'లెనిన్' లో లగెత్తించే భామ..ఛాన్స్ ఎవరిదంటే?
అక్కినేని వారసుడు అఖిల్ కథానాయకుడిగా మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో `లెనిన్` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.;
అక్కినేని వారసుడు అఖిల్ కథానాయకుడిగా మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో `లెనిన్` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న పీరియాడిక్ చిత్రమిది. అఖిల్ తొలిసారి రాయలసీమ మాండలికం మాట్లాడబోతున్నాడు. ఆ పాత్రకు సంబంధించి కొంత ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ తో అఖిల్ పై ఓ వైబ్ క్రియేట్ అయింది. మునుపటి చిత్రాల కంటే భిన్నమైన రోల్ కావడంతో? కమర్శియల్ గా వర్కౌట్ అవుతుందనే అంచనాలు బలంగా ఉన్నాయి.
మాంచి మాస్ నెంబర్:
భారీ యాక్షన్ కం ఫ్యామిలీ స్టోరీనే మురళీ వైవిథ్యంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అలాగని కమర్శి యల్ అంశాలను ఎంత మాత్రం దూరం పెట్టడం లేదు. కథకు అసవరమైన నవరసాలు సినిమాలో ఉండబోతున్నాయని చిత్ర వర్గాల నుంచి గట్టిగానే వినిపిస్తోంది. ఇందులో అఖిల్ కి జోడీగా భాగ్య శ్రీ బోర్సే నటిస్తోంది. ఆమె పాత్రను గ్లామర్ పరంగా హైలైట్ అయ్యేలా చూస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో కుర్రకారును హీటెక్కించే మాంచి మాస్ నెంబర్ ఒకటి డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ముంబై కి వెళ్లాల్సిన పనిలేదు:
ఆ పాట బాధ్యతలు ఫేమస్ గాయని మంగ్లీకి అప్పగించారట. యువతకు కనెక్ట్ అయ్యే పదాలతో మంగ్లీ గానంతో కుర్రాళ్లకు కిక్కె క్కించేలా ట్యూన్ కూడా సిద్దమైందని తెలిసింది. అయితే ఆ పాటలో నర్తించే భామ ఎవరు? అన్నదే కీలకంగా మారింది. మేకర్స్ ఓ స్టార్ హీరోయిన్ నే రంగంలోకి దించాలనుకుంటు న్నారట. మరి ఆ ఛాన్స్ ఎవరు అందుకుంటారో చూడాలి. స్టార్ హీరోల చిత్రాల్లో ఐటం పాటలంటే? కొంత కాలంగా పేరున్న భామలే ఆడిపాడుతోన్న సంగతి తెలిసిందే. ముంబై నుంచి ప్రత్యేకంగా నర్తకీలను దించాల్సిన పనిలేదు.
శ్రీలీలకు ఛాన్స్ వస్తే:
ప్రస్తుతం సమంత, శ్రీలీల, పూజాహెగ్డే లాంటి భామలు ఐటం పాటలతో బాగా ఫేమస్ అయిన వారు. కాస్త ఓల్డ్ భామల వైపు చూడాలంటే కాజల్ అగర్వాల్, తమన్నా, శ్రియ లాంటి వారిని టచ్ చేయోచ్చు. మరి వీళ్లను కాకుండా అఖిల్ అండ్ కో కొత్త వాళ్లను ట్రై చేస్తే మరింత ప్రెష్ గా ఉంటుంది. రష్మికా మందన్నా? శ్రీలీల లాంటి భామలైతే సినిమాకు అదనంగా కలిసొస్తుందన్నది విశ్లేషకుల మాట. శ్రీలీల `లెనిన్` లో హీరోయిన్ ఛాన్స్ వదులకున్న నేపథ్యంలో ఐటం సాంగ్ లో ఆఫర్ వస్తే అలాగైనా అభిమానులను సంతృప్తి పరుస్తుందా? అన్నది చూడాలి.