అఖండ 2.. అందులో బాలయ్య చేసేదేముంది?

అప్పుడు 14 రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్స్ పై నిర్మించేందుకు రామ్ ఆచంట, గోపీ ఆచంటకు అవకాశం వచ్చింది. సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది.;

Update: 2025-12-07 09:39 GMT

బ్లాక్ బస్టర్ హిట్ అఖండకు సీక్వెల్ గా నందమూరి బాలకృష్ణ లీడ్ రోల్ లో నటించిన అఖండ 2 తాండవం మూవీ వాయిదా పడిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ కావాల్సిన ఉండగా.. సినిమా నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఆర్థిక సమస్యల్లో చిక్కుకుపోవడంతోపాటు హైకోర్టు ఆదేశాల వల్ల పోస్ట్ పోన్ అయింది.

బాలీవుడ్ కు చెందిన ఈరోస్ ఎంటర్టైన్మెంట్స్.. అఖండ-2 విడుదలకు కొద్ది రోజుల ముందు మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. తమకు 14 రీల్స్ ప్లస్ సంస్థ రూ.28 కోట్ల బకాయిలు ఉందని.. ఆ డబ్బులిచ్చే వరకు అఖండ 2 రిలీజ్ చేయకుండా ఆదేశాలివ్వాలని పిటిషన్ వేసింది. విచారణ జరిపిన కోర్టు, ఈరోస్ కు అనుకూలంగా ఉత్తర్వులిచ్చింది.

దీంతో సినిమాకు ఆటంకం ఎదురైంది. అయితే ఆ తర్వాత నిర్మాణ సంస్థపై అనేక విమర్శలు వచ్చాయి. ఎందుకంటే అఖండ మూవీని అప్పుడు ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు. మంచి లాభాలు అందుకున్నారు. కానీ ఏం జరిగిందో తెలియదు. అఖండ 2 ప్రాజెక్టు నిర్మాణం నుంచి ఆయన తప్పుకున్నారు.

అప్పుడు 14 రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్స్ పై నిర్మించేందుకు రామ్ ఆచంట, గోపీ ఆచంటకు అవకాశం వచ్చింది. సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. ముందే అన్ని డీల్స్ కుదిరి అప్పుడే టేబుల్ ప్రాఫిట్స్ కూడా వచ్చాయని టాక్. కానీ ఎప్పటి నుంచి ఉన్న.. దాదాపు ఆరేళ్ల క్రితం నాటి సమస్యలు క్లియర్ చేసుకోకపోవడం వల్ల ఇప్పుడు ఇలా జరిగింది.

ఇప్పుడు వాటిని క్లియర్ చేస్తున్నట్లు తెలుస్తున్నా.. జరగాల్సిన నష్టం మాత్రం జరిగిందనే చెప్పాలి. అయితే ఇప్పుడు బాలయ్య నిర్మాణ సంస్థ ఆర్థిక సమస్యలను పరిష్కరించలేదని.. చేసి ఉంటే ఇబ్బంది ఉండేది కాదని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. దీంతో బాలయ్య అభిమానులు రెస్పాండ్ అవుతున్నారు. క్లియర్ గా వివరిస్తున్నారు కూడా.

వారి ప్రకారం, బాలయ్య.. సినిమా నిర్మించేందుకు ఛాన్స్ ఇచ్చారు.. సినిమాను బాగా ప్రమోట్ చేశారు.. మంచి బజ్ క్రియేట్ అయ్యేలా చేశారు. కానీ రిలీజ్ మ్యాటర్ నిర్మాతల చేతిలో ఉంటుంది. వారే ఎలాంటి ఇబ్బందులు లేకుండా విడుదల చేయాలి. ఇప్పుడు అఖండ వాయిదా విషయంలో బాలయ్య చేసేదేముంది. ఆర్థిక సమస్యలను క్లియర్ చేసుకోవాల్సింది నిర్మాతలే.

ఎందుకంటే హీరోలు నటిస్తారు.. ప్రమోట్ చేస్తారు.. రెమ్యునరేషన్ అందుకుంటారు.. రిజల్ట్ ను ఓన్ చేసుకుంటారు.. కానీ నిర్మాణ సంస్థల బకాయిలు తీర్చరు కదా.. ఇప్పుడు అఖండ విషయంలో బాలయ్య కూడా అంతే. కాబట్టి కొందరు చేస్తున్న విమర్శలను నటసింహం అభిమానులు కొట్టిపారేస్తున్నారు. గట్టి కౌంటర్లు కూడా ఇస్తున్నారు.

Tags:    

Similar News