అఖండకు వరుస షాక్ లు.. ఇప్పుడు మరో పిటిషన్..
నిజానికి డిసెంబర్ 5వ తేదీన సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా.. మద్రాసు హైకోర్టు మూవీ విడుదలపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.;
టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందిన అఖండ 2: తాండవం మూవీ రీసెంట్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. డివైన్ ఎలిమెంట్స్ తో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కగా... నేడు వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజైంది. నిన్న ప్రీమియర్స్ తో సినిమా సందడి మొదలైంది.
నిజానికి డిసెంబర్ 5వ తేదీన సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా.. మద్రాసు హైకోర్టు మూవీ విడుదలపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థిక సమస్యలతో పేరుకుపోయిన.. అఖండ సీక్వెల్ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్స్ వాటిని క్లియర్ చేసుకుని ఎట్టకేలకు రిలీజ్ చేసింది. నిన్న ప్రీమియర్స్ కూడా వేసింది.
కానీ ప్రీమియర్స్ కు కొన్ని గంటల ముందు తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే నిర్మాణ సంస్థ అందుకున్న ప్రీమియర్ షో టికెట్ ధరల పెంపు జీవోను గురువారం మధ్యాహ్నం సస్పెండ్ చేసింది. దీంతో ప్రీమియర్స్ రద్దు అయిపోతాయని వార్తలు రాగా.. ఆడియన్స్, అభిమానులు కోసం మేకర్స్ వేశారు.
అయితే ఇప్పుడు ఆ విషయంపై హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను నిర్మాణ సంస్థ ఉల్లంఘించిందని విజయ్ గోపాల్ అనే న్యాయవాది.. తన పిటిషన్ లో పేర్కొన్నారు. కోర్టు ఉత్తర్వులు ఇచ్చినా.. ప్రీమియర్స్ షోస్ ను మేకర్స్ వేశారని చెప్పారు. అందుకుగాను తాజాగా ఆయన కోర్టు ధిక్కరణ పిటిషన్ ను దాఖలు చేశారు.
దీంతో విచారణకు అంగీకరించింది న్యాయస్థానం. మధ్యాహ్నం విచారణ చేపడతామని వెల్లడించింది. ఇప్పుడు ఆ విషయం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందోనన్న విషయంపై అంతా దృష్టి సారించారు. అయితే నిన్న ధరల పెంపు జీవోను రద్దు చేసిన కేసు విచారణను కూడా నేటికే వాయిదా వేసింది కోర్టు.
నిజానికి.. అఖండ-2 చిత్రానికి తెలంగాణలో టికెట్ల రేట్లు భారీగా పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జీఎస్టీతో కలుపుకొని సింగిల్ స్క్రీన్లకు టికెట్ పై రూ.50, మల్టీప్లెక్ల్సుల్లో టికెట్ ధరపై రూ.100 పెంచుకునే ఛాన్స్ ఇచ్చింది. డిసెంబర్ 11న రాత్రి 8 గంటలకు ప్రీమియర్ షోకు రూ.600 టికెట్ రేటుకు అనుమతులు ఇస్తూ జీవోలో పేర్కొంది. ఇప్పుడు దానిపైనే హైకోర్టులో వ్యవహారం నడుస్తోంది.