గా ఆలోచించాల్సిన పరిస్థితి ఉందనే చెప్పాలి. అఖిల్ లెనిన్ పూర్తైతే నెక్స్ట్ సినిమాను మాత్రం ఎర్లీగానే మొదలు పెట్టేలా ప్లానింగ్ లో ఉన్నారట. ఆల్రెడీ ఆ సినిమా స్టోరీ డిస్కషన్స్ నడుస్తున్నాయని తెలుస్తుంది.