అఖండ 2 రిలీజ్.. మళ్లీ ప్లాన్ మారిందా?

ఇక ఇప్పుడు రిలీజ్ డేట్‌పై కొత్త బజ్ నడుస్తోంది. డిసెంబర్ 5న రిలీజ్ అవ్వాల్సిన రాజా సాబ్ జనవరికి వెళ్లిపోయింది.;

Update: 2025-09-02 22:30 GMT

టాలీవుడ్‌లో మాస్ ఆడియన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ అఖండ 2:తాండవం. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. మొదటి భాగం అఖండ సూపర్ సక్సెస్ కావడంతో సీక్వెల్‌పై మాస్ ఆడియన్స్ ఎక్సైట్మెంట్ మరో లెవెల్‌లో ఉంది. సెప్టెంబర్‌లోనే ఈ సినిమా రావాల్సి ఉండగా, పోస్ట్ ప్రొడక్షన్ జాప్యం కారణంగా వాయిదా పడింది.

ఇక ఇప్పుడు రిలీజ్ డేట్‌పై కొత్త బజ్ నడుస్తోంది. డిసెంబర్ 5న రిలీజ్ అవ్వాల్సిన రాజా సాబ్ జనవరికి వెళ్లిపోయింది. దీంతో ఆ డేట్ ఖాళీగా ఉందనే టాక్ మొదలైంది. అదే సమయంలో అఖండ 2 వస్తే బెస్ట్ అని అనుకున్నారు. మేకర్స్ కూడా అదే ఆలోచించారు.

కానీ ఇప్పుడు ఏమైందో ఏమో గానీ అఖండ కూడా కూడా జనవరి స్లాట్‌కి షిఫ్ట్ అయ్యే అవకాశముందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ కొత్త రూమర్స్ ఫ్యాన్స్‌లో హైప్ పెంచుతున్నాయి. జనవరిలో సంక్రాంతి సీజన్ ఉంటే, అఖండ 2 లాంటి మాస్ ఎంటర్‌టైనర్ రాక ఆడియన్స్‌కి పండుగ పండగలా మారనుంది.

సినిమాకు సంబంధించిన మ్యూజిక్‌ని థమన్ అందిస్తున్నారు. ఈసారి థమన్ మ్యూజిక్ మరింత మాస్ రేంజ్‌లో ఉంటుందని అంచనాలు. అదే సమయంలో యాక్షన్ బ్లాక్స్‌ను హాలీవుడ్ స్టంట్స్ స్థాయిలో డిజైన్ చేస్తున్నారని సమాచారం. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంటలు ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా మేకింగ్ కొనసాగుతోంది.

బోయపాటి - బాలయ్య కాంబినేషన్‌లో వచ్చిన సింహా, లెజెండ్, అఖండ మూడు బ్లాక్‌బస్టర్లు కావడంతో ఈ నాలుగో కాంబోపై నమ్మకం రెట్టింపైంది. అభిమానులు సోషల్ మీడియాలో “జనవరి అంటే నందమూరి బాక్సాఫీస్” అంటూ ఫుల్ హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఒకవైపు రాజా సాబ్ వెనక్కి వెళ్ళడంతో, మరోవైపు అఖండ 2 జనవరి సీజన్‌కి వస్తుందనే బజ్‌తో, ఇప్పుడు ఈ సీజన్ మరింత ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News