అఖండ రాకతో.. బాక్సాఫీస్ పోటీలో తారుమారు
ఇప్పుడు మరో రెండు రోజుల్లో సినిమా విడుదల అవ్వనుంది. అయితే డిసెంబర్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ఇప్పటికే పలు చిన్న చిత్రాలు సిద్ధమయ్యాయి.;
అఖండ 2: తాండవం మూవీ విడుదలకు లైన్ క్లియర్ అయిన విషయం తెలిసిందే. టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ లీడ్ రోల్ లో బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా.. డిసెంబర్ 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ముందు రోజు.. డిసెంబర్ 11వ తేదీ ప్రీమియర్స్ కూడా పడనున్నాయి.
నిజానికి డిసెంబర్ 5వ తేదీన అఖండ 2 విడుదల కావాల్సి ఉండగా.. చివరి నిమిషంలో వాయిదా పడింది. నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్స్ ఆర్థిక సమస్యల్లో చిక్కుకోవడం వల్ల పోస్ట్ పోన్ అయింది. న్యాయస్థానం అనుమతి ఇవ్వడంతో.. రీసెంట్ గా కొత్త విడుదల తేదీని సోషల్ మీడియాలో 14 రీల్స్ ప్లస్ అనౌన్స్ చేసింది.
ఇప్పుడు మరో రెండు రోజుల్లో సినిమా విడుదల అవ్వనుంది. అయితే డిసెంబర్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ఇప్పటికే పలు చిన్న చిత్రాలు సిద్ధమయ్యాయి. అందులో మోగ్లీ, సైక్ సిద్ధార్థ్, అన్న గారు వస్తారు, ఈషా సినిమాలు ఉండగా.. ఆయా రిలీజ్ డేట్స్ ను ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేసి ప్రమోషన్స్ కూడా చేపట్టారు.
కానీ ఇప్పుడు అఖండ 2 రిలీజ్ అవుతుండడంతో.. షెడ్యూల్ అంతా చేంజ్ అయిపోయింది. ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం, డిసెంబర్ 12వ తేదీన అఖండ 2, అన్నగారు వస్తారు మూవీలు మాత్రమే వస్తున్నాయి. మిగతా సినిమాల విడుదల తేదీలు మారిపోయాయి. అఖండ కోసం సైడ్ తప్పుకున్నాయని చెప్పాలి.
కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ నటించిన అన్నగారు వస్తారు మూవీ.. డిసెంబర్ ఫస్ట్ వీక్ లోనే రావాల్సి ఉంది. కానీ అప్పుడు అఖండ కోసమే పోటీ నుంచి తప్పుకుంది. డిసెంబర్ 12కు వాయిదా పడింది. ఇప్పుడు అఖండ 2 కూడా ఆ రోజే వస్తుంది. కానీ అన్నగారు వస్తారు చిత్రం మాత్రం పోస్ట్ పోన్ అవ్వడం లేదు. థియేటర్స్ లో విడుదల అవుతుంది.
అయితే యంగ్ హీరో రోషన్ కనకాల లీడ్ రోల్ లో నటించిన మోగ్లీ మూవీ.. డిసెంబర్ 13వ తేదీకి రిలీజ్ అవ్వనుంది. ఒక్క రోజు ఆలస్యంగా రానుంది. ఆ తర్వాత యువ కథానాయకుడు శ్రీ నందు హీరోగా నటించిన సైక్ సిద్ధార్థ్ మూవీ.. జనవరి 1వ తేదీకి పోస్ట్ పోన్ అయింది. త్రిగుణ్, హెబ్బా పటేల్ కీలక పాత్రల్లో రానున్న హారర్ థిల్లర్ ఈషా విడుదల డిసెంబర్ లాస్ట్ వీక్(25) కి మారింది.