అఖండ 2: బాక్సాఫీస్ బొమ్మ కోసం కాపీలు రెడీ!
బాలయ్య ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని చూస్తున్న టైమ్ వచ్చేసింది. మరికొద్ది గంటల్లో థియేటర్లలో జాతర మొదలుకాబోతోంది.;
బాలయ్య ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని చూస్తున్న టైమ్ వచ్చేసింది. మరికొద్ది గంటల్లో థియేటర్లలో జాతర మొదలుకాబోతోంది. భారీ అంచనాల మధ్య వస్తున్న 'అఖండ 2: తాండవం' రిలీజ్ కు సంబంధించిన అన్ని పనులు సజావుగా పూర్తయ్యాయి. లేటెస్ట్ గా సినిమా కాపీలు కూడా డెలివరీ అయిపోయాయని మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. అంటే ఎక్కడా చిన్న అవాంతరం కూడా లేకుండా, పక్కా ప్లానింగ్ తో సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు.
రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో హడావిడి పీక్స్ కి చేరింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ సినిమా బుకింగ్స్ ను ఈరోజే ఓపెన్ చేశారు. బుకింగ్స్ మొదలైన కొద్ది నిమిషాల్లోనే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయని సమాచారం. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఇక నైజాంలో బుకింగ్స్ ఇంకా ఓపెన్ కాలేదు. అవి కూడా మరికొన్ని గంటల్లో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఫ్యాన్స్ ఉత్సాహం చూస్తుంటే మొదటి రోజు కలెక్షన్ల పరంగా రికార్డులు బద్దలవ్వడం ఖాయంలా కనిపిస్తోంది.
'అఖండ' మొదటి భాగం సృష్టించిన ఇంపాక్ట్ వల్ల ఈ సీక్వెల్ పై అంచనాలు డబుల్ అయ్యాయి. దానికి తగ్గట్టే బోయపాటి శ్రీను ఈసారి విజువల్స్, యాక్షన్ పార్ట్ ను నెక్స్ట్ లెవెల్ లో డిజైన్ చేశారట. ఏపీ ప్రభుత్వం నుంచి టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతులు రావడంతో డిస్ట్రిబ్యూటర్లు కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అర్ధరాత్రి నుంచే స్పెషల్ షోలతో రచ్చ చేయడానికి ఫ్యాన్స్ రెడీ అయిపోయారు.
ఈ సినిమాకు తమన్ సంగీతం ప్రధాన ఆకర్షణ కానుంది. ఇప్పటికే రిలీజైన పాటలు, ట్రైలర్ లోని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్ ని ఎలివేట్ చేశాయి. థియేటర్లో సౌండ్ సిస్టమ్ దద్దరిల్లిపోయేలా తమన్ వర్క్ చేశారని టాక్. అలాగే విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ విషయంలోనూ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని, శివుడి ఎలిమెంట్స్ ను చాలా గొప్పగా చూపించారని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది.
బాలయ్య, బోయపాటి కాంబినేషన్ అంటేనే బాక్సాఫీస్ దగ్గర మినిమమ్ గ్యారెంటీ. అందులోనూ 'అఖండ' లాంటి పవర్ ఫుల్ పాత్ర మళ్లీ వస్తుందంటే ఆ కిక్కే వేరు. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ఈ సినిమాతో బాలయ్య మరోసారి తన మార్క్ చూపించడానికి వస్తున్నారు. మాస్, డివోషనల్ ఎలిమెంట్స్ కలగలిపిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియెన్స్ ను కూడా థియేటర్లకు రప్పిస్తుందని గట్టిగా నమ్ముతున్నారు.
ఫైనల్ గా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని 'అఖండ 2' బాక్సాఫీస్ వేటకు రెడీ అయ్యింది. కాపీలు డెలివరీ అయిపోయాయి, బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.. ఇక మిగిలింది వెండితెరపై ఆ విధ్వంసాన్ని చూడటమే. ఆ "మైటీ రోర్" వినడానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో సంచలనం సృష్టిస్తుందో, పాత రికార్డులను ఎలా తిరగరాస్తుందో చూడాలి.