పెద్దోళ్లు చిన్నోళ్ల గురించి ఆలోచించరా?
స్టార్ హీరోల చిత్రాలు రిలీజ్ అవుతున్నాయంటే? ఆ తేదీల్లో చిన్న సినిమాలేవి రిలీజ్ అవ్వవు. అగ్ర హీరోలతో మనకెందుకు పోటీ వెళ్తే! నష్టపోయేది మనమేనని సైలెంట్ గా ఉంటారు.;
స్టార్ హీరోల చిత్రాలు రిలీజ్ అవుతున్నాయంటే? ఆ తేదీల్లో చిన్న సినిమాలేవి రిలీజ్ అవ్వవు. అగ్ర హీరోలతో మనకెందుకు పోటీ వెళ్తే! నష్టపోయేది మనమేనని సైలెంట్ గా ఉంటారు. ఈ క్రమంలో స్టార్ హీరోలు సినిమాలు రిలీజ్ లేని సమయం చూసుకుని తేదీలు ప్రకటిస్తుంటారు. కానీ ఇక్కడా చిన్న సినిమా నిర్మాతలు దోపిడికి గురవుతున్నారు. అనివార్య కారణాలతో అగ్ర హీరోల సినిమాలు రిలీజ్ వాయిదా పడితే? ఆ చిన్న సినిమాల రిలీజ్ తేదీల మీద పడతారు. అప్పటికప్పుడు వెనకా ముందు ఆలోచించకుండా కొత్త తేదీని ప్రకటిస్తుంటారు.
దీంతో చిన్న సినిమా నిర్మాతలు వెనక్కి తగ్గాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. అప్పటికే ప్రణాళిక అంతా సిద్దం చేసుకుని రెడీగా ఉంటారు. థియేటర్లు సహా సర్వమంతా సిద్దమవుతుంది. ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. కానీ ఒక్కసారిగా అగ్ర హీరో సినిమా పోటీలో ఉందంటే? అప్పటికప్పుడు చిన్న నిర్మాత వెనక్కి తగ్గాల్సిన పరిస్థితులు ఎన్నో చూసాం. దగ్గర రిలీజ్ తేదీలు వచ్చాయంటే? ప్రచారానికి పెట్టిన ఖర్చు కూడా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. తాజాగా బాలయ్య నటించిన `అఖండ 2` డిసెంబర్ 12న రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
వాస్తవానికి డిసెంబర్ 5న రిలీజ్ అవ్వాల్సిన సినిమా అప్పటికప్పుడు వాయిదా పడింది. తాజాగా 12వ తేదీ ఫిక్స్ చేసుకోవడంతో? ఆ తేదీని రిలీజ్ అవ్వాల్సిన సినిమాలన్నీ వాయిదా పడినట్లే. అంతకు ముందు పవన్ కళ్యాణ్ నటించిన `హరిహరవీరమల్లు`, `ఓజీ` సినిమాల విషయంలో కూడా ఇలాంటి సన్నివేశమే చోటు చేసుకుంది. ఆ రెండు సినిమాల రిలీజ్ తేదీలు ఎన్నిసార్లు ప్రకటించిన వెనక్కి తీసుకున్నారో చెప్పాల్సిన పనిలేదు. ఎంతో కాన్పిడెంట్ గా వచ్చేస్తున్నామని వెల్లడించారు. కానీ చివరి నిమిషంలో ఏదో కారణంతో వాయిదాలు పడ్డాయి.
ఆ కారణంగా చాలా సినిమాల రిలీజ్ లకు ఇబ్బంది ఏర్పడింది. ఈ నేపథ్యంలో పెద్ద నిర్మాతలతో పాటు ఆ సినిమా ల్లో నటించిన హీరోలు కూడా చిన్న సినిమాల రిలీజ్ గురించి ఆలోంచించి నిర్ణయాలు తీసుకోవాలని హితవు పలుకుతున్నారు. అగ్ర హీరోల కారణంగా టైర్ 2, టైర్ 3 హీరోలు నటించిన సినిమాలు కూడా వాయిదా పడుతుంటాయి. ఏ స్టార్ హీరో సినిమాకు పోటీగా రావడానికి ఏ నటుడు ఆసక్తి చూపించడు. నిర్మాత శ్రేయస్సు కోరి రిలీజ్ అన్నది అతడి అనుకూలాన్ని బట్టే ఉండాలని భావిస్తుంటారు. మరి చిన్న హీరోలు, నిర్మాతల్లా అగ్ర హీరోలు, నిర్మాతలు ఆలోచిస్తారా? లేదా? అన్నది వారి విచక్షణకే వదిలేయాలి.