బాలయ్య 'తాండవం'.. రన్ టైమ్ సంగతేంటి?

టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ.. బ్లాక్ బస్టర్ మూవీ అఖండకు సీక్వెల్ గా రూపొందుతున్న అఖండ 2: తాండవం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.;

Update: 2025-11-29 04:24 GMT

టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ.. బ్లాక్ బస్టర్ మూవీ అఖండకు సీక్వెల్ గా రూపొందుతున్న అఖండ 2: తాండవం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఆ సినిమా.. పాన్ ఇండియా రేంజ్ లో డిసెంబర్ 5వ తేదీన గ్రాండ్ గా విడుదల కానుంది.

రిలీజ్ కు తక్కువ రోజులే సమయం ఉండటంతో ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తున్నారు మేకర్స్. ప్రమోషనల్ కంటెంట్ తో సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నారు. రీసెంట్ గా కొత్త గ్లింప్స్ ను రిలీజ్ చేసిన సంగతి విదితమే. అదే సమయంలో మూవీ విడుదలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడంలో ఫుల్ బిజీగా ఉన్నారు మేకర్స్.

అందులో భాగంగా సెన్సార్ ఫార్మాలిటీస్ ను రీసెంట్ గా కంప్లీట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. సినిమా థియేట్రికల్ రిలీజ్ వెర్షన్ ను చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు.. యూ/ఏ సర్టిఫికెట్ ను జారీ చేశారని సమాచారం. సినిమా అద్భుతంగా ఉండబోతుందని వారి అభిప్రాయాలను తెలియజేసినట్లు సినీ వర్గాల్లో ఇప్పుడు టాక్ వినిపిస్తోంది.

అదే సమయంలో మూవీ రన్ టైమ్ ను ఫిక్స్ చేశారని సమాచారం. 2 గంటల 45 నిమిషాల నిడివిని మూవీ రన్ టైమ్ లాక్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో సినిమా పర్ఫెక్ట్ అండ్ క్రిస్పీ రన్ టైమ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోందని క్లియర్ గా అర్థమవుతుంది. ఆడియన్స్ ఈజీగా విట్నెస్ చేసే రన్ టైమ్ తో మూవీ సందడి చేయనుందని చెప్పాలి.

అయితే అఖండ 2పై ఆడియన్స్ లో అంచనాలు ఇప్పటికే భారీగా ఉన్నాయి. బోయపాటి బాలయ్య కాంబినేషన్ సూపర్ హిట్ అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే వారి కాంబోలో వచ్చిన సినిమాలన్నీ అద్భుతమైన విజయం సాధించాయి. ఇప్పుడు అఖండ-2 కూడా అంతే రీతిలో హిట్ అవుతుందని అంతా అంచనా వేస్తున్నారు.

ఇక సినిమా విషయానికొస్తే.. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై గోపి ఆచంట, రామ్ ఆచంట నిర్మిస్తుండగా.. బాలయ్య కుమార్తె తేజస్విని ప్రెజెంటర్ గా వ్యవహరిస్తున్నారు. బాలకృష్ణకు జోడీగా నటి సంయుక్త మీనన్ నటిస్తున్నారు. ఎస్ ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. మరి అఖండ సీక్వెల్ ఎలాంటి విజయం సాధిస్తుందో.. ఎంతలా మెప్పిస్తుందో.. బాక్సాఫీస్ వద్ద ఎన్ని సంచలనాలను సృష్టించబోతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News