అదే నిజ‌మైతే అఖిల్ కెరీర్ లో పెద్ద సాహ‌స‌మే!

న‌టించ‌డంతో పాటు, ఫ‌లితం పాజిటివ్ గా వ‌స్తే ప‌ర్వాలేదు. లేదంటే చాలా విమ‌ర్శ‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. మరి ఈ విష‌యంలో కిషోర్ అబ్బూరి ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడో తెలియాలి.;

Update: 2026-01-04 22:30 GMT

అక్కినేని అఖిల్ క‌థానాయ‌కుడిగా ముర‌ళీ కిషోర్ అబ్బూరి ద‌ర్శ‌క‌త్వంలో` లెనిన్` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే రిలీజ్ అయిన గ్లింప్స్ తో అంచ‌నాలు భారీగా క్రియేట్ అయ్యాయి. అఖిల్ గ‌త ప‌రాజ‌యాల‌తో సంబంధం లేకుండా సినిమాపై మంచి బ‌జ్ నెల‌కొంది. స్టోరీ రాయ‌ల‌సీమ నేప‌థ్యం కావ‌డం..అఖిల్ పాత్ర‌ను క‌మ‌ర్శియ‌ల్ గా మ‌లిచి న తీరు చూస్తే? అఖిల్ ఈసారి బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టేలా ఉన్నాడ‌ని అక్కినేని అభిమానుల్లో కాన్పిడెంట్ రెట్టింపు అయింది. సీమ స్లాంగ్ లో అఖిల్ డైలాగులు ప‌ర్పెక్ట్ గా సింక్ అయ్యాయి. అఖిల్ గ‌త చిత్రాల‌కు పూర్తి భిన్నంగా ట్రై చేస్తోన్న చిత్ర‌మిది.

గ్రామీణ నేప‌థ్యంలో సీమ క‌థ కావ‌డంతో? అఖిల్ పాత్ర‌పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. ఈ నేప‌థ్యంలో అఖిల్ పాత్ర‌కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వెలుగులోకి వ‌చ్చింది. సినిమాలో అఖిల్ పాత్ర దృష్టి లోపంతో ఉంటుంద‌ని.. ఆ కార‌ణంగా అఖిల్ ప‌డే ఇబ్బందుల నేప‌థ్యంలో సాగే ఎమోష‌న‌ల్ డ్రామాగా క‌నెక్ట్ అవుతుంద‌ని అంటున్నారు. ఇంత వ‌ర‌కూ ఈ విష‌యం లీక్ అవ్వ‌లేదు. సీమ క‌థ‌లో అఖిల్ ని ఓ ప‌వ‌ర్ పుల్ పాత్ర‌లో చూపిస్తున్న‌ట్లే ప్ర‌చారం జ‌రిగింది. ఇదే నిజ‌మైతే? అఖిల్ కెరీర్ లో ఓ పెద్ద సాహ‌సం చేస్తున్న‌ట్లే. ఇలాంటి పాత్ర‌లు పోషించ‌డం అంటే? ఏ న‌టుకైనా స‌వాల్ తో కూడిన ప‌నే.

న‌టించ‌డంతో పాటు, ఫ‌లితం పాజిటివ్ గా వ‌స్తే ప‌ర్వాలేదు. లేదంటే చాలా విమ‌ర్శ‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. మరి ఈ విష‌యంలో కిషోర్ అబ్బూరి ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడో తెలియాలి. దృష్టి లోప‌మా? లేక !పూర్తిగా అంధుడి పాత్రా? అన్న‌సందేహాలు రెయిజ్ అవ్వ‌డం త‌ప్ప‌దు. వాటికి మేక‌ర్స్ ఎలాంటి వివ‌ర‌ణ ఇస్తారు? అన్న‌ది చూడాలి. `రాజా ది గ్రేట్` లో మాస్ రాజా ర‌వితేజ కూడా అంధుడి పాత్ర‌లో క‌నిపించిన సంగ‌తి తెలిసిందే. అనీల్ రావిపూడి త‌న‌దైన మార్క్ ట్రీట్ మెంట్ తో హిట్ చేసాడు. ర‌వితేజ అందుడి పాత్ర పోషించ‌డం ఏంట‌ని రిలీజ్ కు ముందు చాలా నెగిటివిటీ స్ప్రెడ్ అయింది.

కానీ రిలీజ్ త‌ర్వాత ఆ సినిమా క‌మ‌ర్శియ‌ల్ గా బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది. మ‌రి `లెనిన్` విష‌యంలో మురిళీ కిషోర్ ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడో చూడాలి. ఈ సినిమాకు సంబంధించి అఖిల్ ప్ర‌త్యేకంగా చిత్తూరు మాండ‌లి కంపై ప‌ట్టు సాధించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌త్యేకంగా ఓ ట్రైన‌ర్ ని నియ‌మించుకుని త‌ర్పీదు పొందాడు. ప్ర‌స్తుతం సెట్స్్ లో ఉన్న సినిమా ఇదే ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు. కొత్త ఏడాది సంద‌ర్భంగా రిలీజ్ తేదీపై క్లారిటీ ఇస్తార‌ని అభిమానులు గెస్ చేసారు గానీ టీమ్ ఎలాంటి లీక్ ఇవ్వ‌లేదు.

Tags:    

Similar News