• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అఖిల్ కొత్త మూవీ.. లెనిన్...

అఖిల్ కొత్త మూవీ.. లెనిన్ గ్లింప్స్ అదుర్స్..

| టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ కెరీర్ లో మంచి హిట్ కొట్టాలని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2025-04-08 13:16 GMT

టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ కెరీర్ లో మంచి హిట్ కొట్టాలని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే. గత చిత్రం ఏజెంట్ మూవీ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయినా.. అనుకున్న స్థాయిలో అఖిల్ మెప్పించలేకపోయారు. దీంతో తన అప్ కమింగ్ మూవీస్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. కథల విషయంలో శ్రద్ధ తీసుకుంటున్నారట.

ఇప్పుడు రెండేళ్ల తర్వాత గుడ్ న్యూస్ చెప్పారు అఖిల్. తన కొత్త మూవీని అనౌన్స్ చేశారు. బర్త్ డే సందర్భంగా ఆ సినిమా గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. వినరో భాగ్యము విష్ణు కథతో ఇప్పటికే మూవీ లవర్స్ ను మెప్పించిన మురళీ కిషోర్ అబ్బూరు.. అఖిల్ కొత్త మూవీని తెరకెక్కిస్తున్నారు. ఎప్పటి నుంచో టాక్ వస్తున్నట్లు లెనిన్ అనే టైటిల్ నే ఫిక్స్ చేశారు.

అన్నపూర్ణ స్టూడియోస్ తో పాటు సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్న లెనిన్ లో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ తో రూపొందుతున్న లెనిన్ మూవీ గ్లింప్స్.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందరినీ ఆకట్టుకుని దూసుకుపోతోంది.

స్టన్నింగ్ విజువల్స్ తో గ్లింప్స్ స్టార్ట్ అవ్వగా.. రథం ఎంట్రీ ఇచ్చింది. అప్పుడే మాస్ లుక్ లో అఖిల్ చేతిలో ఆయుధంతో నడుస్తూ కనిపించారు. గతాన్ని తరమటానికి పోతా.. మా నాయిన నాకో మాట సెప్పినాడు. పుట్టేటప్పుడు ఊపిరి ఉంటాదిరా పేరు ఉండదు. అట్నే పోయేటప్పుడు ఊపిరి ఉండదు పేరు మాత్రమే ఉంటాది. ఈ పేరు ఎట్లా నిల‌బ‌డాలి అంటే అంటూ ఓ రేంజ్ లో సాగింది గ్లింప్స్.

ఆ తర్వాత అఖిల్, శ్రీలీలను రివీల్ చేశారు మేకర్స్. మాస్ లుక్ లో హీరో ఉండగా.. ఆయనను చేతిని పట్టుకుని హీరోయిన్ నిలబడి ఉన్నారు. అనంతరం హ్యాపీ బర్త్ డే అంటూ విషెస్ చెప్పారు మేకర్స్. ప్రేమ కంటే హింసాత్మకమైనది యుద్ధం కాదని అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అయితే గ్లింప్స్ బట్టి.. మూవీ రూరల్ లవ్ డ్రామాగా క్లియర్ గా తెలుస్తోంది.

అయితే లెనిన్ మూవీకి గాను అఖిల్ ఫుల్ గా మేకోవర్ చేసుకున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. మాస్ లుక్ ఆయనకు బాగా సెట్ అయినట్లు కనిపిస్తోంది. శ్రీలీల కూడా క్యూట్ గా కనిపిస్తున్నారు. తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుండగా.. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. మొత్తానికి రెండేళ్ల తర్వాత మూవీ అనౌన్స్మెంట్ రాగా.. గ్లింప్స్ అదిరిపోయిందని అందరూ చెబుతున్నారు.

This role is going to be remembered for a long time!! 💥Can’t wait for you all to witness @AkhilAkkineni8 in his most stunning avatar 🔥Presenting you all ~ #LENIN ❤️‍🔥#Akhil6 @sreeleela14 @iamnagarjuna @KishoreAbburu @MusicThaman @NavinNooli @artkolla #NaveenKumarI… pic.twitter.com/IsyooyDViq

— Naga Vamsi (@vamsi84) April 8, 2025
Tags:    
  • AnnapurnaStudios 
  • SitharaEntertainments 
  • Telugucinema 
  • AkhilAkkineni 
  • LeninMovie 
  • AkhilAkkineniLenin 
  • NagarjunaAkkineni 
  • NagaVamsi 
  • MuraliKishorAbburu 

Similar News

AK 47 : ఆ కఠినమైన పని చేయడం అంత సులువు కాదు గురూజీ..!

2026-11-04 17:44 GMT

రాజమౌళి వచ్చాక ఇంటర్వెల్ సీన్స్ మారిపోయాయా? ఇంతకీ ఆయన ఏం చేశాడు...

2026-11-04 17:30 GMT

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

Copyright @2026

Powered by Blink CMS